Accident in Konaseema: కోనసీమ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. వ్యాను-కారు ఢీ.. నలుగురి దుర్మరణం.. మరో 9 మందికి గాయాలు
ఈ ఘటనలో నలుగురు దుర్మరణం పాలయ్యారు. మరో 9 మంది తీవ్రంగా గాయపడ్డారు.
Vijayawada, June 17: కోనసీమ (Konaseema) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. ఈ ఘటనలో నలుగురు దుర్మరణం పాలయ్యారు. మరో 9 మంది తీవ్రంగా గాయపడ్డారు. వివరాల్లోకి వెళ్తే, అనకాపల్లి (Anakapalle) సమీపంలోని చోడవరానికి చెందిన 9 మంది టాటా మ్యాజిక్ వాహనంలో కొత్తపేట మండలం మందపల్లికి దైవదర్శనం కోసం వెళ్తున్నారు. ఆలమూరు మండల పరిధిలోని మడికి జాతీయ రహదారిపై విశాఖ వైపు నుంచి వస్తున్న కారు అదుపు తప్పి ఈ వ్యాన్‌ను బలంగా ఢీకొట్టింది.
కారులో ఒకరు.. వ్యాన్‌లో ముగ్గురు
ఈ ఘటనలో వ్యాన్‌లో ప్రయాణిస్తున్న వారిలో ముగ్గురు, కారులోని ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 9 మంది గాయపడగా వారిని రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.