Suspected Deaths: కృష్ణా జిల్లాలో మిస్టరీ డెత్స్ కలకలం, మూడు అనుమానాస్పద మృత దేహాలను గుర్తించిన స్థానికులు, రంగంలోకి దిగిన పోలీసులు, ఒకే కుటుంబానికి చెందిన వారని నిర్ధారణ
కృష్ణా జిల్లాలోని విస్సన్నపేట (vissannapeta) శివారులో ముగ్గురు సంచార చిరు వ్యాపారులు అనుమానాస్పద రీతిలో మృతి చెందారు. సోమవారం ఉదయం మూడు మృతదేహాలను (mystery deaths) అక్కడి స్థానికులు గుర్తించారు. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. హత్యకు గురైన వారిలో మహిళ, యువతితో పాటు ఓ యువకుడు ఉన్నారు.
Amaravati, Oct 5: ఏపీలో అనుమానాస్పద చావుల మిస్టరీ (Suspected dead bodies కలకలం రేపుతున్నాయి. కృష్ణా జిల్లాలోని విస్సన్నపేట (vissannapeta) శివారులో ముగ్గురు సంచార చిరు వ్యాపారులు అనుమానాస్పద రీతిలో మృతి చెందారు. సోమవారం ఉదయం మూడు మృతదేహాలను (mystery deaths) అక్కడి స్థానికులు గుర్తించారు. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. హత్యకు గురైన వారిలో మహిళ, యువతితో పాటు ఓ యువకుడు ఉన్నారు.
చెట్ల పొదల్లో సోమవారం ఉదయం మూడు మృతదేహాలను (Krishna district mystery deaths) గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో విషయం వెలుగుచూసింది. మృతుల్లో ఓ మహిళ, యువతి కూడా ఉన్నారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారిగా పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. అనుమానాస్పద మరణాలుగా కేసులు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
మృతులు నూజివీడు మండలం కొత్త ఈదర గ్రామానికి చెందిన చిన్నస్వామి, తిరుపతమ్మ, మీనాక్షిలుగా పోలీసులు గుర్తించారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారని నిర్ధారణకు వచ్చారు. అయితే ఈ ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడ్డారా..? లేక ఎవరు హత్య చేసి ఉంటారా..? వీరి హత్యకు గల కారణాలేంటి..? వంటి ప్రశ్నలపై పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు.