Jagananna Vidya Deevena: 27,61,000 మంది పిల్లలకు మేనమామగా రూ.11,900 కోట్లు ఇచ్చాం, జగనన్న విద్యా దీవెన కార్యక్రమంలో సీఎం జగన్
జగనన్న విద్యాదీవెన పథకం కింద పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌లో భాగంగా 2023–24 విద్యా సంవత్సరంలో జూలై–సెప్టెంబర్ త్రైమాసికానికి సంబంధించి అర్హులైన 8,09,039 మంది విద్యార్థులకు రూ.584 కోట్లు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జరిగిన సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు.
AP CMO Press Meet: జగనన్న విద్యాదీవెన పథకం కింద పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌లో భాగంగా 2023–24 విద్యా సంవత్సరంలో జూలై–సెప్టెంబర్ త్రైమాసికానికి సంబంధించి అర్హులైన 8,09,039 మంది విద్యార్థులకు రూ.584 కోట్లు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జరిగిన సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు.
ఈ మొత్తంతో కలిపి జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన పథకాల కింద వైఎస్ జగన్ ప్రభుత్వం ఇప్పటివరకు రూ.18,576 కోట్లు ఖర్చు చేసింది. ఈ మొత్తం గత ప్రభుత్వం ఐదేళ్ల కాలంలో ఖర్చు చేసిన మొత్తం కంటే రూ.6,435 కోట్లు అధికం. మే 2023–ఆగస్ట్ 2023లలో 2,00,648 మంది విద్యార్థులకు మేలు చేస్తూ రూ.185.85 కోట్లు ఇప్పటికే విడుదల చేసింది.ఏపీ ప్రభుత్వం విద్యారంగంపై అక్షరాలా రూ.73,417 కోట్లు ఖర్చు చేసింది. జగనన్న విద్యా దీవెనకు సంబంధించి సలహాలు, సూచనలు, ఫిర్యాదుల కోసం జగనన్నకు చెబుదాం–1902 నంబర్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని ప్రభుత్వం పేర్కొంది.
ఉన్నత చదువులు చదివే పేద విద్యార్థులు భోజన, వసతి ఖర్చుల కోసం ఇబ్బంది పడకుండా ప్రతి విద్యా సంవత్సరంలో రెండు వాయిదాలలో ఐటీఐ విద్యార్థులకు రూ.10 వేలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.15 వేలు, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు అభ్యసించే వారికి రూ.20 వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తోంది.
పేద విద్యార్థులు కూడా పెద్ద చదువులు చదవాలన్న సమున్నత లక్ష్యంతో ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు చదివే పేద విద్యార్థులు కాలేజీలకు చెల్లించాల్సిన పూర్తి ఫీజుల మొత్తాన్ని క్రమం తప్పకుండా ఏ త్రైమాసికానికి ఆ త్రైమాసికం ముగిసిన వెంటనే కుటుంబంలో ఎంతమంది పిల్లలుంటే అంతమందికీ ఇచ్చేలా తల్లులు–విద్యార్థుల జాయింట్ అకౌంట్‌లో నేరుగా జమ చేస్తున్నారు.
ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ..మీ అందరి చిక్కటి చిరునవ్వుల మధ్య, మీ అందరి చెరగని ప్రేమానురాగాల మధ్య ఈరోజు దేవుడి దయతో మరో మంచి కార్యక్రమం భీమవరం నుంచి చేస్తున్నాం.ఈ రోజు పెద్ద చదువులు చదువుతున్న పిల్లలకు సంబంధించిన ఫీజుల డబ్బును మనందరి ప్రభుత్వం పిల్లల తల్లుల ఖాతాల్లోకి, పిల్లలు కూడా ఉన్న జాయింట్ ఖాతాల్లోకి జగనన్న విద్యా దీవెన డబ్బులు జమ చేయబోతున్నామన్నారు.
ప్రతి ఏడాదీ క్రమం తప్పకుండా మూడు నెలలకోసారి పూర్తి ఫీజురీయింబర్స్‌మెంట్‌కు సంబంధించిన డబ్బును తల్లుల ఖాతాల్లో జమ చేస్తున్నాం. 8 లక్షల 9 వేల 39 మంది పిల్లలకు మంచి జరిగిస్తూ నేరుగా ఈ కార్యక్రమం అయిపోయిన వెంటనే బటన్ నొక్కి 7,47,920 మంది తల్లుల ఖాతాల్లోకి జూలై, ఆగస్టు, సెప్టెంబర్ త్రైమాసికానికి సంబంధించిన 583 కోట్లను నేరుగా జమ చేయనున్నామని తెలిపారు.
