High Rain Alert: రానున్న మూడు రోజులు ఏపీలో వర్షాలు, కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం, ఆదివారం తడిసి ముద్దయిన విజయవాడ
ఉత్తర ఒడిశా, దాని పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్న నేపథ్యంలో దానికి అనుబంధంగా ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. వీటి ప్రభావంతో సోమ, మంగళ బుధవారాల్లో కోస్తా, రాయలసీమల్లో పలు ప్రాంతాల్లో తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు (High Rain Alert) కురుస్తాయని విశాఖ కేంద్రం అధికారులు (Vizag IMD) వెల్లడించారు. అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన వానలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఈ నెల 25న కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా భారీ వర్షాలు పడే సూచనలున్నాయి. అయితే కోస్తా, రాయలసీమపై నైరుతి ప్రభావం సాధారణంగా ఉంది.
Amaravati, June 22: ఏపీలో (Andhra Pradesh) రానున్న మూడు రోజుల పాటు ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు (Special rain alert) కురవనున్నాయి. ఉత్తర ఒడిశా, దాని పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్న నేపథ్యంలో దానికి అనుబంధంగా ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. వీటి ప్రభావంతో సోమ, మంగళ బుధవారాల్లో కోస్తా, రాయలసీమల్లో పలు ప్రాంతాల్లో తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు (High Rain Alert) కురుస్తాయని విశాఖ కేంద్రం అధికారులు (Vizag IMD) వెల్లడించారు. అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన వానలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఈ నెల 25న కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా భారీ వర్షాలు పడే సూచనలున్నాయి. అయితే కోస్తా, రాయలసీమపై నైరుతి ప్రభావం సాధారణంగా ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పరీక్షలు రద్దు! విద్యార్థులందరినీ పాస్ చేస్తున్నట్లు ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం, ఇంటర్ ఫెయిల్ అయిన విద్యార్థులను కూడా పాస్ చేస్తున్నట్లు వెల్లడి
ఆదివారం కురిసిన వర్షాలకు విజయవాడ నగరం తడిసి ముద్దయింది. నగరంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు పలు దఫాలుగా భారీ వర్షం కురిసింది. కృష్ణా జిల్లా అంతటా సాయంత్రం వరకు వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. కొన్నిచోట్ల తేలికపాటి జల్లులు పడగా.. పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షం పడింది. గుంటూరు జిల్లాలో ఓ మోస్తరు వర్షాలు కురవగా పల్నాడులో అక్కడక్కడా చిరుజల్లులు పడ్డాయి.
గడిచిన 24 గంటల్లో కర్నూలులో 3 సెంమీ, సి.బెలగొళ, బద్వేల్, మంత్రా లయం, పలమనేరులో 2 సెంమీ వర్షపాతం నమోదైంది.