Accident In Bapatla: బాపట్లలో ఘోర రోడ్డు ప్రమాదం.. టాటాఏస్ వాహనం బోల్తా.. నలుగురు అయ్యప్ప భక్తులు దుర్మరణం.. మరో 16 మందికి గాయాలు
అదుపు తప్పి టాటాఏస్ వాహనం బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నలుగురు అయ్యప్ప భక్తులు అక్కడికక్కడే దుర్మరణం చెందగా.. ప్రమాదంలో మరో 16 మందికి గాయాలయ్యాయి.
Vijayawada, Dec 5: ఆంధ్ర ప్రదేశ్‌లో (Andhrapradesh) ఈ ఉదయం ఘోర ప్రమాదం (Accident) చోటు చేసుకుంది. పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకున్న టాటాఏస్ (TataAce) వాహనం ఒకటి అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నలుగురు అయ్యప్ప భక్తులు (Four Ayyappa Devotees) అక్కడికక్కడే దుర్మరణం చెందగా.. మరో 16 మందికి గాయాలయ్యాయి. క్షథగాత్రులను స్థానికులు తెనాలి ఆస్పత్రికి (Tenali Hospital) తరలించారు.
ఈ ఘటన బాపట్ల జిల్లాలోని వేమూరు మండలం జంపని దగ్గర సోమవారం ఉదయం చోటు చేసుకుంది. మృతులంతా కృష్ణాజిల్లా వాసులుగా గుర్తించారు. అయ్యప్ప భక్తులు టాటా ఏస్‌లో ప్రయాణిస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ సంఘటన జరిగిన సమయంలో ఆటోలో మొత్తం 23 మంది ఉన్నారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.