Jagan Slams TDP-led Alliance Ruling: టీడీపీ ఎమ్మెల్యేలే చంపండని చెబుతున్నారు, ఇదేం పాలన అంటూ మండిపడిన వైఎస్ జగన్, హత్యకు గురైన సుబ్బారాయుడు కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని హామీ

Jagan Slams TDP-led alliance Ruling

Nandyal, August 9: నంద్యాలలోని సీతారామపురంలో టీడీపీ నేతల చేతిలో దారుణ హత్యకు గురైన సుబ్బారాయుడు కుటుంబ సభ్యులను వైఎస్‌ జగన్‌ పరామర్శించారు. ఈ క్రమంలో వారి కుటుంబానికి వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అనంతరం, వైఎస్‌ జగన్‌ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పాలన కాదు.. రెడ్‌ బుక్‌ పాలన చేస్తున్నారని అన్నారని మండిపడ్డారు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి. ఏపీలో లా అండ్‌ ఆర్డర్‌ నాశనం చేస్తున్నారు. ఏపీలో జరుగుతున్న హత్యల్లో చంద్రబాబు, లోకేష్‌లను ముద్దాయిలుగా చేర్చాలన్నారు. కేవలం ఆధిపత్యం కోసమే దాడులకు తెగబడుతున్నారని వైఎస్‌ జగన్‌ ఆరోపించారు. కావాలనే భయానక వాతావరణం సృష్టిస్తున్నారని.. ఇదెక్కడి పాలన అని ఆగ్రహం వ్యక్తం చేశారు.   పోలీసుల సమక్షంలోనే హత్యలు చేస్తున్నారు, రాష్ట్రంలో లా అండ్‌ ఆర్డర్‌ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోండని కోరిన వైఎస్ జగన్, వీడియో ఇదిగో

‘రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోంది. మారణహోమం సృష్టించే పాలన చేస్తున్నారు. రాష్ట్రంలో రెడ్‌ బుక్‌ పాలన అమలు చేస్తున్నారు. ఉళ్లలో ఆధిపత్యం కోసం వ్యవస్థలను భ్రష్టు పట్టిస్తున్నారు. రాష్ట్రంలో లా అండ్‌ ఆర్డర్‌ నాశనం చేస్తున్నారు. పోలింగ్‌ బూత్‌లో ఏజెంట్‌గా కూర్చున్నాడని చంపేశారు. పోలీసుల సమక్షంలోనే పెద్దసుబ్బారాయుడిని చంపేశారు. సుబ్బారాయుడి భార్యపై కూడా దాడి చేశారు. పోలీసుల ఎదుటే నిందితులు ఉన్నా ఎందుకు పట్టుకోలేదు?. నిందితులు పారిపోవడానికి పోలీసులు సహకరించారు. ఎవరి ప్రోద్భలంతో పోలీసులు నిందితులకు సహకరించారు. ఎస్ఐ సమక్షంలోనే సుబ్బారాయుడిని హత్య చేశారు, రాజకీయ కుట్ర లేకపోతే హత్య జరిగిన తర్వాత అడిషనల్‌ ఫోర్స్ ఎందుకు రాలేదని ప్రశ్నించిన వైఎస్ జగన్

హత్య చేసిన వాళ్లు ఎవరు?. చేయించిన వాళ్లు ఎవరు?. ప్రతీచోటా ఇలాంటి ఘటనలే జరుగుతున్నాయి. నిందితుల కాల్‌ డేటా చూస్తే ఎవరు చేయించారో తెలుస్తుంది. హత్య చేయించిన వారిని కూడా జైల్లో పెట్టాలి. హత్య జరిగిన తర్వాత గ్రామానికి అడిషనల్‌ ఫోర్స్ ఎందుకు పంపలేదు?. హత్య చేసిన వారిని ఎందుకు పట్టుకోలేదు. ఇంత జరుగుతున్నా అదనపు బలగాలు ఎందుకు రాలేదు?. తుపాకులు, కత్తులు, రాడ్డు, కర్రలతో దాడులు చేస్తున్నారు. చంద్రబాబు, నారా లోకేష్‌ అండదండలతో ఎస్‌ఐ సమక్షంలో నరికేశారు. టీడీపీ ఎమ్మెల్యేలు మీటింగ్స్ పెట్టి చంపండి అంటూ చెబుతున్నారు. ఈ హత్యల్లో చంద్రబాబు, లోకేష్‌లను కూడా ముద్దాయిలుగా చేర్చాలి.

రాష్ట్రంలో ప్రజలకు మంచి చేయాలనే ఆలోచన చంద్రబాబు లేదు. హామీలు అమలు చేయకుండా అరాచకం సృష్టిస్తున్నారు. ఎన్నికల సమయంలో మాయమాటలు చెప్పారు. చంద్రబాబు అక్కచెల్లెమ్మలను మోసం చేశాడు. ప్రతీ పిల్లవాడికి రూ.15వేలు ఇస్తానని చంద్రబాబు మోసం చేశాడు. డబ్బులు ఇస్తామన్నాడు ఏమైంది?. ఎన్నికలు అయిపోయిన తర్వాత చిన్నపిల్లలను మోసం చేశాడు. తల్లివందనం అని చెప్పి చివరకు పంగనామం పెట్టాడు. పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలను చంద్రబాబు మోసం చేశాడు. మన ప్రభుత్వమే అధికారంలో ఉండి ఉంటే ఇప్పటికే అందరికీ అమ్మఒడి, రైతుభరోసా అందేది. రైతులకు రూ.20 వేస్తామని మోసం చేశాడని మండిపడ్డారు.