Minister Kodali Nani: ఆ 420 బ్యాచ్ సీఎంపై బురద చల్లాలని చూస్తోంది, ప్రతిపక్ష పార్టీలపై విరుచుకుపడిన మంత్రి కొడాలి నాని
రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ సీట్లలో సొంత అభ్యర్థులతో పోటీ చేసే సత్తా ఒక్క వైసీపీకి మినహా మరే ఇతర పార్టీకి లేదని ఆయన (Minister Kodali Nani) తేల్చేశారు. మొత్తం సీట్లు 175 అయితే అందులో 160 సీట్లకు కూడా సొంతంగా పోటీ చేసే సత్తా ఏ పార్టీకి (Opposition Parties) కూడా లేదని కూడా ఆయన వ్యాఖ్యానించారు.
Amaravati, Mar 15: ఏపీ మంత్రి కొడాలి నాని విపక్షాలపై మండి పడ్డారు. రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ సీట్లలో సొంత అభ్యర్థులతో పోటీ చేసే సత్తా ఒక్క వైసీపీకి మినహా మరే ఇతర పార్టీకి లేదని ఆయన (Minister Kodali Nani) తేల్చేశారు. మొత్తం సీట్లు 175 అయితే అందులో 160 సీట్లకు కూడా సొంతంగా పోటీ చేసే సత్తా ఏ పార్టీకి (Opposition Parties) కూడా లేదని కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఈ మేరకు మంగళవారం సాయంత్రం ఆయన చేసిన వ్యాఖ్యలు ఏపీలో (Andhrha Pradesh) వైరల్‌గా మారిపోయాయి.
పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో చోటుచేసుకున్న వరుస మరణాల గురించి మాట్లాడేందుకు మీడియా ముందుకు వచ్చిన నాని.. జంగారెడ్డిగూడెం మరణాలపై విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. బాధిత గ్రామ ప్రజలను విపక్షాలు తప్పుదోవ పట్టిస్తున్నాయన్న ఆయన.. సాధారణ మరణాలను మద్యం మరణాలుగా చిత్రీకరిస్తున్నాయని ఆరోపించారు. సీఎం జగన్‌పై బురదచల్లాలని 420 బ్యాచ్ యత్నిస్తోందని ఆరోపించిన ఆయన.. ప్రభుత్వాన్ని అల్లరి చేయాలని చూస్తే.. చంద్రబాబు తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారని హెచ్చరించారు.