Free Sand Policy in AP: ఏపీలో ఉచిత ఇసుక ఖరీదు టన్నుకి రూ. 1394, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫ్లెక్సీలు, ఇదో కొత్త దందా అంటూ వైసీపీ మండిపాటు, ప్రభుత్వం స్పందన ఏంటంటే..
చంద్రబాబు సీఎం అయిన తర్వాత మాటను నిలబెట్టుకుంటూ ఉచిత ఇసుక విధానం తీసుకువచ్చారు. నిన్నటి నుంచి ఏపీ వ్యాప్తంగా ఉచిత ఇసుక పాలసీ అందుబాటులోకి వచ్చింది
Vjy, July 9: ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా ఏర్పాటైన టీడీపీ కూటమి ప్రభుత్వం తమ ఎన్నికల ప్రచారంలో జలకు ఉచితంగా ఇసుకను పంపిణీ చేస్తామని ప్రకటించిన సంగతి విదితమే. చంద్రబాబు సీఎం అయిన తర్వాత మాటను నిలబెట్టుకుంటూ ఉచిత ఇసుక విధానం తీసుకువచ్చారు.
నిన్నటి నుంచి ఏపీ వ్యాప్తంగా ఉచిత ఇసుక పాలసీ అందుబాటులోకి వచ్చింది.అయితే ఉచిత ఇసుక విధానంపై నెట్టింట కొన్ని పోస్టులు వైరల్ అవుతున్నాయి. ఉచితంగా ఇసుక అని చెప్పి టన్ను ఇసుక సుమారుగా రూ.1300లకు విక్రయిస్తున్నారంటూ కొన్ని ఫ్లెక్సీలు, పోస్టులు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఏపీలో పాత ఇసుక విధానం రద్దు, ఉచిత ఇసుక పాలసీపై కొత్త జీవో విడుదల, నేటి నుంచి అమల్లోకి వచ్చే మార్గదర్శకాలు ఇవిగో..
నర్సీపట్నం ఇసుక డిపో వద్ద టన్ను ఇసుక రేటు రూ.1,225, విశాఖ అగనంపూడి వద్ద టన్ను ఇసుక రూ.1,394 అని ఉన్న ఫ్లెక్సీలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. దీంతో ఉచిత ఇసుక అని చెప్పి ఇంత రేటా అని నెటిజనం కామెంట్లు పెడుతున్నారు.
Here's YSRCP Tweets
Here's Viral Flexes
దీనికి అధికార వర్గాలు స్పందిస్తూ.. వేరే ప్రాంతాల నుంచి ఇసుక తీసుకురావాల్సి ఉన్నందున ఇసుక ఈ రేటు ఉందని పేర్కొంటున్నాయి. ఇసుక కావాల్సిన వారు స్టాక్ పాయింట్ల వద్ద ఇసుల లోడింగ్, రవాణా ఛార్జీలను చెల్లించి ఇసుకను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఇతర ప్రాంతాల నుంచి ఇసుకను తీసుకువచ్చిన రవాణా ఛార్జీలు కూడా కలిసి ఈ రేటును ఫిక్స్ చేసినట్లు తెలిస్తోంది.