Andhra Pradesh Shocker: తిరుపతిలో దారుణం, స్నేహితురాలికి డ్రగ్స్ ఇచ్చి తన భర్తతో అత్యాచారం చేయించి వీడియోలు తీసిన భార్య, అనంతరం ఆ న్యూడ్ వీడియోలతో డబ్బులు డిమాండ్

యువతులను గంజాయికి బానిసలుగా చేసి అసభ్యకర చిత్రాలు తీసి బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతున్నభార్యాభర్తల బాగోతం వెలుగులోకి వచ్చింది. దంపతులిద్దరినీ పోలీసులు అరెస్ట్ చేశారు

Rape (Rep Image)

Tirupati, July 26: తిరుపతిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. యువతులను గంజాయికి బానిసలుగా చేసి అసభ్యకర చిత్రాలు తీసి బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతున్నభార్యాభర్తల బాగోతం వెలుగులోకి వచ్చింది. దంపతులిద్దరినీ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పద్మావతి యూనివర్సిటీలో బీఎల్ ఫైనల్ ఇయర్ చదువుతున్న ప్రణవకృష్ణా రెడ్డి అనే యువతి కర్నూలుకు చెందిన తన స్నేహితురాలైన ఓ యువతికి రెండేళ్లుగా గంజాయి అలవాటు చేసింది.  ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 13 మంది, 50 ఏళ్ళ హిజ్రాపై గ్యాంగ్ రేప్, 8 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు, మరో 5 గురు పరారీలో..

హాస్టల్‌లో ఉంటున్న ఆమెకు మాయమాటలు చెప్పి తరచూ తన ఇంటికి తీసుకెళ్లేది. గంజాయి మత్తులో ఉన్న యువతిని భర్త కృష్ణ కిషోర్ రెడ్డి చేత లైంగికదాడి చేయించి స్వయంగా వీడియోలు తీసేది. ఆ వీడియోలు, ఫోటోలు యువతి అన్నకు, కాబోయే భర్తకు పంపి డబ్బులు కోసం ఆ భార్యభర్తలు బ్లాక్ మెయిల్‌ చేయడం స్టార్ట్ చేశారు.వీరి వేధింపులు రోజురోజుకు ఎక్కువ కావడంతో ఆ యువతి ఎంఆర్‌పల్లి పోలీసులను ఆశ్రయించింది. గతంలో కూడా ఓ యువతిని మోసం చేసి ఇద్దరూ రూ. 5 లక్షలు కాజేసినట్లు విచారణలో తేలింది. భార్య భర్తలను అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు.