Andhra Pradesh: భర్త లింగమార్పిడి..వేరొకరితో సంబంధం పెట్టుకున్న భార్య, ప్రియుడితో బైక్ మీద వెళుతుండగా రోడ్డు ప్రమాదం, ఆ తరువాత ఇద్దరూ మృతి

ఏపీలోని ఏలూరు బీడీ కాలనీలో ఈ ఘటన మూడు రోజుల క్రితం జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

representational image (photo-Getty)

Amaravati, Dec 8: ఏలూరులో యువతి రోడ్డు ప్రమాదంలో మృతి (Woman dies) చెందగా వెంటనే ఆ యువతితో సహజీవనం చేసిన ప్రియుడు ఉరివేసుకుని ఆత్మహత్యకు (Lover Committed Suicide) పాల్పడ్డాడు. ఏపీలోని ఏలూరు బీడీ కాలనీలో ఈ ఘటన మూడు రోజుల క్రితం జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఏలూరు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక బీడీ కాలనీ గట్టు ప్రాంతంలో నివాసముంటున్న లక్కపాము సుధారాణి(22), తాడి డింపుల్‌కుమార్‌ (23) ఒకే ఇంట్లో ఉంటూ కొంతకాలంగా సహజీవనం చేస్తున్నారు.

సుధారాణికి అంతకు ముందే పెళ్లయింది. తన భర్త సాయిప్రభు రికార్డింగ్‌ డ్యాన్సులు నిర్వహిస్తుంటాడు. అయితే సాయిప్రభు రెండేళ్ల క్రితం లింగమార్పిడి చేయించుకోవటంతో సుధారాణి అతడిని విడిచిపెట్టి అదే ప్రాంతంలో ఉంటున్న డింపుల్‌కుమార్‌కు దగ్గరైంది. వీరికి కూడా ఓ పాప పుట్టింది. ఇక మొదటి భర్తతో కలిసి ఉన్నప్పుడు వీరికి ఇద్దరు కుమార్తెలు కలిగారు. సుధారాణి మొదటి భర్త సంతానాన్ని ఆమె తల్లి వద్ద ఉంచి.. డింపుల్ తో ఓ ఇల్లు అద్దెకు తీసుకుని సహజీవనం చేస్తోంది. వ్యసనాలకు బానిసైన ఇద్దరూ రాత్రి వేళ మద్యం తాగి తిరుగుతుంటారు.

ఈ నేపథ్యంలోనే శుక్రవారం రాత్రి ద్విచక్ర వాహనంపై బయటకు వెళ్లిన వీరిద్దరూ అర్ధరాత్రి దాటాక ఇంటికి వస్తున్న క్రమంలో ఇంటి సమీపంలో మలుపు వద్ద ద్విచక్ర వాహనం అదుపుతప్పటంతో పడిపోయారు. దీంతో ఇద్దరికీ గాయాలయ్యాయి. సుధారాణి తలకు తీవ్రగాయాలు కావటంతో ఘటనా స్థలంలోనే మరణించింది. ఆమె మృతితో భయపడిన డింపుల్‌కుమార్‌ వాహనాన్ని అక్కడే విడిచిపెట్టి సమీపంలోని తమ ఇంటికి వెళ్లి ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

భర్త, ప్రియుడు, చివరకు ఎస్ఐ యువతిని దారుణంగా., న్యాయం కోసం స్టేషన్‌కు వెళితే పలుచోట్లకు తీసుకువెళ్లి అత్యాచారం చేసిన ఎస్సై, మొత్తం ఎనిమిది మందిపై కేసులు నమోదు

శనివారం వేకువ జామున సుధారాణిని గుర్తించిన ఆమె కుటుంబ సభ్యులు...ఆధార్ కార్డు కోసం సుధారాణి నివసిస్తున్న ఇంటికి వెళ్లారు. తలుపులు వేసి ఉండటంతో తాళం పగులగొట్టి వెళ్లగా డింపుల్‌ ఉరేసుకుని ఉండటాన్ని గమనించారు. వెంటనే పోలీసులకు సమాచారమందించారు. వారు వెంటనే ఘటనా స్థలానికి వెళ్లి వివరాలు సేకరించారు. రూరల్‌ ఎస్సై లక్ష్మణబాబు కేసు దర్యాప్తు చేపట్టారు. దీనిపై స్థానికుల వాదన మరోలా ఉంది. వీరిద్దరూ గంజాయి వంటి మత్తు పదార్థాలకు బానిసలయ్యారని, సుధారాణిని డింపుల్‌కుమార్‌ హత్యచేసి తరువాత భయపడి ఆత్మహత్య చేసుకుని ఉంటాడని అంటున్నారు.



సంబంధిత వార్తలు

Cyclone Fengal: ఏపీకి ఫెంగల్ తుఫాను ముప్పు, ఎల్లో అలర్ట్ జారీ చేసిన ఐఎండీ, తీరం వెంబడి గంటకు 75 కిలో మీటర్ల వేగంతో గాలులు, నేడు తమిళనాడును తాకనున్న సైక్లోన్

Cyclone Fengal: తమిళనాడు వైపు దూసుకొస్తున్న ఫెంగల్ తుఫాను, స్కూళ్లకు సెలవులు ప్రకటించిన స్టాలిన్ సర్కారు, పలు జిల్లాలకు ఎల్లో, ఆరెంజ్ అలెర్ట్ జారీ

AP CM Chandrababu: గత ఐదేళ్లలో వ్యవస్థలన్నీ విధ్వంసానికి గురయ్యాయి..జీవోలను రహస్యంగా ఉంచారని సీఎం చంద్రబాబు మండిపాటు, అధికారాన్ని దుర్వినియోగం చేయడం రాజ్యాంగ ఉల్లంఘనే అని కామెంట్

Deputy CM Pawan Kalyan: కేంద్రమంత్రి షెకావత్‌తో డిప్యూటీ సీఎం పవన్ భేటీ, టూరిజం హబ్‌గా ఏపీ..కేంద్రం సాయంతో పలు పర్యాటక ప్రాజెక్టులు రాబోతున్నాయని వెల్లడించిన పవన్ కళ్యాణ్