#DishaApp: మహిళ భద్రతతో పాటు అన్ని రకాల ఫీచర్లు దిశ యాప్‌లో.., దీనిపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్న ఏపీ పోలీసులు, యాప్‌ను అందరూ డౌన్లోడ్ చేసుకోవాలని పిలుపు
దీనిని అందరూ డౌన్లోడ్ చేసుకోవాలని ఏపీ పోలీసులు (Andhra Pradesh Police) ట్విట్టర్ ద్వారా అవగాహన కల్పిస్తున్నారు. రహదారిపై సురక్షితంగా మరియు అప్రమత్తంగా ఉండండి.
Amaravati, June 29: ఏపీ ప్రభుత్వం తీసుకువచ్చిన దిశ యాప్ సోషల్ మీడియాలో దూసుకుపోతోంది. దీనిని అందరూ డౌన్లోడ్ చేసుకోవాలని ఏపీ పోలీసులు (Andhra Pradesh Police) ట్విట్టర్ ద్వారా అవగాహన కల్పిస్తున్నారు. రహదారిపై సురక్షితంగా మరియు అప్రమత్తంగా ఉండండి. మీ దిశ యాప్‌లో (DishaApp) రోడ్ సేఫ్టీ ఫీచర్ కింద బ్లాక్ స్పాట్స్, యాక్సిడెంట్ మ్యాపింగ్, # ఫార్మసీలు, # బ్లడ్‌బ్యాంక్స్, డయాలసిస్ సెంటర్లు & ఆరోగ్య సౌకర్యాల కోసం తనిఖీ చేయండి అంటూ సోషల్ మీడియా ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.
ఏపీ ప్రభుత్వం గతేడాది ఫిబ్రవరిలో దిశాయాప్‌ను రూపోందించి విడుదల చేసింది. దీనికి సంబందించి చట్టాన్ని, దిశా పోలీస్ స్టేషన్లను కూడా తీసుకొచ్చింది. దిశా యాప్‌పై విస్తృతమైన అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం సిద్దమైంది. దిశాయాప్ ఆండ్రాయిడ్ వెర్షన్‌ను ప్లేస్టోర్ ద్వారా, ఐఓఎస్ వెర్షన్‌ను యాప్ స్టోర్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. డౌన్‌లోడ్ చేసుకున్నాక మొబైల్ నెంబర్ ఎంటర్ చేయగానే ఓటీపీ వస్తుంది. ఓటీపీ సబ్మిట్ చేసిన తరువాత వ్యక్తిగత వివరాలు, అత్యవసర సమయంలో సమయం అందించేందుకు వీలుగా అదనపు కుటుంబ సభ్యుల మొబైల్ నెంబర్లు ఇవ్వాలి. దిశ యాప్ డౌన్‌లోడ్ చేసుకున్నారా..లేకుంటే ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలో తెలుసుకోండి
Here's AP Police Tweet
మహిళలు ఆపదలో ఉన్నామని భావించినపుడు యాప్ లోని ఎస్ఓఎస్ బటన్ ప్రెస్ చేస్తే 10 సెకన్ల వీడియోతో పాటు, మొబైల్ లోకేషన్ తో దిశా కమాండ్ కంట్రోల్ రూమ్‌కు సమాచారం వెళ్తుంది. సిబ్బంది దగ్గరలోని పోలీసులకు అలర్ట్ చేయడం ద్వారా నిమిషాల వ్వవధిలో మహిళలను ఆపద నుంచి రక్షించే అవకాశం ఉంటుంది.
అంతేకాదు, ప్రయాణం చేసే సమయంలో రక్షణకోసం ట్రాక్ మై ట్రావెల్ అనే అప్షన్ లో గమ్యస్థానం వివరాలు ఎంటర్ చేస్తే, ఆమె ప్రయాణం పూర్తయ్యే వరకు అనుక్షణం ట్రాకింగ్ జరుగుతుంది. వాహనం మార్గం మారినా, ఎదైనా ప్రమాదం జరిగినా వెంటనే సిబ్బందిని అలర్ట్ చేస్తుంది. మహిళలకు పూర్తిస్థాయి రక్షణ కల్పించేందుకు ఈ యాప్ ఎంతగానో ఉపయోగపడుతుంది.