Heavy Rains in Coastal AP: ఉత్తరాంధ్రలో ఎడతెరిపి లేని వానలు.. పలు గ్రామాలకు నిలిచిన రాకపోకలు.. నేడు విద్యాసంస్థలకు సెలవు
శనివారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలకు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం, అల్లూరి జిల్లాలు అతలాకుతలమయ్యాయి.
Vijayawada, Sep 9: భారీ వర్షాలతో (Heavy Rains) ఉత్తరాంధ్ర (Coastal AP) వణికిపోయింది. శనివారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలకు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం, అల్లూరి జిల్లాలు అతలాకుతలమయ్యాయి. వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. పలు కాలనీలు జలమయమయ్యాయి. రోడ్లు యేరులయ్యాయి. దీంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వర్షాలకు శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం బెజ్జిపురం నుంచి బుడతవలసకు వెళ్లే మార్గంలోని సెట్టిగెడ్డలో సరుకుల వ్యాన్ కొట్టుకుపోయింది. డ్రైవర్ ను స్థానికులు రక్షించారు. విశాఖపట్టణం జిల్లాలోని గోపాలపట్నంలో కొండచరియలు విరిగిపడ్డాయి. ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బతుకుతున్నారు.
మన నల్గొండలో స్వచ్ఛమైన గాలి.. కేంద్ర ప్రభుత్వం అవార్డు.. అసలెందుకు ఈ అవార్డు ఇచ్చారంటే?
నేడు సెలవు
ఏపీకి తీరప్రాంత జిల్లాలకు మరోసారి భారీ వర్ష సూచన చేసిన నేపథ్యంలో, ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి, విశాఖ జిల్లాల్లోని విద్యాసంస్థలకు నేడు అధికారులు సెలవు ప్రకటించారు.
ఇళ్ల స్థలాల విషయంలో ఎవరూ ఆందోళన చెందొద్దు.. అర్హులైన వారిని ఫ్యూచర్ సిటీలో భాగస్వాములను చేస్తాం