Hyderabad, Sep 9: పెరుగుతున్న జనాభా, పారిశ్రామికీకరణ, అడవుల నరకివేత వెరసి వాతావరణ కాలుష్యం అంతకంతకూ పెరిగిపోతున్నది. దీంతో గాలి నాణ్యత పడిపోతున్నది. అయితే, గాలి నాణ్యత (Air Quality) మెరుగుపరచడంలో తెలంగాణలోని నల్గొండ సత్తా చాటింది. మూడు లక్షల కన్నా తక్కువ జనాభా ఉన్న విభాగంలో రాయ్ బరేలి (యూపీ), నల్గొండ (తెలంగాణ) (Nalgonda), నలగర్ (హిమాచల్ ప్రదేశ్) తొలి మూడు స్థానాల్లో నిలిచి అవార్డులు కైవసం చేసుకున్నాయి. ఈ మేరకు స్వచ్ఛ వాయు సర్వేక్షణ్ -2024కు సంబంధించి కేంద్ర పర్యావరణ శాఖ అవార్డులను ప్రకటించింది.
ఇళ్ల స్థలాల విషయంలో ఎవరూ ఆందోళన చెందొద్దు.. అర్హులైన వారిని ఫ్యూచర్ సిటీలో భాగస్వాములను చేస్తాం
ఎలా నిర్ధారించారంటే?
ఈ అవార్డుల ఎంపికకు కింది అంశాలను ప్రధానంగా తీసుకున్నారు.
- గాలి నాణ్యతలో మెరుగుదల
- కాలుష్యాన్ని తగ్గించేందుకు మెకానికల్ స్వీపింగ్
- ఘన వ్యర్థాల నిర్వహణ
- గ్రీన్ బెల్ట్ అభివృద్ధి
- డంపింగ్ సైట్ ల నుంచి పొందిన ప్రాంతాలను పచ్చని ప్రదేశంగా మార్చడం
- ట్రాఫిక్ విధానాలను మెరుగుపర్చడం