Fish Curry Issue: చేపల కూర గొడవ..మంచం కోడితో వ్యక్తిని చంపిన మరో వ్యక్తి, శ్రీకాకాళం జిల్లా అనుమానాస్పద హత్యను చేధించిన పోలీసులు, మీడియాకు వివరాలను వెల్లడించిన పాతపట్నం సీఐ రవిప్రసాద్
అతను హత్యకు గురైనట్టుగా నిర్థారించారు. మొత్తం ఏడుగురిపై కేసు నమోదైంది.
Amaravati, Jan 24: శ్రీకాకుళం జిల్లా అవలింగి గ్రామంలో అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి చెందిన కేసును పోలీసులు ఛేదించారు. అతను హత్యకు గురైనట్టుగా నిర్థారించారు. మొత్తం ఏడుగురిపై కేసు నమోదైంది. పాతపట్నం సీఐ రవిప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. కాకినాడకు చెందిన గంటా పాండురంగారావు సారవకోట మండలంలోని బుడితి సమీపంలో జరుగుతున్న రక్షిత మంచినీటి పథకం ట్యాంకు నిర్మాణ పనుల కోసం మూడు నెలల క్రితం వచ్చి అవలింగిలో అద్దెకు ఇల్లు తీసుకుని ఉంటున్నాడు.
కాగా సంక్రాంతి పండుగ కోసం స్వగ్రామానికి వెళ్లిన ఆయన తనకు పరిచయం ఉన్న తూర్పుగోదావరి జిల్లా కట్టమూరు గ్రామానికి చెందిన పాలమూరి ప్రసాద్ (60)ని తనతో పాటు ఈ నెల 21వ తేదీన అవలంగి గ్రామానికి తీసుకొనివచ్చాడు. వీరిద్దరూ స్థానికంగా ఉంటున్న మరో ఇద్దరుతో కలిసి ఆదేరోజు రాత్రి చేపల కూర (Fish Curry) చేసుకుని మద్యం తెచ్చుకుని పూటుగా తాగారు. అయితే చేపల కూర విషయంలో పాండురంగారావు, ప్రసాద్ మధ్య గొడవ తలెత్తింది.
దీంతో సహనం కోల్పోయిన పాండురంగారావు మంచం కోడుతో ప్రసాద్ తల, చేతులపై కొట్టడంతో మృతి (Fish Curry Issue) చెందాడు. దీంతో మృతదేహాన్ని మరో అయిదుగురితో కలిసిన చెత్త సేకరణ బండిలో తీసుకొని వెళ్లి సమీపంలో ఉన్న చెరువు గట్టుపై పాతి పెట్టారు. విషయం బయటకు పొక్కడంతో గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించడంతో ఘోరం (One man dead in fish curry issue in ap) వెలుగు చూసింది.
వీఆర్వో అప్పారావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. తహసీల్దార్ రాజమోహన్ సమక్షంలో శనివారం ప్రసాద్ మృతదేహాన్ని బయటకు తీసి శవపంచనామా నిర్వహించిన అనంతరం పోస్టుమార్టం కోసం పాతపట్నం తరలించారు. ఈ ఘటనలో పాండురంగారావు, కాకినాడకు చెందిన ట్యాంకు నిర్మాణ కాంట్రాక్టర్, మృతదేహాన్ని తరలించి పాతిపెట్టేందుకు సహకరించిన అవలింగి గ్రామానికి చెందిన ఐదుగురిపై కేసు నమోదు చేసినట్లు సీఐ వివరించారు.