Amaravati, July 13: ఏపీలో కాపు ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ముద్రగడ పద్మనాభం (Mudragada Padmanabham) సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇకపై కాపు ఉద్యమం (Kapu Movement) నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటన చేశారు. ఈ మేరకు 2020, జులై 13వ తేదీ సోమవరం కాపు సామాజిక వర్గానికి ఆయన లేఖ రాయడం సంచలనం రేకేత్తిస్తోంది. కాపు ఉద్యమంలో ఆర్థికంగా, రాజకీయంగా, ఆరోగ్య పరంగా చాలా నష్టపోయానని వివరించారు. జగనన్న తోడు, సున్నా వడ్డీకే రూ. 10 వేల రుణం, దాదాపు 10 లక్షల మంది చిరు వ్యాపారులకు లబ్ధి, గ్రామ, వార్డు వలంటీర్ల ద్వారా ప్రభుత్వం సర్వే
కాపు ఫలాల సాధన కోసం (#KapuReservation) వివిధ మార్గాల్లో ప్రయత్నించడం జరిగిందని చెప్పుకొచ్చారు. తాను మానసికంగా దిగజారే విధంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిస్తున్నారని, వీటితో కలత చెంది ఉద్యమం నుంచి తప్పుకోవాలని (Mudragada Takes Sensational Decision) నిర్ణయించుకోవడం జరిగిందన్నారు. రూ.15 వేలు నేరుగా అకౌంట్లోకి, వైయస్సార్ కాపు నేస్తం పథకాన్ని లాంచ్ చేయనున్న ఏపీ సీఎం, 2,35,873 మంది బ్యాంకు ఖాతాలకు రూ.354 కోట్లు జమ
ఉద్యమకాలంలో తను వసూలు చేసిన నిధులు వారికి పంచలేదనే దాడులు చేయిస్తున్నారని, కాపు జాతికి మంచి జరగాలని ఎన్నో ప్రయత్నాలు చేశానన్నారు. మన పెద్దలు పేరు చెప్పకుండా..పది మందితో తిట్టిస్తున్నారని వెల్లడించారు. తుని సభ, పాదయాత్ర విజయవంతం తన గొప్పతనం కాదని చెప్పిన ఆయన నన్ను తిట్టించే వారితోనే రిజర్వేషన్లు సాధించాలని కోరుతున్నానని తెలిపారు.
ముద్రగడ పద్మనాభం రాసిన లేఖలో ఏముంది ?
ఈ మధ్య పెద్దవారు చాలా మంది మన సోదరుల చేత నేను మానసికంగా కృంగిపోయే విధంగా సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా దాడులు చేయిస్తున్నారు. ఈ విధంగా దాడులు ఎందుకు చేస్తున్నారో నాకైతే అర్థం కాలేదు. ఉద్యమం చేసిన కాలంలో నేను వసూలు చేసిన నిధులు కానీ, పారిశ్రామిక వర్గాలను బెదిరించి సంపాదించిన డబ్బులు కానీ, అప్పటి ముఖ్యమంత్రి, ఇప్పటి ముఖ్యమంత్రి దగ్గర లొంగిపోయి మూటలతో కోట్లాది రూపాయిలు, నన్ను నిత్యం విమర్శించే మన సోదరులకు పంచలేదనా..? ఈ దాడికి కారణం’ అని ముద్రగడ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు.
Here's Mudragada Padmanabham Letter- 1
‘నేను ఆ రోజు ఉద్యమంలోకి రావడానికి చంద్రబాబుగారే ముఖ్య కారణం. మన జాతికి బీసీ రిజర్వేషన్ ఇస్తానని హామీ కోసం అన్న సంగతి మీకు తెలియనిది కాదు. ఈ ఉద్యమం ద్వారా డబ్బు కానీ, పదవులు కానీ పొందాలని నేను ఏనాడూ అనుకోలేదు. ఉద్యమంలోకి వచ్చిన తర్వాత ఆర్థికంగాను, ఆరోగ్యం పరంగాను చాలా నష్టపోయాను. రాజకీయంగా ఎంతో నష్టపోయానో మీ అందరికీ తెలుసు. కానీ ఏ నష్టానికి నేనెప్పుడు చింతించలేదు’ అని ప్రకటనలో ముద్రగడ చెప్పుకొచ్చారు.
