Guntur Techie Dies: ట్రెక్కింగ్ చేస్తూ జారిపడి.. అమెరికాలో గుంటూరు సాఫ్ట్‌ వేర్ ఇంజినీర్ మృతి.. ఐదేళ్ల క్రితమే వివాహం.. ఆదివారం కావడంతో ట్రెక్కింగ్ కోసం క్లీవ్‌లెన్స్ మౌంటెన్‌హిల్స్‌కు వెళ్లిన దంపతులు.. 200 అడుగుల ఎత్తు నుంచి పడి శ్రీనాథ్ మృతి

గుంటూరు రాజేంద్రనగర్‌కు చెందిన శ్రీనాథ్‌కు ఐదేళ్ల క్రితం వివాహమైంది. దంపతులు ఇద్దరూ అమెరికాలో సాఫ్ట్‌ వేర్ ఇంజినీర్లుగా పనిచేస్తున్నారు.

Srinath (File: Instagram)

Newyork, October 18: అమెరికాలో (America) సాఫ్ట్‌ వేర్ ఇంజినీర్‌గా (Software Engineer) పనిచేస్తున్న గుంటూరుకు (Guntur) చెందిన గంగూరి శ్రీనాథ్ (32) ట్రెక్కింగ్ (Trekking) చేస్తుండగా జారిపడి మృతి చెందాడు. గుంటూరు వికాస్‌నగర్‌కు చెందిన టీడీపీ రాష్ట్ర కార్యదర్శి సుఖవాసి శ్రీనివాసరావు-రాజశ్రీ దంపతుల కుమార్తె సాయి చరణి, రాజేంద్రనగర్‌కు చెందిన శ్రీనాథ్‌కు ఐదేళ్ల క్రితం వివాహమైంది. సాయిచరణి, శ్రీనాథ్ ఇద్దరూ అమెరికాలో సాఫ్ట్‌ వేర్ ఇంజినీర్లుగా పనిచేస్తున్నారు.

భూమి గుండ్రంగా లేదట.. నేచుర్ కమ్యూనికేషన్స్ జర్నల్ లో ప్రచురణ.. భూమి దీర్ఘవృత్తాకారంలో ఉందని వెల్లడి.. గురుత్వాకర్షణ శక్తే అందుకు కారణమని వివరణ

గతంలో ఫ్లోరిడాలో ఉన్న వీరు ఇటీవల అట్లాంటాకు మారారు. ఆదివారం సెలవు కావడంతో ట్రెక్కింగ్ కోసం క్లీవ్‌లెన్స్ మౌంటెన్ హిల్స్‌‌ కు వెళ్లారు. అక్కడ ఎత్తైన ప్రదేశానికి వెళ్లిన శ్రీనాథ్ ప్రమాదవశాత్తు 200 అడుగుల ఎత్తు నుంచి కిందపడి మృతి చెందాడు. శ్రీనాథ్ మృతదేహాన్ని గుంటూరు తీసుకొచ్చేందుకు వారం రోజులు పట్టే అవకాశం ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif