AP CM YS Jagan Mohan Reddy Visits Polavaram Project (Photo-Video Grab)

Polavaram, Dec14: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పోలవరం ప్రాజెక్టు వద్దకు (CM Jagan Polavaram Tour) చేరుకున్నారు. పోలవరం పర్యటనలో భాగంగా తొలుత ఏరియల్‌ వ్యూ ద్వారా ప్రాజెక్ట్‌ నిర్మాణ పనులను సీఎం జగన్‌ పరిశీలించారు. అనంతరం ఆయన పోలవరం ప్రాజెక్టు (Polavaram Project) నిర్మాణ పనులను పరిశీలిస్తున్నారు. సీఎం జగన్‌ మోహన్ రెడ్డి వెంట ఇరిగేషన్ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ ఉన్నారు. పోలవరం చేరుకున్న సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి (AP CM YS Jagan Mohan Reddy ) హెలిప్యాడ్ వద్ద మంత్రులు ఘన స్వాగతం పలికారు.

పోలవరం ప్రాజెక్ట్‌ పనుల పరిశీలనలో సీఎం వైఎస్‌ జగన్‌తో పాటు మంత్రులు ఆళ్లనాని, తానేటి వనితా, చెల్లుబోయిన వేణుగోపాల‌కృష్ష, చెరుకువాడ శ్రీరంగనాధరాజు, ఎంపీ మార్గని భరత్, రాజ్యసభ సభ్యులు పిల్లిసుభాష్ చంద్రబోష్, కలెక్టర్లు రేవు ముత్యాల రాజు, మురళీధర్ రెడ్డి, ఎమ్మెల్యేలు తెల్లం బాలరాజు, రాపాకవరప్రసాద్, పుప్పాలవాసుబాబు, తల్లారి వెంకట్రావు, ముదునూరి ప్రసాదరాజు, ఏలూరు రేంజ్ డిఐజీ మోహనరావు, జిల్లా ఎస్పి నారాయణ నాయక్‌లు పాల్గొననున్నారు.

Here's AP CM Polvaram Tour 

పోలవరం ప్రాజెక్టును శరవేగంగా పూర్తి చేయాలని వడివడిగా అడుగులు వేస్తున్న సీఎం జగన్..‌ పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించి గడువులోగా పూర్తి చేసేలా అధికారులకు దిశా నిర్దేశం చేయనున్నారు. ఉదయం 11.50 నుంచి 1.15 వరకు పనుల పురోగతిపై సమీక్షిస్తారు. అనంతరం మధ్యాహ్నం 2.25 గంటలకు తిరిగి తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి చేరుకుంటారు.

ఏలూరు వ్యాధి వైరస్,బ్యాక్టీరియా వల్ల కాదు, మూడు రోజుల్లో అంతుచిక్కని వ్యాధిపై తుది నివేదిక, తాగు నీటిలో పురుగుమందుల అవశేషాలు ఉన్నట్లుగా వార్తలు, బాధితులంతా డిశ్చార్జ్ అయ్యారని తెలిపిన మంత్రి ఆళ్ల నాని

పోలవరం ప్రాజెక్టు ప్రత్యేక ఖాతాకు జాతీయ జల వనరుల అభివృద్ధి సంస్థ (ఎన్‌డబ్లూడీఏ) నుంచి రూ.2,234.28 కోట్లు జమయ్యాయి. గత శుక్రవారం ఈ మొత్తాన్ని జాతీయ జల వనరుల అభివృద్ధి సంస్థ(ఎన్‌డబ్ల్యూడీఏ)కు నాబార్డు విడుదల చేసిన విషయం తెలిసిందే. దీంతో ప్రాజెక్టు పనులకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఖర్చులను రీయింబర్స్‌ చేస్తూ ఈ నిధులను ఎన్‌డబ్ల్యూడీఏ విడుదల చేసింది. పోలవరం ప్రాజెక్టు పనులకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకూ రూ.17,665.29 కోట్లు ఖర్చు చేసింది.

టీచర్ల బదిలీల సంగతి ప్రభుత్వం చూసుకుంటుంది..మీకెందుకు? బీసీ సంక్షేమ సంఘం దాఖలు చేసిన పిల్‌పై మండిపడిన ఏపీ హైకోర్టు, పిల్‌ను ఉపసంహరించుకున్న న్యాయవాది

ఇందులో ఏప్రిల్‌ 1, 2014 తర్వాత రూ.12,529.42 కోట్లను ఖర్చు చేసింది. అందులో ఇప్పటివరకూ రూ.8,507.26 కోట్లను రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం రీయింబర్స్‌ చేసింది. తాజాగా ఎన్‌డబ్ల్యూడీఏ పోలవరం ప్రాజెక్టు ప్రత్యేక ఖాతాకు జమ చేసిన రూ.2,234.28 కోట్లను కలుపుకుంటే.. రూ.10,741.54 కోట్లను రీయింబర్స్‌ చేసింది. అంటే ఇంకా రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం రూ.1787.88 కోట్లు బకాయి పడింది.