Here's Mudragada Padmanabham Letter-2
ఒకరు ఫోన్ చేసి మీ కష్టం ద్వారా వచ్చే ఫలితాన్ని ఇతరులు కొట్టేసేలాగున్నారు. కాబట్టి ఇతరులు ఇచ్చిన స్టేట్‌మెంట్‌కు సపోర్ట్ చేస్తూ మీరు నడిచేయండి అని సలహా ఇచ్చారు. ఎందుకు వారితో నడవాలి, ఆనాడు ఈ ఉద్యమం వెనకాల వారందరూ నడిచారా..? వారు నడవనప్పుడు నేను నడవలసిన అవసరం లేదు. ఎవరి ద్వారా అయినా రిజర్వేషన్ రానివ్వండి దానికి అందరూ సంతోషపడదాం అని చెప్పడం జరిగింది. ఆ నాడు అప్పటి ముఖ్యమంత్రి గారికి లేఖ రాస్తూ రిజర్వేషన్ ఇచ్చేయడం వల్ల నేను గొప్పవాడినికి అయిపోతానని మీరు అభిప్రాయపడవచ్చు. దయచేసి మీ ఆఫీసులో పనిచేసే వారి పేరు మీద లేఖ తీసుకుని, పనిచేసి ఆ పేరు ప్రతిష్టలు పొందండి.. ఫలితాన్ని ఆశించే మనిషిని కాను అని ఆనాడే చెప్పడం జరిగింది’ అని ముద్రగడ ప్రకటన విడుదల చేశారు.
ఇదే లేఖలో తుని ఘటన, ఆ సభకు వచ్చిన జనసమీకరణ గురించి కూడా చెప్పారు. అంతేకాదు వేలాది మంది సభకు రావడం తనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని.. ఇది నిజంగా మరువలేని అనుభూతి అని ముద్రగడ చెప్పుకొచ్చారు.
ఏపీలో సుదీర్ఘ రాజకీయ అనుభవం, కాపు ఉద్యమ నేతగా ముద్రగడకు మంచి గుర్తింపు ఉంది. గతంలో కాంగ్రెస్, టీడీపీ పార్టీలో పనిచేశారు. 2014 నుంచి ఏ పార్టీలో చేరకుండా ఉన్నారు. 2016 జనవరి, 31న తూర్పుగోదావరి తునిలో కాపు ఐక్య గర్జన సభ ద్వారా ఉద్యమాన్ని స్టార్ట్ చేశారు. తునిలోని కొత్తూరు వద్ద జరిగిన ఈ సభ నుంచి ప్రత్యక్ష ఉద్యమానికి దిగుదామని పిలుపునిచ్చారు.
రోడ్లు, రైళ్ రోకోలకు పిలుపునివ్వడంతో చాలా మంది హైవేలు, రైల్వే ట్రాక్ లను దిగ్భందించారు. దీని ద్వారా విధ్వంసం చోటు చేసుకుంది. రైళ్లను దగ్ధం చేశారు. కాపు ఉద్యమం కోసం కిర్లంపూడిలో ఉన్న ఆయన ఇంట్లోనే నిరహార దీక్షలకు కూర్చున్న సంగతి తెలిసిందే.
ఈ ప్రకటనపై కాపు నేతలు, ఆయన అభిమానులు, అనుచరులు ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాలి. ముద్రగడ్డను కాపు నేతలు బుజ్జగించి ఉద్యమ నేతగా కొనసాగిస్తారా..? లేకుంటే ఆయన స్థానంలోకి మరెవరైనా వస్తారా..? అనేదానిపై సస్పెన్స్ కొనసాగుతోంది.