Vanapalli, August 23: అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా కొత్త పేట మండలం వానపల్లిలో శుక్రవారం సీఎం చంద్రబాబు పర్యటించారు. ఈ సందర్భంగా స్వర్ణ వానపల్లి గ్రామసభకు హాజరై ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం సీఎం మాట్లాడుతూ.. పేద ప్రజలకు న్యాయం జరిగే పాలనకు శ్రీకారం చుట్టామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు.

‘‘రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు 13,326 పంచాయతీల్లో గ్రామసభలు పెట్టి.. ఈ ఏడాది MGNREGA కింద రూ.4,500 కోట్ల పనులకు అనుమతి తీసుకున్నాం. MGNREGA కింద వంద రోజులు పని కల్పించడం ప్రభుత్వ బాధ్యత. ఈ పథకం కింద ఈ ఏడాది 84 లక్షల కుటుంబాలకు పని దొరుకుతుందని తెలిపారు. గ్రామాలు అభివృద్ధి చెందితేనే దేశాభివృద్ధి సాధ్యం. 2014-19 మధ్య గ్రామాభివృద్ధికి స్వర్ణయుగం. గత ప్రభుత్వంలో డ్వాక్రా సంఘాల మహిళలు ఇబ్బంది పడ్డారు. వైసీపీ సభలకు వెళ్లినవారు బయటకు వెళ్లకుండా ఇబ్బంది పెట్టారు. గ్రామాభివృద్ధిలో సర్పంచి పాత్ర కీలకం. గత ప్రభుత్వంలో గ్రామాల్లో అభివృద్ధి జరగలేదు.  రెడ్‌ బుక్‌ మీద పెట్టిన శ్రద్ధ వీటిపై పెట్టి ఉంటే ప్రమాదం జరిగేది కాదు, అచ్యుతాపురం ఘటనలో ప్రభుత్వ నిర్లక్ష్యంగా వ్యవహరించిందని జగన్ మండిపాటు

వైసీపీ ప్రభుత్వం వచ్చాక నరేగా నిధులు నేతల జేబుల్లోకి వెళ్లాయి. 2014-19 మధ్య 27,444 కిలోమీటర్ల మేర సిమెంటు రోడ్లు వేశాం. వచ్చే ఐదేళ్లలో ప్రతి గ్రామంలో సిమెంటు రోడ్లు వేస్తాం. పశువుల షెడ్లు నిర్మించుకునేందుకు ఆర్థిక సాయం చేస్తాం. గ్రామాల్లోని పేదలకు ఇళ్లు కట్టించే బాధ్యత తీసుకుంటాం. ఇళ్లకు విద్యుత్‌, సురక్షిత తాగునీరు ఇచ్చే బాధ్యత మాది.

వైసీపీ పాలనకు, మా పాలనకు బేరీజు వేయండి. మా హయాంలో వేసిన వీధిదీపాలను కూడా వైసీపీ నేతలు దొంగిలించుకుపోయారు. వైసీపీ భూతాన్ని పూర్తిగా భూ స్థాపితం చేస్తేనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం. కేంద్రం సాయంతో గ్రామాలను అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తాం. నిరుద్యోగ యువతకు ఉపాధి ఎలా కల్పించాలనే ఎప్పుడూ ఆలోచిస్తుంటా. 16వేలకు పైగా ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తున్నాం’’ అని సీఎం వివరించారు.