AP Weather Update: ఏపీలో ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్, అల్పపీడనం కారణంగా రానున్న 4 రోజుల పాటు భారీ వర్షాలు, గంటకు 40 నుంచి 45 కిమీల వేగంతో గాలులు వీచే అవకాశం

ఈ క్రమంలో శ్రీకాకుళం, పార్వతీపురం, అల్లూరి, కాకినాడ, అనకాపల్లి జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ కూడా జారీ చేసింది.

Rains (Photo-Twitter)

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా రానున్న నాలుగు రోజుల పాటు ఏపీలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ క్రమంలో శ్రీకాకుళం, పార్వతీపురం, అల్లూరి, కాకినాడ, అనకాపల్లి జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ కూడా జారీ చేసింది. ఇక, అల్పపీడనం కారణంగా గంటకు 40 నుంచి 45 కిమీల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.

అల్ప పీడనం ప్రభావంతో కోస్తా, రాయలసీమ, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అలాగే, ఈనెల 17వ తేదీ వరకు మృత్య్సకారుల చేపలవేటపై నిషేధం విధించింది వాతావరణశాఖ. కాగా ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.

తెలంగాణకు మరోసారి ఎల్లో అలర్ట్ జారీ, రానున్న మూడు రోజుల పాటూ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం, ఏయే జిల్లాలకు అలర్ట్ జారీ చేశారంటే?

మరోవైపు.. తెలంగాణలోని పలు జిల్లాల్లో బుధవారం రాత్రి నుంచి మోస్తరు వర్షం కురిసింది. ఉమ్మడి ఆదిలాబాద్‌, ఉమ్మడి కరీంనగర్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. ఇక, రాజధాని హైదరాబాద్‌లో కూడా ఆకాశం మోఘావృతమై ఉంది.