Supreme Court orders AP govt to submit the full details of Polavaram project (Photo-Wikimedia Commons)

Amaravathi, January 14: ఒడిశా ప్రభుత్వం (Odisha Govt) పోలవరం ప్రాజెక్టుపై దాఖలు చేసిన పిటిషన్‌పై మంగళవారం సుప్రీంకోర్టులో కీలక విచారణ జరిగింది. ఈ విచారణ సందర్భంగా పోలవరం ప్రాజెక్టుపై (Polavaram Project)తాజా నివేదిను సమర్పించాలని ఏపి ప్రభుత్వానికి అత్యున్నత నాయస్థానం సుప్రీంకోర్టు (Supreme Court) ఆదేశించింది.

కాగా గతేడాది డిసెంబర్‌ మాసంలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఒడిశా ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. ఈ ఒరిజినల్‌ సూట్‌పై సుప్రీం కోర్టు విచారణ చేపట్టిన విషయం అందరికీ విదితమే.

ఈ ప్రాజెక్టుకు సరైన అనుమతులు లేవని, స్టాఫ్‌వర్క్‌ ఆర్డర్‌ను పదేపదే నిలుపుతున్నారని ఒడిశా (Odisha) పిటిషన్ వేసింది. ఈ నేపథ్యంలోనే ఏపీ తరఫు న్యాయవాది జీఎన్‌ రెడ్డి వాదనలు వినిపించడానికి ఆరు వారాల గడువు కావాలని సుప్రీం ధర్మాసనాన్ని కోరారు. ఆయన అభ్యర్థనను పరిశీలించిన న్యాయస్థానం తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేస్తూ అప్పట్లో నిర్ణయం తీసుకుంది. నేడు విచారణకు వచ్చింది.

పోలవరం పనులు తిరిగి ప్రారంభం, భూమి పూజ చేసిన మేఘా సంస్థ ప్రతినిధులు

స్టాఫ్‌ వర్క్‌ ఆర్డర్‌ను నిలిపివేస్తూ గతంలో ఇచ్చిన ఉత్తర్వులపై అభ్యంతరాలు ఏమిటో చెప్పాలంటూ ఒడిశాకు సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీచేసింది. దీంతో స్పందించిన ఒడిషా ప్రభుత్వం ప్రాజెక్టు ముంపుపై కనీసం అధ్యయనం కూడా చేయలేదని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లింది. బచావత్‌ అవార్డుకు (Bachavat Award tribunal rules)భిన్నంగా ప్రాజెక్టు స్వరూపాన్ని మార్చారని ఒడిశా వాదించింది.

పోలవరం రివర్స్ టెండరింగ్ ద్వారా రూ. 628 కోట్లు ఆదా

తెలంగాణా ప్రభుత్వం(Telangana Govt) విషయానికి వస్తే, ప్రాజెక్టు నిర్మాణంపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేసింది. మణుగూరు ప్లాంట్‌, గిరిజనులకు ముంపు నష్టంలేకుండా చూడాలని తెలంగాణా ప్రభుత్వం కోర్ట్ ని కోరింది. దీనిపై స్పందించిన కేంద్ర ప్రభుత్వ న్యాయవాది, ప్రాజెక్టు యథాతథంగానే కొనసాగుతుందని.. ఎలాంటి మార్పులూ లేవని న్యాయస్థానానికి ఈ సందర్భంగా స్పష్టంచేశారు.

పోలవరం నిధులను విడుదల చేసిన కేంద్రం

అనంతరం సుప్రీంకోర్టు ఏపీ ప్రభుత్వానికి (AP Govt)కీలక ఆదేశాలు జారీచేసింది. ప్రాజెక్టు ప్రస్తుత స్థితి, నిర్మాణ చిత్రాలతో పూర్తి సమాచారం అందించడంతో పాటు ఒడిశా, తెలంగాణ అభ్యంతరాలపై రెండు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. పోలవరం ప్రభావిత రాష్ట్రాల సందేహాలను, అభ్యంతరాలు నివృత్తి చేయాల్సింది ఏపీయేనని తెలిపింది.

కేంద్రమే పోలవరాన్ని పూర్తి చేయాలి

ఈ ప్రాజెక్టు నిర్మాణంపై తాజాగా నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో ఏపీ న్యాయవాది రెండు వారాల్లోగా పోలవరానికి సంబంధించిన సమాచారం ఇస్తామని సర్వోన్నత న్యాయస్థానానికి తెలిపారు. విచారణ అంతా ముగిసిన తరువాత సుప్రీంకోర్టు తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.