Chirala Violence: చీరాలలో ఎస్సైపై మత్య్స్యకారుల దాడి, ఉద్రిక్తంగా మారిన ఎంపీ మోపిదేవి పర్యటన, 12 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, గొడవకు ప్రధాన కారణం అదేనా..
మత్స్యకారులను పరామర్శించిన మోపిదేవి వెంకటరమణ ముందే ఆమంచి డౌన్ డౌన్.. ఆమంచి గో బ్యాక్ అంటూ వాడరేవు మత్స్యకారులు నినాదాలు చేశారు.
Chirala, Dec 14: ప్రకాశం జిల్లా చీరాల వాడరేవు, కఠారి వారి పాలెం మత్స్యకార్మికుల మధ్య చోటుచేసుకున్న వివాదం చిలికి చిలికి గాలివానలా (High Tension At Chirala) మారుతోంది. ఈరోజు మాజీ మంత్రి, ఎంపీ మోపిదేవి వెంకటరమణ చీరాలలో ఐకాన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కఠారి వారి పాలెం, వాడరేవు మత్స్యకారులను (MP Mopidevi Chirala Tour) పరామర్శించారు. ఎంపీ పర్యటనలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. తమపై దాడికి పాల్పడిన కఠారి వారి పాలెం మత్స్య కారులను (fishermens) వెంటనే శిక్షించాలని వాడరేవు మత్స్యకారులు ఎంపీ మోపీదేవి వెంకట రమణను డిమాండ్ చేశారు.
వాడరేవు, కఠారి వారి పాలెం క్షతగాత్రులను మోపిదేవి వెంకటరమణతో పాటుగా ఎమ్మెల్యే కరణం బలరాం , కరణం వెంకటేష్, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ మోహన్ తదితరులు పరామర్శించారు. ఇదిలా ఉండగా ఈపురుపాలెం ఎస్సై సుధాకర్ కారుపై రాళ్లతో మత్స్యకారులు దాడికి (Eepurupalem SI Sudhakar's car was attacked) పాల్పడ్డారు .ఆయన కారు అద్దాలను ధ్వంసం చేశారు. మత్స్యకారులను పరామర్శించిన మోపిదేవి వెంకటరమణ ముందే ఆమంచి డౌన్ డౌన్.. ఆమంచి గో బ్యాక్ అంటూ వాడరేవు మత్స్యకారులు నినాదాలు చేశారు.
ఐకాన్ ఆసుపత్రి వద్ద మోపిదేవి బాధితుల పరామర్శ సమయంలోనూ ఓ మహిళ మోపిదేవి వెంకటరమణ ముందే ఆమంచిని నిలదీసింది. చీరాలలో ఉన్న పరిస్థితుల నేపథ్యంలో పోలీసులు ఆమంచి, కరణం వర్గీయులను ఆస్పత్రిలోకి అనుమతించలేదు.
Here's Chirala Violence Video
చేపల వేటకు ఉపయోగించే వల విషయంలోనే వాడరేవు , కఠారి వారి పాలెం గ్రామాల మత్స్యకారుల మధ్య వివాదం నెలకొంది.వాడరేవు మత్స్యకారులు బల్లవల ఉపయోగిస్తుండగా కఠారి పాలెం జాలర్లు ఐలవల వాడాలని, బల్లవల కారణంగా చేపలతోపాటు గుడ్లు కూడా బయటకొచ్చి మత్స్యసంపద నశించిపోతుందని అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దీంతో అది చిలికి చిలికి గాలివానలా మారింది.
ఇదిలా ఉంటే ప్రసాద్ నగర్ వద్ద ఆమంచి వర్గీయునిపై కరణం వర్గీయులు దాడి చేశారు . ఈ దాడిలో ఆమంచి అనుచరుడికి తీవ్ర గాయాలు అయినట్లు సమాచారం. మొత్తానికి చీరాలలో ఆమంచి కృష్ణమోహన్ వర్సెస్ కరణం బలరాం వివాదం పెద్దఎత్తున కొనసాగుతున్నట్లుగా అర్థమవుతుంది. వాడరేవు, కఠారి వారి పాలెం మత్స్యకారుల ఘర్షణకు కూడా ఓ రకంగా ప్రజాప్రతినిధులే కారణమన్న భావన స్థానికంగా వ్యక్తమవుతోంది. ప్రజా ప్రతినిధులు రంగంలోకి దిగినా అక్కడ పరిస్థితుల చల్లబడలేదు.
కఠారి వారి పాలెం మత్స్యకారులు మాటలు పెడచెవిన పెట్టిన వాడరేవు మత్స్యకారులు అదే వలతో చేపల వేట కొనసాగిస్తున్నారు. దీంతో మత్స్యకారులు కర్రలకు పని చెప్పి విచక్షణా రహితంగా కొట్టుకున్నారు. ఈ గొడవలోనే ప్రసాద్ నగర్ వద్ద ఆమంచి వర్గీయునిపై కరణం వర్గీయుల దాడి జరగగా ఓ వ్యక్తికి తీవ్ర గాయాలు పాలయ్యాడు.
రంగంలోకి దిగిన పోలీసులు కఠారివారిపాలెంకు చెందిన 12 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఇరుగ్రామాల మత్స్యకారులతో అధికారులు చర్చలు జరిపారు. ఇదిలా ఉంటే మత్స్యకార గ్రామాల్లో బల్లవలల వినియోగంపై నాలుగేళ్ల క్రితం నిషేధం పెట్టుకున్నారు.
అయితే గత మూడేళ్ల క్రితం చీరాల మండలం వాడరేవు మత్స్యకారులు చేపలు చిక్కడం లేదంటూ తిరిగి బల్లవలు వాడకం మొదలు పెట్టారు. వాడరేవు మత్స్యకారులు బల్లవలలు వినియోగాన్ని పక్కనే ఉన్న కఠారివారిపాలెం మత్స్యకారులు వ్యతిరేకించారు. దీంతో ఇరు గ్రామాల మధ్య మూడేళ్లుగా ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి.