East Godavari Shocker: భార్య రెండు కూరలు వండలేదని పురుగు మందు తాగిన భర్త, చికిత్స పొందుతూ మృతి, గొల్లప్రోలు మండలం కొడవలిలో విషాద ఘటన, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న గొల్లప్రోలు పోలీసులు

ఏకంగా ప్రాణాలే తీసుకోవడం ఆ కుటుంబం మొత్తాన్ని శోకసంద్రంలో ముంచేసింది.

Representational Image (Photo Credits: ANI)

East Godavari, April 19: చిన్న చిన్న మనస్పర్థలకే కొందరు నిండు ప్రాణాలను బలి (East Godavari Shocker) తీసుకుంటున్నారు. పిల్లల్ని నమ్ముకున్నవారిని అనాధలను చేస్తున్నారు. తాజాగా ఈస్ట్ గోదావరిలో ఇలాంటి విషాద ఘటనే చోటు చేసుకుంది. 30 ఏళ్లకు పైగా దాంపత్య జీవితం గడిపిన ఆ భర్త కేవలం తాను తెచ్చిన కూర వండలేదని భార్యపై కోపంతో మనస్తాపానికి గురై తన జీవితాన్నే అంతం (Husband Commits Suicide) చేసుకున్నాడు. ఏకంగా ప్రాణాలే తీసుకోవడం ఆ కుటుంబం మొత్తాన్ని శోకసంద్రంలో ముంచేసింది.

శనివారం రాత్రి ఈ ఘటన గొల్లప్రోలు మండలం కొడవలిలో చోటు చేసుకుంది. గొల్లప్రోలు పోలీసుల కథనం ప్రకారం.. కొడవలికి చెందిన సీహెచ్‌ త్రిమూర్తులు (50) రైతు. వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. శనివారం సాయంత్రం మార్కెట్‌కు వెళ్లి చికెన్, మటన్‌ తీసుకొచ్చాడు. రెండు కూరలూ వండాలని భార్యకు చెప్పాడు. ఇప్పుడు ఒకటి.. మరొకటి రేపు ఆదివారం కాబట్టి వండుతానని భార్య (wife not cooking chicken curry) చెప్పగా కోపోద్రిక్తుడయ్యాడు. తన మాట వినలేదంటూ వివాదానికి దిగి బయటకు వెళ్లి పురుగు మందు తాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు.

ఇంట్లో ఉన్నా కరోనా అటాక్ చేస్తుంది, గాల్లో సుమారు మూడు గంటల పాటు వైరస్, ఎన్‌95 లేదా కేఎన్‌95 మాస్క్‌లు తప్పక ధరించాలని చెబుతున్న వైద్యులు, రెండు మాస్క్‌లు కొని ఒక్కో రోజు ఒక్కోటి వాడాల‌ని సూచించిన అంటు వ్యాధుల నిపుణులు డాక్ట‌ర్ ఫ‌హీమ్ యూన‌స్‌

ఈ విషయం తెలుసుకున్న బంధువులు వెంటనే అతనిని ప్రత్తిపాడు పీహెచ్‌సీకి తీసుకెళ్లగా ప్రథమ చికిత్స అనంతరం కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అతను ఆదివారం ఉదయం మృతి చెందినట్లు గొల్లప్రోలు ఎస్సై రామలింగేశ్వరరావు తెలిపారు. మృతుడికి భార్య, కుమారుడు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.