Heavy Rains Likely To Hit TS: తెలంగాణలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు, తూర్పు మధ్య బంగాళాఖాతంలో రేపు మరో అల్పపీడనం, 24 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం
తూర్పు మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం (severe hypothermia) ఏర్పడిందని, దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని పేర్కొంది. దక్షిణ కోస్తాంధ్ర పరిసర ప్రాంతాల్లో 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తం కొనసాగుతుందని వాతావరణ కేంద్రం చెప్పింది.
Hyderabad, Oct 10: తెలంగాణలో రానున్న మూడు రోజుల్లో వర్షాలు (Heavy Rains in Telangana) కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణకేంద్రం శనివారం తెలిపింది. తూర్పు మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం (severe hypothermia) ఏర్పడిందని, దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని పేర్కొంది. దక్షిణ కోస్తాంధ్ర పరిసర ప్రాంతాల్లో 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తం కొనసాగుతుందని వాతావరణ కేంద్రం చెప్పింది.
రాగల 24 గంటల్లో మధ్య బంగాళాఖాతంలో వాయుగుండముగా మారే అవకాశం ఉందని ఇది తదుపరి 24 గంటల్లో మరింత బలపడి తీవ్ర వాయుగుండముగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. పశ్చిమ వాయువ్య దిశగా పయణించి ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరంలో సోమవారం ఉదయం గానీ మధ్యాహ్నంగానీ వాయుగుండంగా తీరాన్ని దాటే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే ఉత్తర అండమాన్ సముద్రం మరియు దాని పరిసర ప్రాంతాల్లో అక్టోబర్ 14న మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది.
అలాగే ఈ నెల 14న మరో అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో రాగల మూడు రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు (Heavy Rains Likely To Hit Telangana) పడుతాయని చెప్పింది. ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ ఉమ్మడి జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ వర్షాలు, ఖమ్మం, సూర్యాపేట జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని, ఆది, సోమవారాల్లో ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు (Heavy Rains Likely To Hit TS) కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వివరించింది.
గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో పలు చోట్ల అక్కడక్కడ తేలికపాటి జల్లులు కురవగా.. రంగారెడ్డి, వికారాబాద్, నల్గొండ, జనగామ, వరంగల్ అర్బన్, రూరల్, జగిత్యాల, కుమ్రం భీం జిల్లాలో మోస్తరు వర్షాలు కురిశాయి. హైదరాబాద్ జీహెచ్‌ఎంసీ పరిధిలోని గండిపేటలో 125.8 మిల్లీమీటర్లు, ఖమ్మం జిల్లా కొండమల్లపల్లిలో 117.5 మిల్లీమీటర్ల వర్షాపాతం నమోదైంది. అలాగే పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిశాయి.
తూర్పు మధ్య బంగాళాఖాతంలో రేపు మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని.. ఇది తదుపరి 24 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ హెచ్చరించింది. కాగా, నిన్న ఉదయం గం. 8:30 నుండి ఈరోజు ఉదయం 8:30 గంటల వరకు అత్యధికంగా మంచిర్యాల జిల్లాలో 12.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ అధికారిణి డాక్టర్ శ్రావణి వెల్లడించారు.