Amabati vs Raghu Rama: రఘురామకు సీఎం జగన్ టీం భారీ ట్విస్ట్, రియల్ ఫేస్ రఘురాజు అంటూ ట్విట్టర్లో వీడియోని ట్వీట్ చేసిన ఎమ్మెల్యే అంబటి రాంబాబు, రఘు రామ కృష్ణంరాజుపై అనర్హత వేటు వేయాలని లోక్‌సభ స్పీకర్‌కు మరో సారి ఫిర్యాదు చేసిన ఎంపీ మార్గాని భరత్
తాజాగా వైసీపీ ఎమ్మెల్యే, పార్టీ సీనియర్ నేత అంబటి రాంబాబు (YSRCP MLA Ambati Rambabu) భారీ షాక్ ఇచ్చారు. ట్విట్టర్లో ఆయన ఓ వీడియో రెబల్ ఎంపీ మీద పోస్ట్ చేసిన దానిి కేంద్ర మంత్రులకు ట్యాగ్ చేశాడు.
Amaravati, June 13: గత కొంత కాలంగా ప్రభుత్వం మీద విరుచుకుపడుతూ వస్తున్న రెబల్ ఎంపీ కనుమూరు రఘురామకృష్ణంరాజుకు పార్టీ ఎమ్మెల్యేలు కౌంటర్లు ఇస్తున్నారు. తాజాగా వైసీపీ ఎమ్మెల్యే, పార్టీ సీనియర్ నేత అంబటి రాంబాబు (YSRCP MLA Ambati Rambabu) భారీ షాక్ ఇచ్చారు. ట్విట్టర్లో ఆయన ఓ వీడియో రెబల్ ఎంపీ మీద పోస్ట్ చేసిన దానిి కేంద్ర మంత్రులకు ట్యాగ్ చేశాడు.
ఆయన ట్వీట్ చేసిన వీడియోలో రియల్ ఫేస్ రఘురాజు (YSRCP Rebel MP Raghu rama krishna Raju) అంటూ.. రఘురామ రాజు బ్యాంకుల్లో రుణాలు తీసుకొని తిరిగి చెల్లించకపోవటంతో నమోదైన కేసుల వివరాలతో వచ్చిన పత్రికల క్లిప్పింగ్ లు చూపించారు. దీంతో పాటుగా లోక్ సభ సభ్యుల్లో బిగ్గెస్ట్ స్కాం స్టర్ (#ScamsterMPRaghuRaju) అంటూ ఆ వీడియో ప్రజెంట్ చేసారు. అందులోనే...రఘురామ రాజు వైసీపీ ముఖ్య నేతల పైన విమర్శల సమయంలో ప్రదర్శించిన అభ్యంతరకర హాహభావాలను సైతం వీడియోలో యాడ్ చేసారు.
ఈ వీడియోని కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ.. నిర్మలా సీతారామన్..రవి శంకర్ ప్రసాద్..డాక్టర్ జయశంకర్ లతో పాటుగా పలువురు కేంద్ర మంత్రులు, అదే విధంగా ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కు ట్యాగ్ చేసారు. ఆ ట్వీట్ లో... ఆత్మాభిమానం ఉన్న వారు ఎవరైనా రాజీనామా చేసి ప్రజల్లోకి వెళ్తారు కానీ, అదే సీటు ను పట్టుకొని వేలాడరు..సిగ్గు లేని ఎంపీ స్కామ్ స్టర్ అంటూ కామెంట్ ద్వారా పేర్కొన్నారు.
ఇప్పటి వరకు రఘురామ రాజు వ్యాఖ్యలకు..రాస్తున్న లేఖల విషయంలో మౌనంగా ఉంటూ వచ్చిన వైసీపీ నేతలు..నేరుగా కేంద్ర మంత్రులకు రఘురామ రాజు స్కామ్ స్టర్ అంటూ ట్వీట్ చేయటం ఇప్పుడు ఈ మొత్తం ఎపిసోడ్ లో కొత్త టర్న్ తీసుకుంది. రఘురామ రాజు బాటలోనే ముందుకెళ్లాలని వైసీపీ భావిస్తున్నట్లు కనిపిస్తోంది.
