Margadarsi Chit Fund Scam: మార్గదర్శి చిట్స్‌ ఫండ్స్‌పై ఛీటింగ్ కేసు నమోదు, సక్రమంగా వాయిదాలు చెల్లించినా నగదు ఇవ్వడం లేదని న్యాయవాది శ్రీనివాస్‌ ఫిర్యాదు

మార్గదర్శి చిట్స్‌ ఫండ్‌లో మోసాలపై ఎన్టీఆర్‌ జిల్లా విజయవాడ కృష్ణలంక పోలీస్‌ స్టేషన్‌లో గురువారం చీటింగ్‌ సహా ఇతర సెక్షన్లతో కేసు నమోదయింది.

Margadarsi Chit Fund Scam (Photo-File Image)

VJY, July 21: మార్గదర్శి చిట్స్‌ ఫండ్‌లో మోసాలపై ఎన్టీఆర్‌ జిల్లా విజయవాడ కృష్ణలంక పోలీస్‌ స్టేషన్‌లో గురువారం చీటింగ్‌ సహా ఇతర సెక్షన్లతో కేసు నమోదయింది. మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ ప్రైవేటు లిమిటెడ్‌ కంపెనీ యజమాని చెరుకూరి రామోజీరావు, ఎండీ శైలజ కిరణ్‌తో పాటు విజయవాడ లబ్బీపేట బ్రాంచ్‌ మేనేజర్‌ బి.శ్రీనివాస్, పలువురు సిబ్బందిపై కేసు నమోదు చేశారు. సక్రమంగా వాయిదాలు చెల్లించినా, చిట్‌లో పాడుకొన్ని నగదు ఇవ్వకుండా మార్గదర్శి యాజమాన్యం నాలుగు నెలలుగా ఇబ్బందులు పెడుతోందని బాధితుడు, న్యాయవాది శ్రీనివాస్‌ ఫిర్యాదు చేశారు.

ఈ ఫిర్యాదు మేరకు 409 (క్రిమినల్‌ బ్రీచ్‌ ఆఫ్‌ ట్రస్ట్‌), 420 (చీటింగ్‌), 120బి, సెక్షన్‌ 5 ఆఫ్‌ ది ఆంధ్రప్రదేశ్‌ ప్రొటెక్షన్‌ ఆఫ్‌ డిపాజిటర్స్‌ ఆఫ్‌ ఫైనాన్సియల్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ యాక్ట్‌–1999 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ కేసు వివరాలను ఎన్టీఆర్‌ జిల్లా పోలీస్‌ కమిషనర్‌ టి.కె.రాణా విలేకరుల సమావేశంలో వెల్లడించారు.

వివేకా హత్య కేసులో ఫైనల్ చార్జీషీట్‌ను సమర్పించిన సీబీఐ, ఆగస్టు 14న విచారణకు రావాలని అవినాష్ రెడ్డికి సీబీఐ సమన్లు

ఆ వివరాల ప్రకారం.. 64 ఏళ్ల వయసున్న బాధితుడు ముష్టి శ్రీనివాస్‌ టాక్స్‌ కన్సల్టెంట్‌గా, కొన్ని కంపెనీలకు లీగల్‌ అడ్వైజర్‌గా పని చేస్తున్నారు. 2021 సెప్టెంబర్‌లో మార్గదర్శి లబ్బీపేట బ్రాంచ్‌లో చిట్‌ వేశారు. 50 నెలల పాటు నెలకు రూ. లక్ష చిట్‌లో పాల్గొన్నారు. 19 నెలలు (రూ.19 లక్షలు) చిట్‌ నగదు సక్రమంగానే చెల్లించారు. ఈ ఏడాది మార్చిలో కుటుంబ అవసరాల నిమిత్తం రూ. 37.50 లక్షలకు చిట్‌ పాడారు. అయితే, ఆయన చెల్లించాల్సిన నగదును మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ సంస్థ ఇప్పటివరకు చెల్లించకపోవడంతో బాధితుడు తమను ఆశ్రయించినట్లు రాణా తెలిపారు.

ఆయన ఫిర్యాదు మేరకు రామోజీరావు, ఎండీ శైలజ కిరణ్, లబ్బీపేట బ్రాంచ్‌ మేనేజర్, పలువురు ఉద్యోగులపై కేసులు నమోదు చేసి, సమగ్ర దర్యాప్తు చేస్తున్నామన్నారు. బ్రాంచ్‌ మేనేజర్‌ బి.శ్రీనివాస్‌ను కస్టడిలోకి తీసుకుని విచారిస్తున్నట్ల తెలిపారు. మరికొందరు ఉద్యోగులు, సిబ్బందిని అదుపులోకి తీసుకోవాల్సి ఉందన్నారు.



సంబంధిత వార్తలు

Woman Chops Off Boyfriends Private Parts: పెళ్లికి ఒప్పుకోలేద‌ని బాయ్ ఫ్రెండ్ ప్రైవేట్ పార్ట్స్ కోసేసిన యువ‌తి, ఆపై చేతిని కోసుకొని ఆత్మ‌హ‌త్య‌, ఆ త‌ర్వాత ఏమైందంటే?

MP Kiran Kumar Reddy: అల్లు అర్జున్‌పై ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి ఫైర్, బన్నీ రియల్ హీరో కాదు, స్క్రిప్ట్ తీసుకొచ్చి చదివారని ఆగ్రహం వ్యక్తం చేసిన భువనగిరి ఎంపీ

Andhra Pradesh Shocker: కొడుకును సుపారీ ఇచ్చి హత్య చేయించిన తండ్రి, కొడుకు వేధింపులు భరించలేక అడవిలోకి తీసుకెళ్లి మద్యం తాగించి హత్య...వీడియో

AP Weather Update: ఏపీవాసులు ఊపిరిపీల్చుకునే కబురు.. బలహీనపడిన వాయుగుండం.. తప్పిన ముప్పు.. అయితే, రెండు రోజుల్లో బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు భారీ వర్ష సూచన

00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif