Why Should Invest In AP: పెట్టుబడులకు స్వర్గధామంగా ఏపీ.. పారిశ్రామికాభివృద్ధికి ఎన్నో అవకాశాలు.. ఏయే రంగాల్లో పెట్టుబడులకు ఏపీ అనువైన ప్రాంతమంటే??
గడిచిన మూడేండ్లలో ఇప్పటికే రాష్ట్రంలో రూ. 2.5 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. దీంతో మారిన్ని పెట్టుబడుల కోసం వచ్చే నెల 3, 4 తేదీల్లో ఏపీ ఆర్ధిక రాజధాని విశాఖపట్నంలో జరిగే గ్లోబల్ ఇన్వెస్టర్ల సదస్సు కు విస్తృతంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి.
Visakhapatnam, Feb 24: పెట్టుబడులకు స్వర్గధామంగా ఏపీ నిలుస్తున్నది. గడిచిన మూడేండ్లలో ఇప్పటికే రాష్ట్రంలో రూ. 2.5 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. దేశంలో విస్తీర్ణ పరంగా ఎనిమిదో పెద్ద రాష్ట్రంగా ఉండటం, విస్తారమైన తీరరేఖ, వాణిజ్య రవాణాకు అన్ని సదుపాయాలు, మొత్తం జనాభాలో 70 శాతం మంది పెనిచేసేవారుగా ఉండటం ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు అనుకూల వాతావరణాన్ని కల్పిస్తున్నాయి.
దీంతో మారిన్ని పెట్టుబడుల కోసం వచ్చే నెల 3, 4 తేదీల్లో ఏపీ ఆర్ధిక రాజధాని విశాఖపట్నం (Visakhapatnam)లో జరిగే గ్లోబల్ ఇన్వెస్టర్ల సదస్సు (Global Investor Summit) కు విస్తృతంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ మేరకు సీఎస్ జవహార్ రెడ్డి అధికారుల్ని ఆదేశించారు. ఏయూ ఇంజినీరింగ్ కాలేజీగ్రౌండ్స్ లో (AU Engineering College Grounds) జరిగే సదస్సు నిర్వహణపై ఇటీవల ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.
గ్లోబల్ ఇన్వెస్టర్ల సదస్సుకు ఏపీ ముస్తాబు.. విశాఖలో విస్తృత ఏర్పాట్లు
ఏపీలో పెట్టుబడులకు అనువైన రంగాలు
ఏరో స్పేస్ అండ్ డిఫెన్స్ , అగ్రి అండ్ పుడ్ ప్రాసెసింగ్, ఏరోనాటికల్ అండ్ ఎలక్ట్రానిక్ వాహనాలు, హెల్త్ కేర్ అండ్ మెడికల్ ఇక్విప్మెంట్, ఇండస్ట్రియల్ అండ్ లాజిస్టిక్ ఇన్ప్రాస్ట్రక్చర్, పెట్రో అండ్ పెట్రో కెమికల్స్,రెన్యువల్ ఎనర్జీ,ఫార్మా అండ్ లైఫ్ సైన్సెస్,టెక్స్టైల్స్ అండ్ అపారెల్స్, టూరిజం,స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎడ్యుకేషన్, ఎలక్ట్రానిక్స్, స్టార్టప్స్ అండ్ ఇన్నోవేషన్, ఐటి అండ్ జిసిసి వంటి రంగాల్లో పెట్టుబడులకు ఏపీ అనువైన గమ్యస్థానంగా ఉన్నది.