Polavaram Project: పోలవరంపై కేంద్రం తీపికబురు, 2021కల్లా పూర్తి చేస్తామని తెలిపిన కేంద్ర మంత్రి షెకావత్, వందశాతం పోలవరం ప్రాజెక్ట్‌ ఖర్చును కేంద్రమే భరిస్తుందని వెల్లడి
Polavaram Project(Photo-wikimedia commons)

New Delhi, March 6: ఆంధ్రప్రదేశ్ జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్ట్ (Polavaram Project) నిర్మాణంపై కేంద్ర ప్రభుత్వం (Central Govt) తీపి కబురు చెప్పింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం (Polavaram Construction) 2021 డిసెంబర్‌నాటికల్లా పూర్తవుతుందని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేందర్ సింగ్ (Gajendra singh shekhawat) చెప్పారు.

కేంద్రమే పోలవరాన్ని పూర్తి చేయాలి

ఇప్పటికే 69శాతం పూర్తయ్యిందని ఆమేరకు రాష్ట్రప్రభుత్వం కేంద్రానికి తెలిపిందని లోక్‌సభలో చెప్పారు. పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా.. పోలవరం ప్రాజెక్ట్‌ను ఎప్పటిలోగా పూర్తి చేస్తారు..? అని కేంద్రాన్ని టీడీపీ ఎంపీ కేశినేని నాని (MP Kesineni Nani) అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి షెకావత్ లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు.

ఈ ఏడాది ఫిబ్రవరి నాటికల్లా 69శాతం ప్రాజెక్టు పనులు పూర్తయ్యాయని తెలిపారు. మరోవైపు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం అయ్యే పూర్తి ఖర్చును కేంద్రమే భరిస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఫిబ్రవరి నాటికి పోలవరం నిర్మాణం 69.54శాతం పూర్తయిందని రాష్ట్ర ప్రభుత్వం చెప్పిందని ఆయన అన్నారు.

పోలవరం ప్రాజెక్టుపై సుప్రీం కీలక వ్యాఖ్యలు

కేంద్రం ప్రకటన చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు రూ.8, 614.16 కోట్లు ఏపీకి తిరిగి చెల్లించాం. గత నెలలో రూ.1850 కోట్లు విడుదల చేశాం. ఖర్చు, ఆడిట్‌ నివేదికలు ఇవ్వాలని 2018, 2019లో లేఖలు రాశాం.. రాసిన రెండు లేఖలకు ఏపీ ప్రభుత్వం స్పందించలేదు’ అని షెకావత్‌ తేల్చి చెప్పారు.

పోలవరం రివర్స్ టెండరింగ్ ద్వారా రూ. 628 కోట్లు ఆదా

ఇదిలా ఉంటే గతేడాది మే 7న రివైజ్డ్ కాస్ట్ కమిటీకి కూడా కేంద్ర జలసంఘం లేఖ రాసిందని చెప్పారు. 2013-14కు గాను సవరించిన ధరల ప్రకారం రూ.54,446.1 కోట్లుగా అంచనా వేసినట్లు మంత్రి వెల్లడించారు. ఇక రాష్ట్రప్రభుత్వం నుంచి వచ్చిన వివరాల ప్రకారం తాత్కాలికంగా రూ. 5175.25 కోట్లకు గాను రూ.3777.44 కోట్ల వరకు ఆడిట్ పూర్తయ్యిందని మంత్రి తెలిపారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి మిగిలిన నిధులు విడుదల చేయాలంటే అది రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే లెక్కలపైనే ఆధారపడి ఉంటుందని చెప్పారు.