Mudragada Padmanabham: సారీ..నేను రాలేను, కాపు ఉద్యమానికి నాయకత్వం వహించలేనని తెలిపిన ముద్రగడ పద్మనాభం, జేఏసీ నేతల అభ్యర్థనను తిరస్కరించిన మాజీ మంత్రి
అయితే జేఏసీ నేతల అభ్యర్థనను ఆయన సున్నితంగా తిర్కసరించారు. కాపు ఉద్యమంలోకి తాను వచ్చేది లేదని (I can't lead Kapu reservation movement) ముద్రగడ పద్మనాభం మరోమారు స్పష్టం చేశారు.
Amaravati, Sep 21: కాపులకు బీసీ రిజర్వేషన్లు సాధించేందుకు చేపట్టిన ఉద్యమం నుంచి పక్కకు తప్పుకున్నట్టు ఇప్పటికే ప్రకటించిన మాజీమంత్రి, ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంను (Mudragada Padmanabham) సోమవారం కాపు జేఏసీ నేతలు కలిశారు.మళ్లీ మీరే ఉద్యమ నేతగా (Kapu reservation movement) కొనసాగాలంటూ ఈ సందర్భంగా వారు ముద్రగడను కోరారు. అయితే జేఏసీ నేతల అభ్యర్థనను ఆయన సున్నితంగా తిర్కసరించారు. కాపు ఉద్యమంలోకి తాను వచ్చేది లేదని (I can't lead Kapu reservation movement) ముద్రగడ పద్మనాభం మరోమారు స్పష్టం చేశారు.
ఈ భేటీ అనంతరం ఆయన ఓ లేఖ విడుదల చేశారు. వ్యక్తిగతంగా మీతోనే ఉంటానని ఆయన తెలిపారు. గౌరవ పెద్దలకు మీ ముద్రగడ పద్మనాభం శిరస్సు వంచి నమస్కారాలు చేసుకుంటున్నాను. మీ కోరికను గౌరవించలేక పోతున్నందుకు క్షమించమని కోరుతున్నాను. వ్యక్తిగతంగా నేను మీతోనే ఉంటాను. మనం మంచి స్నేహితులం. మీ ఇంటిలో ఏ కార్యక్రమం ఉన్నా తెలియచేస్తే నా ఓపిక ఉన్నంతవరకూ వస్తానండి. మీ అందరి అభిమానం, ప్రేమ మరువలేనిది. నా ఇంటిలో ఏ శుభకార్యం ఉన్నా నేనే స్వయంగా జిల్లాలకు వచ్చి ఓపిక ఉన్నంతవరకూ ఆహ్వానిస్తాను. దయచేసిన నన్ను ఇబ్బంది పెట్టవద్దని కోరుతున్నాను.’ అని ఆ లేఖలో తెలిపారు.
కాగా సోషల్ మీడియాలో తనపై పెడుతున్న పోస్టింగ్‌లకు కలత చెంది ఉద్యమం నుంచి తప్పుకుంటూ నిర్ణయం తీసుకున్న విషయం విదితమే. ఈ మేరకు కాపులను ఉద్దేశించి సుదీర్ఘ లేఖ కూడా రాశారు. ఈ మధ్య పెద్దవారు చాలామంది మన సోదరులతో నేను మానసికంగా కుంగిపోయే విధంగా సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా దాడులు చేయిస్తున్నారు. నేను ఆ రోజు ఉద్యమంలోకి రావడానికి కారణం.. చంద్రబాబే. మన జాతికి బీసీ రిజర్వేషన్ ఇస్తానన్న హామీ అమలు కోసం ఉద్యమ బాట పట్టాను. ఈ ఉద్యమం ద్వారా డబ్బు, పదవులు పొందాలని ఏనాడూ అనుకోలేదు.’ అని లేఖలో పేర్కొన్నారు.