YS Avinash Reddy Covid 19: కడప ఎంపీ అవినాష్ రెడ్డికి కరోనా పాజిటివ్, హోం ఐసోలేషన్ కు వెళ్లిన కడప ఎంపీ, సెప్టెంబర్ 1, 2వ తేదీల్లో సీఎం జగన్ కడప టూర్
వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా సీఎం జగన్ సెప్టెంబర్ 1, 2 తేదీల్లో ఇడుపుల పాయలో (CM Jagan's Kadapa tour) పర్యటించనున్నారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యే వైఎస్ కుటుంబ సన్నిహితులు, మీడియా ప్రతినిధులకు వైద్యులు కరోనా టెస్టులు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా అవినాష్ రెడ్డికి కరోనా పాజిటివ్ వచ్చినట్టు తేలింది. దీంతో వెంటనే వైఎస్ అవినాష్ రెడ్డి హోం ఐసోలేషన్ కు వెళ్లారు. తన వెంట గత వారంరోజుల నుంచి తిరుగుతున్న వారిని కరోనా పరీక్షలు చేయించుకోవాల్సిందిగా సూచించారు.
Amaravati, August 30: ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి బంధువు, కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి కరోనా (YS Avinash Reddy Covid 19) సోకింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా సీఎం జగన్ సెప్టెంబర్ 1, 2 తేదీల్లో ఇడుపుల పాయలో (CM Jagan's Kadapa tour) పర్యటించనున్నారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యే వైఎస్ కుటుంబ సన్నిహితులు, మీడియా ప్రతినిధులకు వైద్యులు కరోనా టెస్టులు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా అవినాష్ రెడ్డికి కరోనా పాజిటివ్ వచ్చినట్టు తేలింది. దీంతో వెంటనే వైఎస్ అవినాష్ రెడ్డి హోం ఐసోలేషన్ కు వెళ్లారు. తన వెంట గత వారంరోజుల నుంచి తిరుగుతున్న వారిని కరోనా పరీక్షలు చేయించుకోవాల్సిందిగా సూచించారు.
ఏపీలో ప్రభుత్వం జారీ చేసిన కరోనా హెల్త్ బులెటిన్ ప్రకారం కరోనా కేసుల సంఖ్య 4,14,164కు చేరింది. 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో కొత్తగా 10,548 మందికి కొవిడ్-19 పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. కరోనాతో ఇప్పటివరకు 3,796 మంది మృతిచెందారు. రాష్ట్రంలో కరోనా నుంచి 3,12,687 మంది బాధితులు కోలుకున్నారు ఏపీలో ప్రస్తుతం 97,681 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రంలో 24 గంటల వ్యవధిలో 62,024 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు.ఏపీలో ఇప్పటివరకు 36.03 లక్షల మందికి కరోనా పరీక్షలు చేశారు.