Peddireddy on Early Elections: ఏపీలో లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి, క్లారిటీ ఇచ్చిన మంత్రి పెద్దిరెడ్డి, వైసీపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని వెల్లడి

ముందస్తుకు వెళ్లే ఆలోచన వైసీపీకి లేదని ఆయన స్పష్టం చేశారు. ఈరోజు అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ.. లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి వస్తాయని చెప్పారు.

Minister Peddireddy Ramachandra Reddy (Photo-Video Grab)

VJY, JUune 5: ఆంధ్రప్రదేశ్‌లో ముందస్తు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయంటూ వస్తున్న ఊహాగానాలపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పందించారు. ముందస్తుకు వెళ్లే ఆలోచన వైసీపీకి లేదని ఆయన స్పష్టం చేశారు. ఈరోజు అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ.. లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి వస్తాయని చెప్పారు.

వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని పెద్దిరెడ్డి తెలిపారు. చంద్రబాబు రాజకీయ వైకల్యంతో బాధపడుతున్నారని, అందుకే ఇతరుల సాయం కోసం ఎదురుచూస్తున్నారని విమర్శించారు. ‘‘వైసీపీ బలంగా ఉంది. మాకు వేరే పార్టీలతో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. టీడీపీ అధినేత చంద్రబాబు.. వేరే పార్టీలపై ఆధారపడుతున్నారు. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ గురించి నేనేమీ మాట్లాడను’’ అని అన్నారు.

ఒడిశా రైలు ప్రమాదం, ఇంకా తెలియని 28 మంది ఏపీ వాసుల ఆచూకి, మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన సీఎం జగన్

మహానాడులో చంద్రబాబు ప్రవేశపెట్టిన మేనిఫెస్టోను ఏపీ ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. కర్ణాటక మేనిఫెస్టోను, జగన్ మేనిఫెస్టోను కాపీ కొట్టారు. ఆయనకు ఎన్నికల సమయంలోనే ప్రజలు గుర్తుకొస్తారు’’ అని పెద్దిరెడ్డి విమర్శించారు. చంద్రబాబుకు ఎన్నికల్లో సింగిల్‌గా పోటీ చేసే ధైర్యం లేకనే బీజేపీతో పొత్తుకోసం ఢిల్లీకి వెళ్లారన్నారు.

51 గంటల తర్వాత సాధారణ స్థితికి, ప్రమాద ప్రదేశం నుంచి పట్టాలు ఎక్కిన తొలి రైలు, జర్నీ సేఫ్‌గా సాగాలని ప్రార్ధించిన రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్

సీఎం జగన్ పార్టీ మేనిఫెస్టోను ఒక ఖురాన్‌గా, బైబిల్‌గా. భగవద్గీతగా భావించి చెప్పిన మాట ప్రకారం తూచా తప్పకుండా నవరత్నాల్లో 99 శాతం అమలు చేశారన్నారు. లంచాలకు తావులేకుండా నేరుగా ప్రజల వద్దకే సంక్షేమ పాలనను తీసుకెళ్లడం జగనన్న ముఖ్య ఉద్దేశమని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో జగన్ మోహన్ రెడ్డిని తిరిగి ముఖ్యమంత్రిని చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.