Road Mishap in Srikakulam: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం, నలుగురు పోలీసులు అక్కడికక్కడే మృతి, రక్తసిక్తమైన సుమ్మాదేవి జాతీయ రహదారి, పోలీస్ వాహనాన్ని లారీ ఢీకొట్టడంతో నుజ్జునుజ్జైన వాహనం

రహదారిని క్రాస్‌ చేస్తుండగా వీరి వాహనాన్ని లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో నలుగురు పోలీసులు మరణించారు. పలువురు గాయపడ్డారు. సోమవారం పలాస మండలం సుమ్మాదేవి జాతీయ రహదారిపై ఈ ఘటన చోటుచేసుకుంది.

Road accident (image use for representational)

Srikakulam, August 23: శ్రీకాకుళం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Mishap in Srikakulam) చోటు చేసుకుంది. రహదారిని క్రాస్‌ చేస్తుండగా వీరి వాహనాన్ని లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో నలుగురు పోలీసులు మరణించారు. పలువురు గాయపడ్డారు. సోమవారం పలాస మండలం సుమ్మాదేవి జాతీయ రహదారిపై ఈ ఘటన చోటుచేసుకుంది. భైరిసారంగపురంలో ఓ జవాను మృతదేహం అప్పగించి ఏఆర్‌ కానిస్టేబుళ్లు బొలెరో వాహనంలో వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో వాహనం ముందుబాగం అంతా నుజ్జునుజ్జైంది. దీంతో ఆ ప్రాంతమంతా రక్తపు మడుగులతో భయానకంగా మారింది.

ఈ ఘటనలో నలుగురు కానిస్టేబుళ్లు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో పోలీసుల వాహనం నుజ్జునుజ్జయింది. సమాచారం తెలుసుకున్న ఉన్నతాధికారులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది. మృతి చెందిన వారిలో ఏఆర్‌ ఎస్సై కె.కృష్ణుడు, వై. బాబూరావు (HC), పి. ఆంటోనీ (HC), పి. జనార్దనరావు (డ్రైవర్‌) ఉన్నారు.

ఈ ప్రమాద ఘటనపై సీఎం జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పోలీసు సిబ్బంది మృతి పట్ల ఆయన సంతాపం తెలియజేశారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.