AP IPS Transfers and Promotions: ఏపీలో భారీగా ఐపీఎస్‌ల బదిలీలు, పదోన్నతులు, స్థానిక సంస్థల ఎన్నికల వేళ జగన్ సర్కారు కీలక నిర్ణయం

రాష్ట్రంలో భారీగా ఐపీఎస్‌ల బదిలీలు, ఇంటిలిజెన్స్‌తో పాటూ మరికొన్ని కీలక స్థానాల్లో మార్పులు, చేర్పులు (AP IPS Transfers) చేస్తూ ప్రభుత్వం (Government of Andhra Pradesh) ఆదేశాలు జారీ చేసింది. పదోన్నతులు, బదిలీలు తక్షణమే అమల్లోకి వస్తాయని ఉత్వర్వుల్లో పేర్కొంది.

IPS Officers Transfers And Promotions In Andhra Pradesh (photo-Twitter)

Amaravati, Mar 06: మరికొద్ది రోజుల్లో ఏపీలో స్థానిక సంస్థలు జరగనున్న వేళ వైయస్ జగన్ సర్కారు (YS Jagan Govt) కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో భారీగా ఐపీఎస్‌ల బదిలీలు, ఇంటిలిజెన్స్‌తో పాటూ మరికొన్ని కీలక స్థానాల్లో మార్పులు, చేర్పులు (AP IPS Transfers) చేస్తూ ప్రభుత్వం (Government of Andhra Pradesh) ఆదేశాలు జారీ చేసింది. పదోన్నతులు, బదిలీలు తక్షణమే అమల్లోకి వస్తాయని ఉత్వర్వుల్లో పేర్కొంది.

పోలవరంపై కేంద్రం తీపికబురు

ఈ నేపథ్యంలో అదనపు డీజీగా ఆర్‌ కే మీనా.. ఎస్‌ఐబీ చీఫ్‌గా శ్రీకాంత్‌.. మెరైన్ పోలీస్ చీఫ్‌గా ఎ.ఎస్‌.ఖాన్‌.. ప్రొవిజినల్‌ లాజిస్టిక్‌ ఐజీగా నాగేంద్రకుమార్‌..ఇంటెలిజెన్స్‌ ఐజీగా రఘురామిరెడ్డి.. ఏసీబీ ఐజీగా అశోక్‌కుమార్‌.. గుంటూరు రేంజ్‌ ఐజీగా జె. ప్రభాకర్‌రావు.. ఇంటెలిజెన్స్‌ డీఐజీగా విజయ్‌కుమార్‌.. ఏలూరు రేంజ్‌ డీఐజీగా కేవీ మోహన్‌ రావులతో పాటు మరికొందరు పదోన్నతి పొందారు.

పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ ఛైర్మన్‌గా హరీష్‌కుమార్‌ గుప్తా.. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌గా వినీత్ బ్రిజ్‌లాల్‌.. నర్సీపట్నం ఓఎస్డీగా సుమిత్‌ సునీల్‌.. ఎపీఎస్పీ కాకినాడ కమాండెంట్‌గా అమిత్‌ బర్దార్‌, కర్నూలు అదనపు ఎస్పీగా గౌతమిశాలి, ఎపీఎస్పీ మంగళగిరి కమాండెంట్‌గా బి. క్రిష్ణారావు బదిలీ అయ్యారు. వీరిలో వినీత్ బ్రిజ్‌లాల్‌కు ప్రొహిబిషన్‌, ఎక్సైజ్‌ డైరెక్టర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు.

ఏపీ సీఎం జగన్‌ను కలిసిన ఐఎంఆర్‌ ఏజీ కంపెనీ ప్రతినిధులు

పదోన్నతులు, బదిలీలు ఇలా..

1. విశాఖ పోలీసు కమిషనర్‌ ఆర్కే మీనా బదిలీ

2. పోలీసులు రిక్రూట్‌మెంట్ బోర్డు చైర్మన్‌గా హరీశ్‌కుమార్‌ గుప్తా

3. ఐజీ లీగల్‌గా పి.హరికుమార్‌, ఎస్‌బీఐ చీఫ్‌గా సీ.హెచ్‌.శ్రీకాంత్‌

4. మెరైన్‌ పోలీస్‌ చీఫ్‌గా ఎ.ఎస్‌.ఖాన్

5. గుంటూరు రేంజ్‌ ఐజీగా జె.ప్రభాకర్‌రావు

6. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌గా వినీత్‌ బ్రిజ్‌లాల్‌

7. ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ డైరెక్టర్‌గా వినీత్‌ బ్రిజ్‌లాల్‌కు అదనపు బాధ్యతలు

8. ప్రొవిజన్‌ లాజిస్టిక్‌ ఐజీగా నాగేంద్రకుమార్‌

9. ఇంటెలిజెన్స్‌ ఐజీగా రఘురామిరెడ్డి

10. ఏసీబీ ఐజీగా అశోక్‌కుమార్‌

11. ఇంటెలిజెన్స్‌ డీఐజీగా విజయ్‌కుమార్‌

12. సీఐడీ డీఐజీగా హరికృష్ణ

13. ఏసీబీ అడిషనల్‌ డైరెక్టర్‌గా ఎస్వీ రాజశేఖర్‌బాబు

14. ఏలూరు రేంజ్‌ డీఐజీగా కె.వి.మోహన్‌రావు

15. గుంటూరు అర్బన్‌ ఎస్పీగా రామకృష్ణ

16. నర్సీపట్నం ఓఎస్డీగా సుమిత్‌ సునీల్

17. ఏపీఎస్పీ మంగళగిరి కమాండెంట్‌గా బి.కృష్ణారావు

18. ఏపీఎస్పీ కాకినాడ కమాండెంట్‌గా అమిత్‌ బర్దార్‌

19. కర్నూలు అదనపు ఎస్పీగా గౌతమిశాలి