Here's YSRCP MLA Tweet Video
ఇప్పటి వరకు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ రాజు ఏపీ ప్రభుత్వం పైన వరుసగా లేఖలు రాసారు. సుప్రీం బెయల్ మంజూరు తరువాత ఢిల్లీ చేరిన రఘు రామ రాజు కేంద్ర మంత్రులు...గవర్నర్లు..సీఎంలు..ఎంపీలకు లేఖలు రాసారు. తన పైన రాజద్రోహం కేసు నమోదు చేసి..విచారణ సమయంలో తన పైన థర్డ్ డిగ్రీ ప్రయోగించారంటూ లేఖల్లో పేర్కొన్నారు. ఆ తరువాత ముఖ్యమంత్రికి ఆయన ఇచ్చిన హామీల అమలు గుర్తు చేస్తూ లేఖలు రాస్తున్నారు. ఈ నేపథ్యంలో రఘురామ రాజు వ్యాఖ్యలకు..రాస్తున్న లేఖల విషయంలో మౌనంగా ఉంటూ వచ్చిన వైసీపీ నేతలు..నేరుగా కేంద్ర మంత్రులకు రఘురామ రాజు స్కామ్ స్టర్ అంటూ ట్వీట్ చేయటం ఇప్పుడు వైసీపీ రెబల్ ఎంపీని ఆత్మరక్షణలో పడేసినట్లయింది.
రఘురామ పై అనర్హత వేటు వేయాలని ఫిర్యాదు
ఇదిలా ఉంటే వైసీపీ ఎంపీ మార్గాని భరత్ మరో సారి లోక్ సభ స్పీకర్ ను కలిసి రఘురామ పై అనర్హత వేటు వేయాలని కోరారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న రఘురామ కృష్ణరాజు పార్లమెంటు సభ్యత్వాన్ని వెంటనే రద్దు చేయాలని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు వైసీపీ చీఫ్ విప్ మరోసారి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు శుక్రవారం ఢిల్లీలో లోక్‌సభలో వైసీపీ చీఫ్ విప్ మార్గాని భరత్ స్పీకర్ ఓం బిర్లాకు కంప్లైట్ ఇచ్చారు.
రఘురామకృష్ణరాజు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ చేసిన వ్యాఖ్యలపై గతంలోనే ఆధారాలను తాము స్పీకర్ ఓం బిర్లాకు సమర్పించామని ఎంపీ భరత్ తెలిపారు. అనేక పర్యాయాలు సభ్యత్వం రద్దుకు సంబంధించి స్పీకర్‌ను కలిసి విజ్ఞప్తి చేశామన్నారు. ఇందులో భాగంగానే తాజాగా, రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ప్రకారం పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని అతిక్రమించిన రఘురామ కృష్ణరాజును వెంటనే డిస్ క్వాలిఫై చేయాల్సిందిగా శుక్రవారం మరోసారి లోక్ సభ స్పీకర్ ను కలిసి విజ్ఞప్తి చేశామని భరత్ తెలిపారు.
దీనిపై రఘురామ స్పందిస్తూ... తాను ఏ పార్టీతోనూ జట్టుకట్టలేదని.. అధికార పార్టీ కార్యకలాపాలకు విరుద్ధంగా వ్యవహరించలేదని పేర్కొన్నారు. ప్రభుత్వ సంక్షేమ ఫలితాల అమలులో లోపాలను మాత్రమే తాను ఎత్తి చూపిస్తున్నానని, తనపై అనర్హత వేటు వేయడం సాధ్యం కాదన్నారు. తాను కొంతమంది తప్పుడు వ్యక్తుల నుంచి పార్టీని కాపాడుకునేందుకు ప్రయత్నం చేశానని, వాస్తవాలు ఎప్పటికైనా బయటకు వస్తాయన్నారు. తనపై దాడి చేసిన విషయంలో మరోసారి ప్రివిలైజ్ మోషన్ ఇస్తానని తెలిపారు. తనపై అనర్హత వేటు వేయాలని ఇప్పటికే నాలుగైదు సార్లు ఫిర్యాదు చేశారని రఘురామ తెలిపారు.
కాగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, వైసీపీకి వ్యతిరేకంగా తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్న రఘురామను ఇప్పటికే సీఐడీ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇటీవలే, సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు పలు షరతులతో రఘురామ బెయిల్‌పై విడుదలయ్యారు. బెయిల్‌పై బయటకు వచ్చిన దగ్గరి నుంచి జగన్ సర్కారుకు వ్యతిరేకంగా ఎంపీ రఘురామ పెద్ద ఎత్తున పోరాటం ప్రారంభించారు. అన్ని రాష్ట్రాలకు చెందిన గవర్నర్లు, ముఖ్యమంత్రులు, ఎంపీలకు రఘురామ లేఖలు రాశారు.