ఫైనలియర్ విద్యార్థులకు ఏమాత్రం ఇబ్బంది కలగడకూడదనే ఉద్దేశంతో 2 లక్షల మంది విద్యార్థులకు చివరి ఇన్ స్టాల్ మెంట్గా చెల్లించాల్సిన ఫీజు కూడా వారి తల్లుల ఖాతాల్లో ఇప్పటికే జమ చేశాం.ఈ నాలుగున్నర సంవత్సరాల ప్రయాణం గమనించినట్టయితే ఈ ఒక్క జగనన్న విద్యా దీవెన అనే ఒక్క పథకం ద్వారా 27,61,000 మంది పిల్లలకు వారి పూర్తి ఫీజులు ఒక మంచి మేనమామగా రూ.11,900 కోట్లు ఇచ్చామన్నారు.
సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.
ఇదొక్కటే కాదు జగనన్న వసతి దీవెన.. నాలుగున్నర సంవత్సరాల్లో పిల్లలు చదువులే కాదు, వాళ్ల బోర్డింగ్, లాడ్జింగ్ ఖర్చులకు పిల్లలు ఇబ్బంది పడకూడదని చెప్పి ఆ విషయంలో కూడా పిల్లలకు అండగా, తోడుగా ఉంటూ దీని కోసం ఇచ్చింది మరో రూ.4,275 కోట్లు
►పెద్ద చదువులు చదువుతున్న ఈ పిల్లలకు ఉన్నతమైన చదువులు చదివేందుకు అప్పులపాలు కాకూడదనే తపన తాపత్రయంతో జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన కార్యక్రమాలతో ఖర్చు చేసింది రూ.16,176 కోట్లు
►ఈరోజు వీళ్ల బతుకులు మారాలి. కుటుంబాల్లోంచి ప్రతి ఒక్కరూ గొప్ప చదువులతో, గొప్ప డిగ్రీలతో బయటకు రావాలి. ఇంజనీరింగ్, కలెక్టర్లు, డాక్టర్లు కావాలని, ఆ కుటుంబాల తలరాతలు మారాలని తపనతో అడుగులు పడ్డాయి
►2017-18కి సంబంధించిన ఫీజుల సైతం పెండింగ్‌లో ఉన్న పరిస్థితులు, ఎగ్గొట్టిన పరిస్థితులు. రూ.1,777 కోట్లు కూడా మనందరి ప్రభుత్వమే ఆ పిల్లల కోసం చిక్కటి చిరునవ్వులతో మనమే చెల్లించాం
►గత ప్రభుత్వ హయాంలో 12 వేల కోట్లు కూడా సరిగా ఖర్చు చేయని పరిస్థితులు.. ఈరోజు రూ.18,576 కోట్లు ఖర్చు చేసిన పరిస్థితులు. తేడా గమనించాలని కోరుతున్నా
►చదువు అన్నది ఒక తలరాతలు మార్చే ఒక ఆస్తి
►మనిషి తలరాతనుగానీ, ఒక కుటుంబం పేదరికం నుంచి బయటకు రావాలని అనుకున్నా, వెనకబడిన కులాల తలరాతలుగానీ, ఒక దేశం భవిష్యత్ గానీ ఇవన్నీ మార్చగలిగిన శక్తి కేవలం ఒక్క చదువుకు మాత్రమే ఉంది
►దీన్ని గట్టిగా నమ్మాను కాబట్టే ఈరోజు మనందరి ప్రభుత్వం విద్యా విధానంలో గవర్నమెంట్ బడుల దగ్గర నుంచి మొదలు పెడితే ఉన్నత విద్య దాకా 55 నెలల ప్రయాణంలో విప్లవాత్మక అడుగులు వేశాం. వేయగలిగాం
►గతానికి, ఇప్పటికీ తేడా చూడమని అడుగుతున్నా
►నాడు-నేడుతో వారి బడులు బాగుపడిన తీరును గమనించాలి
►తెలుగు మీడియం నుంచి ఇంగ్లీషు మీడియంకు, సీబీఎస్ ఈతో మొదలై ఐబీ వరకు జరుగుతున్న ప్రయాణం
►పిల్లలందరినీ గొప్పగా చదివించాలనే తపన, తాపత్రయంతో 3వ తరగతి నుంచే టోఫెల్ ను సబ్జెక్ట్ గా తీసుకొచ్చిన పరిస్థితులు, సబ్జెక్ట్ టీచర్ ను తీసుకొచ్చిన పరిస్థితి.
