Guntur Shocker: క్లాసు రూంలోనే.. విద్యార్థినులపై లైంగిక దాడికి పాల్పడిన కీచక టీచర్, వారికి నీలి చిత్రాలు చూపిస్తూ పైశాచికానందం పొందిన కామాంధుడు, గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో దారుణ ఘటన

చిన్న పిల్లలని కూడా చూడకుండా విద్యార్ధినులకు నీలి చిత్రాలు ( teacher sexually harassed on students) చూపించాడు.. పాఠశాల గదిలోనే ఈ పాడు పనులకు పాల్పడ్డాడు. విషయం వెలుగులోకి రావడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన తల్లిదండ్రులు ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలంటూ నిన్న ఆందోళనకు దిగారు.

Image used for representational purpose | (Photo Credits: File Image)

విద్యాబుద్ధులు చెప్పాల్సిన ఆ టీచర్ కామాంధుడిలా (Guntur Shocker) మారాడు. చిన్న పిల్లలని కూడా చూడకుండా విద్యార్ధినులకు నీలి చిత్రాలు ( teacher sexually harassed on students) చూపించాడు.. పాఠశాల గదిలోనే ఈ పాడు పనులకు పాల్పడ్డాడు. విషయం వెలుగులోకి రావడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన తల్లిదండ్రులు ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలంటూ నిన్న ఆందోళనకు దిగారు.

వివరాల్లోకి వెళితే, సత్తెనపల్లి (Sattenapalle) 17వ వార్డులోని శాలివాహన నగర్‌లో ఎంపీపీఎస్ (ఉర్దూ) పాఠశాల నడుస్తోంది. అదే పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్న బాలిక తనకు తలనొప్పిగా ఉందని రాత్రి తన తల్లితో చెప్పింది. దీంతో ఏం జరిగిందని ప్రశ్నించగా.. ఆమె చెప్పిన సమాధానం విని విస్తుపోయింది. ఉపాధ్యాయుడు హుస్సేన్ బూతు చిత్రాలు చూపిస్తూ ఇబ్బంది పెడుతున్నాడంటూ ఏడ్చేసింది. దీంతో ఆమె ఆరా తీయగా మరికొందరు బాలికలు కూడా ఇదే విషయాన్ని చెప్పారు. బాలికల తల్లిదండ్రులు వెంటనే నిందితుడైన ఉపాధ్యాయుడు హుస్సేన్‌కు ఫోన్ చేయగా దురుసుగా మాట్లాడాడు.

దారుణం..పోర్న్ వీడియోలు చూడలేదని బాలికను కిరాతకంగా చంపేసిన ముగ్గురు బాలలు, ఆన్‌లైన్ క్లాసుల కోసం తండ్రి కొనిచ్చిన స్మార్ట్‌ఫోన్‌లో కొన్ని వందల సెక్స్ వీడియోలు, చిత్రాలు

దీంతో వారందరూ పోలీస్ స్టేషన్‌కు చేరుకుని ఆందోళనకు దిగారు. హుస్సేన్‌ను తమకు అప్పగించాలని డిమాండ్ చేస్తూ రాస్తారోకో చేశారు. పోలీసుల హామీతో ఆ తర్వాత వారు ఆందోళన విరమించారు. మరోవైపు, ఈ ఘటనపై డీఈవో గంగాభవాని స్పందించారు. బాధితుల నుంచి ఫిర్యాదు తీసుకుని వాట్సాప్‌లో పంపిస్తే సస్పెన్షన్ ఉత్తర్వులు పంపిస్తానని ఎంఈవోను ఆదేశించారు.



సంబంధిత వార్తలు

Online Betting in Telangana: ఆన్‌లైన్ బెట్టింగ్ అప్పులు తీర్చడానికి చైన్ స్నాచింగ్, ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులు, ఒక లెక్చరర్ అరెస్ట్

Karnataka Tragedy: తీవ్ర విషాదం, ఈత రాకుండా స్విమ్మింగ్ పూల్లో దిగి ముగ్గురు యువతులు మృతి, లోతు ఎక్కువగా ఉండడంతో ఒడ్డుకు చేరలేక మునిగిపోయిన బీటెక్ విద్యార్థినులు

Andhra Pradesh: శాసనమండలిలో సారీ చెప్పిన హోం మంత్రి అనిత, బాధ్యత గల పదవిలో ఉండి దమ్ము ధైర్యం గురించి మాట్లాడవద్దని చైర్మెన్ సూచన, సభలో శాంతి భద్రతల అంశంపై వాడి వేడీ చర్చ

Man Killed By His Brothers: కార్తీక మాసంలో ఇంటికి చికెన్ తెచ్చాడ‌ని త‌మ్ముడ్నిచంపిన ఇద్ద‌రు అన్న‌లు, ఆ ఇద్ద‌ర్నీ కాపాడేందుకు త‌ల్లి ఏం చేసిందంటే?