Manabadi AP Inter Result 2020: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల, ప్రథమ, ద్వీతీయ సంవత్సరాల ఫలితాలు ఒకే రోజు విడుదల, పాసయ్యారో లేదో చెక్ చేసుకోవడం ఎలా ?

విజయవాడలోని గేట్ వే హోటల్ లో విద్యాశాఖా మంత్రి ఆదిమూలపు సురేష్ ఫలితాలను విడుదల చేశారు. ప్రథమ, ద్వీతీయ సంవత్సరాల ఫలితాలను ఒకే రోజు విడుదల చేశారు. విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బి.రాజశేఖర్‌ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఫలితాలు https://bie.ap.gov.in, www.sakshieducation.com తదితర వెబ్‌సైట్లలో అందుబాటులో ఉంటాయి. బోర్డు వెబ్‌సైట్లో హాల్‌టికెట్‌ నంబర్, పుట్టిన తేదీని నమోదు చేయడం ద్వారా ఫలితాలు పొందవచ్చు.

7 learning and education apps offering free access during the coronavirus lockdown| (Photo Credits: PTI)

Amaravati, June 12: ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. విజయవాడలోని గేట్ వే హోటల్ లో విద్యాశాఖా మంత్రి ఆదిమూలపు సురేష్ ఫలితాలను విడుదల చేశారు. ప్రథమ, ద్వీతీయ సంవత్సరాల ఫలితాలను ఒకే రోజు విడుదల చేశారు. విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బి.రాజశేఖర్‌ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఫలితాలు http://bie.ap.gov.in/ తదితర వెబ్‌సైట్లలో అందుబాటులో ఉంటాయి. బోర్డు వెబ్‌సైట్లో హాల్‌టికెట్‌ నంబర్, పుట్టిన తేదీని నమోదు చేయడం ద్వారా ఫలితాలు పొందవచ్చు. ఎలాంటి కోచింగ్ అవసరం లేదు, నేషనల్ టెస్ట్ అభ్యాస్ యాప్ ఉంటే చాలు, జేఈఈ, నీట్‌ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అయిపోవచ్చు, 10 లక్షల డౌన్‌లోడ్‌లు దాటిన ఎన్‌టిఎ యాప్

ఇంటర్‌ మొదటి సంవత్సరం 5,07,228 మంది, రెండో సంవత్సరం 4,88,795 మంది, ఒకేషనల్‌ మొదటి సంవత్సరం 39,139 మంది, రెండో సంవత్సరం 29,993 మంది మొత్తం 10,65,155 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. ఇంటర్‌లో గ్రేడింగ్‌ విధానాన్ని రద్దు చేసినందున మొదటి సంవత్సరం ఫలితాల్లో సబ్జెక్టుల వారీగా మార్కులు, రెండో సంవత్సరం ఫలితాలు సబ్జెక్టుల వారీగా గ్రేడ్‌ పాయింట్లలో ప్రకటించనున్నారు. ఇక ఫలితాల షార్ట్‌ మార్కుల మెమోలు ఈనెల 15వ తేదీ నుంచి విద్యార్థులకు ఇంటర్‌ బోర్డు వెబ్‌సైట్లో అందుబాటులో ఉంటాయి. వాటిని డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. లాక్‌డౌన్‌ సడలింపుల తర్వాత పరీక్ష ఫలితాలు వెల్లడిస్తున్న మొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌ కావడం విశేషం.

ఏపీలో మార్చి 4 నుంచి ఇంటర్ పరీక్షలు నిర్వహించగా, చివరి పరీక్షకు ముందు దేశవ్యాప్తంగా కరోనా లాక్ డౌన్ విధించారు. దీంతో మిగిలి పోయిన ఒక్క పరీక్షను జూన్ 3న నిర్వహించారు. అంతకు ముందే మార్చి 19 నుంచి స్పాట్ వాల్యుయేషన్ ప్రారంభించారు. మధ్యలో లాక్ డౌన్ కారణంగా కొంత ఆలస్యం అయింది. రెండు నెలలు ఆలస్యంగా పరీక్షల ఫలితాలు వచ్చాయి. ఈరోజు ప్రకటించిన ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాల్లో బాలికలు సత్తా చాటారు.

మొదటి సంవత్సరంలో 2,57,619 మంది బాలికలు పరీక్షలకు హాజరుకాగా, అందులో 1,64,365 ఉత్తీర్ణత సాధించారు. అంటే, 64 శాతం పాస్ అయినట్టు. మొదటి సంవత్సరం బాలుర విషయానికి వస్తే 2,49,611 మంది పరీక్షకు హాజరయ్యారు. అందులో పాస్ అయిన వారి సంఖ్య 1,36,196. అంటే 55 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఇక రెండో సంవత్సరంలో కూడా బాలికలే పై చేయి సాధించారు.

AP ఇంటర్ ఫలితాలు 2020 ఎలా తనిఖీ చేయాలి

అధికారిక వెబ్‌సైట్ bie.ap.gov.in ని సందర్శించండి

AP ఇంటర్ ఫలితాలు 2020' చదివే లింక్‌పై క్లిక్ చేయండి

మీ రోల్ నంబర్ మరియు అవసరమైన ఇతర వివరాలను నమోదు చేయండి

సమర్పించుపై క్లిక్ చేయండి

మీ మనబడి ఇంటర్ ఫలితాలు 2020 తెరపై ప్రదర్శించబడుతుంది

ఫలితాన్ని డౌన్‌లోడ్ చేయండి. అలాగే భవిష్యత్ ప్రయోజనం కోసం ప్రింట్ తీసుకోండి