►పిల్లల బంగారు భవిష్యత్ కోసం ఎంత తాపత్రయపడుతూ వాళ్ల జగన్ మామ అడుగులు వేశాడన్నది ప్రతి అడుగులోనూ కనిపిస్తుంది
►బడులను ఒకవైపు రూపురేఖలు మారుస్తూ, మరోవైపున ఉన్నత విద్యపై ధ్యాస పెట్టాం
►ఉన్నత విద్యలో కూడా సంస్కరణలు తీసుకొచ్చాం. కరిక్యులమ్‌లో మార్పులు చేశాం
►పిల్లలు ఏం చదువుతున్నారు, ఎలా ఉందని ధ్యాస పెట్టిన పరిస్థితి కేవలం మీ జగన్ మామ పరిపాలనలోనే జరుగుతోంది
►ఆన్ లైన్ వర్టికల్స్ ను కూడా డిగ్రీలో తీసుకురావడం జరిగింది
►10 నెలలపాటు ఇంటర్న్ షిప్ తీసుకొచ్చిన అడుగులు కూడా ఈ 55 నెలల కాలంలోనే పడ్డాయి
►జాబ్ ఓరియెంటెడ్గా అడుగులు వేగంగా పడుతూ వచ్చాయి
►మన పిల్లలు ప్రపంచంలో మేటి యూనివర్సీటీలతో పోటీ పడి చదవాలనే తపనతో, అంతర్జాతీయంగా ఆన్ లైన్ ఫ్లాట్ ఫాంలో ఎంఐటీ, హార్వర్డ్, ఎల్ బీఎస్, లాంటి సర్టిఫికెట్లు ఆ ప్రఖ్యాత యూనివర్సిటీ నుంచి వచ్చేట్టుగా హెడెక్స్ అనే సంస్థతో టై అప్ అయ్యి, ఆన్ లైన్ లో కోర్సులు తీసుకొస్తూ, ఏఐని అనుసంధానం చేస్తూ, డిగ్రీలో భాగం చేస్తూ ఈ ఫిబ్రవరి నుంచి ఆ దిశగా కూడా అడుగులు పడుతున్నాయి.
►మన పేద విద్యార్థి, మన పిల్లలు ప్రపంచంతో పాటు విద్యాభ్యాసం చేయగలిగితే వేగంగా ఎదగగలుగుతారు.
►ప్రపంచంలో ఎక్కడైనా పిలిచి ఆ పర్టిక్యులర్ సబ్జెక్టులో ఆ పర్టిక్యులర్ యూనివర్సిటీలకు సంబంధించిన సబ్జెక్ట్ సర్టిఫికెట్ మన డిగ్రీలతో భాగమైనప్పుడు మన పిల్లలకు ఉద్యోగాలు ఇక్కడ కాదు, ఎక్కడైనా ప్రపంచంలో ముందు వరుసలో మనం ఉంటాం.
►ఇదొక్కటే కాదు, ప్రపంచంలో ఎక్కడైనామన పిల్లలు గొప్ప చదువులు చదవగలిగితే, బెస్ట్ యూనివర్సిటీ నుంచి రాగలిగతితే, మన రాష్ట్ర తలరాతలు కూడా మార్చగలుగుతారు.
►జగనన్న విదేశీ విద్యా దీవెన తెచ్చాం. టాప్ 50 కాలేజీలు, 21 ఫ్యాకల్టీస్‌లో 350 కాలేజీల్లో సీటు వస్తే చాలు ఏకంగా ఆ కాలేజీల్లో సీట్లు వాటిలో ఫీజులు ప్రతి కాలేజీలోనూ 50 లక్షల నుంచి కోటి దాకా ఉన్నాయి.
►అయినా ఏ ఒక్కరూ అప్పులపాలు కావాల్సిన పని లేదు. భయపడాల్సిన పని లేదు
►ఈ పథకం ద్వారా సీటు తెచ్చుకోండి, కోటీ 25 లక్షల దాకా మీ జగన్ మామే భరిస్తాడని చెప్పాం
►జగనన్న విదేశీ విద్యా దీవెన వల్ల 400 మంది పిల్లలు ఇప్పటికే ప్రపంచ ప్రఖ్యాత కాలేజీల్లో చదువుతున్నారు
►వాళ్ల బతుకులతో పాటు రాష్ట్రం రూపురేఖలు మార్చే లీడర్షిప్ స్థాయికి రాబోయే రోజుల్లో వస్తారు
►ఒక్క విద్యా రంగంలోనే ఉన్నత విద్యగానీ, స్కూళ్లు గానీ సంస్కరణ మీదే 55 నెలల కాలంలో అక్షరాలా ఖర్చు చేసింది 73 వేల కోట్లు అని చెప్పడానికి గర్వపడుతున్నా
►ఇలాంటి గొప్ప మార్పులు ఒక్క విద్యారంగంలోనే కాదు, వైద్య రంగం, వ్యవసాయ రంగం, మహిళా సాధికారత విషయంలో, సామాజిక న్యాయం, పరిపాలన సంస్కరణల విషయంలో కూడా ప్రతి రంగంలోనూ, ప్రతి అడుగు వేస్తూ, మార్పులు చేస్తూ ప్రయాణం సాగుతోందని చెప్పడానికి గర్వపడుతున్నా
(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)