Mana Palana-Mee Suchana Day 3: ఇంగ్లీష్ మీడియంపై సుప్రీంకోర్టుకు ఏపీ ప్రభుత్వం, విద్యా వ్యవస్థపై మూడో రోజు మన పాలన-మీ సూచన కార్యక్రమం, పలు విషయాలను ప్రసావించిన ఏపీ సీఎం
ఈ సందర్భంగా పాఠశాలల్లో నాడు-నేడు (Nadu-Nedu), ఇంగ్లిష్ మీడియం (English Medium) విద్య, అమ్మఒడి, జగనన్న విద్యాకానుక, వసతి దీవెన, ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై చర్చించారు. విద్యారంగ నిపుణులు, లబ్ధిదారులతో సీఎం వైఎస్ జగన్ ముఖాముఖి నిర్వహించారు. ఈ సంధర్భంగా ఏపీ సీఎం పలు విషయాలను మాట్లాడారు.
Amaravati, May 27: మన పాలన-మీ సూచన కార్యక్రమం (Mana Palana-Mee Suchana Day 3) మూడో రోజులో భాగంగా నేడు విద్యారంగంపై (Education Sector) తాడేపల్లిలోని క్యాంపు ఆఫీస్‌లో సీఎం వైఎస్ జగన్ సమీక్ష (Ap Cm YS Jagan Review)నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలల్లో నాడు-నేడు (Nadu-Nedu), ఇంగ్లిష్ మీడియం (English Medium) విద్య, అమ్మఒడి, జగనన్న విద్యాకానుక, వసతి దీవెన, ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై చర్చించారు. విద్యారంగ నిపుణులు, లబ్ధిదారులతో సీఎం వైఎస్ జగన్ ముఖాముఖి నిర్వహించారు. ఈ సంధర్భంగా ఏపీ సీఎం పలు విషయాలను మాట్లాడారు. Mee Suchana Day 2: రైతులు, కూలీల్లో చిరునవ్వును చూడటమమే లక్ష్యం, రైతులకు మరిన్ని పథకాలు అందిస్తామని తెలిపిన ఏపీ సీఎం వైయస్ జగన్
అమ్మఒడి, విద్యాదీవెన, వసతి దీవెన పథకాలపై పెడుతున్న ఖర్చు.. మన పిల్లల భవిష్యత్ కోసం తాను పెడుతున్న పెట్టుబడి అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. మనం పిల్లలకు ఇవ్వగలిగే ఆస్తి విద్య మాత్రమేనని మరోసారి స్పష్టం చేశారు. ఇంగ్లిషు మీడియం వద్దనే పెద్ద మనుషులు.. వాళ్ల పిల్లలను ఎక్కడికి పంపిస్తున్నారో ఆలోచించుకోవాలన్నారు.
పాదయాత్రలో పిల్లలను చదివించలేక ఇబ్బందిపడుతున్న చాలా మంది తల్లిదండ్రులను కలిశా. చదువు కోసం తండ్రి అప్పులపాలు కాకూడదని తన కుమారుడు ఆత్మహత్య చేసుకున్నట్లు గోపాల్ అనే వ్యక్తి పాదయాత్రలో నాతో చెప్పారు. పేదరిక నిర్మూలనకు ఉన్న ఏకైక పరిష్కారం చదువు మాత్రమే. అందుకే విద్యారంగంలో మార్పులు తీసుకురావడానికి శ్రీకారం చుట్టాం. విద్యారంగంలో మార్పుల్లో భాగంగానే ఇంగ్లిష్ మీడియాన్ని తీసుకొచ్చాం.
Here's AP CMO Tweet
ఇంగ్లిష్ మీడియంపై ఇంటింటి సర్వే చేశాం. దాదాపు 40 లక్షల మంది పిల్లల తల్లిదండ్రుల అభిప్రాయాలు తీసుకుంటే.. అందులో 96శాతం మంది ఇంగ్లిష్ మీడియం కావాలన్నారు. ఇంగ్లిష్ మీడియాన్ని తీసుకొచ్చేందుకు సుప్రీంకోర్టుకు కూడా వెళ్తామని తెలిపారు. మన పాలన – మీ సూచనలో ఏపీ సీఎం వైయస్ జగన్, మే 30వ తేదీ వరకూ జరగనున్న కార్యక్రమం, ఈ ఏడాది పథకాల క్యాలండర్ ఇదే
నాడు - నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీల్లో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయబోతున్నాం. రాష్ట్రవ్యాప్తంగా 47,656 ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీలున్నాయి. మొదటి విడతలో 15,715 ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీల్లో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయబోతున్నాం. ప్రతి పాఠశాలల్లోనూ ఫర్నీచర్, టాయిలెట్లు ఉండాలని తెలిపారు. ఇంగ్లిష్ మీడియానికి సంబంధించి కూడా చిన్న, చిన్న సమస్యలు ఎదురయ్యాయి. వీటిని అధిగమించడానికి ఆంగ్ల బోధనకు సంబంధించి టీచర్లకు శిక్షణ ఇస్తున్నాం. పేదవాళ్ల పిల్లలు ఇంగ్లిష్‌లో మాట్లాడే పరిస్థితి రావాలని కోరారు.
పిల్లల చదువులు తల్లిదండ్రులకు భారం కాకూడదనే అమ్మఒడి తీసుకొచ్చాం. 80 లక్షల మంది పిల్లలకు లాభం చేకూరేలా ఈ జనవరిలో అమ్మఒడి ప్రారంభించాం. 43 లక్షల మంది తల్లులకు రూ.6350 కోట్లను నేరుగా బ్యాంక్ అకౌంట్లలో జమ చేశామని అన్నారు.
కోవిడ్ కారణంగా ఆగస్టు 3 నుంచి పాఠశాలలు తెరుస్తున్నాం. పాఠశాలలు తెరిచిన తొలిరోజే జగనన్న విద్యాకానుక ఇస్తాం. జగనన్న విద్యాకానుకలో యూనిఫాం, బుక్స్, షూలు, బెల్ట్, బ్యాగ్ అందిస్తాం. మధ్యాహ్న భోజనం పెట్టే ఆయాలకు రూ.వెయ్యి నుంచి రూ.3వేలకు పెంచాం. సరుకుల బిల్లులతోపాటు ఆయాల జీతాలు ఎలాంటి ఆలస్యం లేకుండా ఇస్తాం. పిల్లలకు పౌష్టికాహారం అందేలా మెనూ రూపొందించాం’ అని తెలిపారు.