IPL Auction 2025 Live

Weather Forecast: విశాఖను కుమ్మేసిన భారీ వర్షం, మరో మూడు రోజుల పాటు ఏపీకి వర్ష సూచన, పశ్చిమ మధ్య బంగాళాఖాతం నుంచి పశ్చిమ రాజస్థాన్ వరకు ఉపరితల ఆవర్తనం

విశాఖలో ఈ రోజు మధ్యాహ్నం బలమైన గాలులుతో భారీ వర్షం కురిసింది. పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసింది. ఇదిలా ఉంటే అమరావతి వాతావరణ కేంద్రం ఏపీకి వర్ష సూచన (IMD Issues Rain Alert) చేసింది.

Representational Image | (Photo Credits: PTI)

Amarabati, Sep 23: ఏపీలో పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు (Rains) కురుస్తున్నాయి. విశాఖలో ఈ రోజు మధ్యాహ్నం బలమైన గాలులుతో భారీ వర్షం కురిసింది. పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసింది. ఇదిలా ఉంటే అమరావతి వాతావరణ కేంద్రం ఏపీకి వర్ష సూచన (IMD Issues Rain Alert) చేసింది. నేడు, రేపు, ఎల్లుండి రాష్ట్రంలో వర్షాలు (AP Rains) పడే అవకాశం ఉందని తెలిపింది. ఈ నెల 23న ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా యానాం, రాయలసీమ ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.

ఈ నెల 24న ఉత్తర, దక్షిణ కోస్తాంధ్రలో, రాయలసీమలో... ఈ నెల 25న ఉత్తర కోస్తా, రాయలసీమలో ఓ మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు పడతాయని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. వాయువ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతం నుంచి పశ్చిమ రాజస్థాన్ వరకు ఉపరితల ఆవర్తనం వ్యాపించి ఉందని, ఏపీలో దిగువ ట్రోపో ఆవరణంలో పశ్చిమ వాయవ్య దిశగా గాలులు వీస్తున్నాయని వివరించింది.

ఆరు నెలల్లో హాంద్రీనీవా పనులు పూర్తి చేస్తాం, భరత్‌ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే మంత్రిగా మీకు అందిస్తా, కుప్పం సభలో సీఎం జగన్ స్పీచ్ హైలెట్స్

సెప్టెంబర్ 23న ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, యానాం, రాయలసీమ ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో ఒక మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. 24న ఉత్తర, దక్షిణ కోస్తాంధ్రతో పాటు రాయలసీమలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది.సెప్టెంబర్ 25న ఉత్తర కోస్తా, రాయలసీమలో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.



సంబంధిత వార్తలు

Ambati Rambabu: అసభ్యకర పోస్టులు పెట్టిన టీడీపీ కార్యకర్తలను అరెస్ట్ చేయరా ? పోలీసులకు సూటి ప్రశ్న విసిరిన వైసీపీ నేత అంబటి రాంబాబు

TG Weather Update: చలితో గజగజలాడుతున్న తెలంగాణ.. సంగారెడ్డి, ఆదిలాబాద్‌ జిల్లాల్లో 9 డిగ్రీల కంటే తక్కువకు పడిపోయిన ఉష్ణోగ్రతలు.. అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ హెచ్చరిక

Rains in AP: బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం.. ఎల్లుండి నుంచి ఏపీలో భారీ వర్షాలు.. మూడు రోజుల పాటు సముద్రంలో అలజడి.. మత్స్యకారులు వేటకు వెళ్ళవద్దని అధికారుల హెచ్చరికలు

Sambhal Shahi Jama Masjid Survey: యూపీలో మసీదు సర్వే కోసం వచ్చిన అధికారులపై రాళ్లు రువ్విన స్థానికులు, టియర్ గ్యాస్ ప్రయోగించిన పోలీసులు, వీడియోలు ఇవిగో..