Kollu Ravindra's Bail Petition: కొల్లు రవీంద్ర బెయిల్ పిటిషన్‌ను కొట్టివేసిన కోర్టు, బయటికి వస్తే కేసును ప్రభావితం చేసే అవకాశం ఉందని వాదించిన పబ్లిక్ ప్రాసిక్యూటర్, ఏకీభవించిన ధర్మాసనం

కొల్లు రవీంద్ర బెయిల్‌ పిటిషన్‌ను (Kollu Ravindra's Bail Petition) జిల్లా కోర్టు గురువారం కొట్టేసింది. ఆయన బయటికి వస్తే కేసును ప్రభావితం చేసే అవకాశం ఉందన్న పబ్లిక్ ప్రాసిక్యూటర్(పీపీ) వాదనతో న్యాయమూర్తి ఏకీభవించారు. అతనికి బెయిల్‌ ఇవ్వరాదని తేల్చి చెప్పారు. కొల్లు రవీంద్రతో పాటు మిగతా నిందితులకు కూడా కూడా కోర్టు బెయిల్‌ (Kollu Ravindra bail petition dismissed) నిరాకరించింది.

Moka Bhaskar Rao's Murder Case, Machilipatnam DSP Mahaboob Basha, Kollu Ravindra, Perni nani (Photo-Twitter)

Amaravati, Juy 30: మోకా భాస్కరరావు హత్య కేసులో నిందితుడు అయిన మాజీ మంత్రి, టీడీపీ నేత కొల్లు రవీంద్రకు జిల్లా కోర్టులో చుక్కెదురైంది. కొల్లు రవీంద్ర బెయిల్‌ పిటిషన్‌ను (Kollu Ravindra's Bail Petition) జిల్లా కోర్టు గురువారం కొట్టేసింది. ఆయన బయటికి వస్తే కేసును ప్రభావితం చేసే అవకాశం ఉందన్న పబ్లిక్ ప్రాసిక్యూటర్(పీపీ) వాదనతో న్యాయమూర్తి ఏకీభవించారు. అతనికి బెయిల్‌ ఇవ్వరాదని తేల్చి చెప్పారు. కొల్లు రవీంద్రతో పాటు మిగతా నిందితులకు కూడా కూడా కోర్టు బెయిల్‌ (Kollu Ravindra bail petition dismissed) నిరాకరించింది. వైసీపీ నేత హత్య కేసు, టీడీపీ మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అరెస్ట్, ఇప్పటికే ఈ కేసులో అయిదుమందిని అరెస్ట్ చేసిన పోలీసులు

గత నెల 29న మచిలీపట్నం చేపల మార్కెట్‌ వద్ద కొందరు వ్యక్తులు వైఎస్సార్‌సీపీ నేత మోకా భాస్కరరావును దారుణంగా హత్య (Moka Bhaskar Rao's murder case) చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో చింతా నాంచారయ్య (చిన్ని), చింతా నాంచారయ్య (పులి), చింతా నాగమల్లేశ్వరరావు, చింతా వంశీకృష్ణ, పోల రాము, ధనలతో పాటు ఓ మైనర్‌ను అరెస్ట్‌ చేశారు. ఈ కేసులో కుట్ర దారునిగా పేర్కొంటూ మాజీ మంత్రి కొల్లు రవీంద్రను ఏ–4 నిందితుడిగా అరెస్ట్‌ చేశారు. ప్రస్తుతం ఆయన రాజమండ్రి సెంట్రల్‌ జైలులో రిమాండ్‌ ఖైదీగా ఉన్నారు.  వైఎస్సార్‌సీపీ నేత దారుణ హత్య, సైనేడ్‌ పూసిన కత్తితో మోకా భాస్కర్‌ రావును హత్యచేసిన దుండుగులు, మచిలీపట్నంలో 144 సెక్షన్

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, మచిలీపట్నం మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ మోకా భాస్కర్ రావు (Moka Bhaskar Rao) హత్య కేసులో టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర (TDP leader Kollu Ravindra) హస్తం ఉందంటూ భాస్కర్ రావు కుటుంబసభ్యులు ఆరోపించారు. మచిలీపట్నంలో పోలీస్ స్టేషన్ ఎదుట భాస్కర్ రావు వర్గీయులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. కొల్లు రవీంద్ర ప్రోద్బలంతోనే ఈ హత్య జరిగిందంటూ భాస్కర్ రావు కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు నేపథ్యంలో కొల్లు రవీంద్ర ఇంటిని పోలీసులు సోదా చేశారు. కొల్లు రవీంద్ర అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. వైసీపీ నేత హత్య కేసులో రవీంద్రకు భాగం ఉందంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిన కుటుంబ సభ్యులు

అనంతరం ఆయన్ను తూర్పుగోదావరి జిల్లా తుని మండలం సీతారాంపురం వద్ద పోలీసులు అరెస్ట్ చేశారు. విశాఖ వెళ్తుండగా పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేశారు. అనంతరం కోర్టులో హాజరుపరచడంతో న్యాయస్థానం రవీంద్రను రిమాండ్‌కు పంపింది. ఈ క్రమంలో తనకు బెయిల్ ఇవ్వాలంటూ కొల్లు రవీంద్ర జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దాన్ని న్యాయస్థానం కొట్టివేసింది.

మరోవైపు ఈఎస్ఐ స్కాంలో మాజీమంత్రి, టీడీపీ సీనియర్ నేత అచ్చెన్నాయుడు బెయిల్ పిటిషన్‌ను ఈనెల 29న ఏపీ హైకోర్టు కొట్టేసింది. అచ్చెన్నాయుడితో పాటు రమేశ్ కుమార్, పితాని సత్యనారాయణ పీఏ మురళి, సుబ్బారావు బెయిల్ పిటిషన్లను హైకోర్టు తోసిపుచ్చింది. కేసుకు సంబంధించి ఇరు వర్గాల వాదనలు విన్న ఏపీ హైకోర్టు... ఏసీబీ వాదనతో ఏకీభవించింది. ఈ కేసుకు సంబంధించిన ఇంకా అనేక మందిని అదుపులోకి తీసుకుని విచారించాల్సి ఉందని.. ఒకవేళ నిందితులకు బెయిల్ ఇస్తే సాక్ష్యాలు తారుమారయ్యే అవకాశం ఉందని హైకోర్టుకు వివరించింది. ఏసీబీ వాదనతో ఏకీభవించిన హైకోర్టు.. అచ్చెన్నాయుడు సహా మరికొందరి బెయిల్ పిటిషన్లను కొట్టేసింది.