Coronavirus in US (Photo Credits: PTI)

Amaravati. Dec 14: ఆంధ్రప్రదేశ్‌లో కోవిడ్ కేసులు భారీగా తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంటల్లో 44,935 కరోనా పరీక్షలు నిర్వహించగా, 305 మందికి పాజిటివ్‌గా (Covid in AP) నిర్థారణ అయ్యింది. ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా సోకిన వారి సంఖ్య 87,5836కి (Covid-19 cases) చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. గడచిన 24 గంటల్లో 541 మంది కోవిడ్‌ నుంచి కోలుకుని డిశ్చార్జ్‌ అవ్వగా, ఇప్పటివరకు 8,64,049 మంది డిశ్చార్జ్‌ అయ్యారు.

గడచిన 24 గంటల్లో కరోనా బారినపడి నెల్లూరులో ఇద్దరు మరణించగా, ఇప్పటివరకు కరోనా సోకి 7059 (Covid Daths) మంది మృతిచెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 4728 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో రికార్డు స్థాయిలో కరోనా పరీక్షలు జరుగుతున్నాయి. నేటివరకు 1,08,75,925 శాంపిల్స్‌ను పరీక్షించారు.

కాగా కేంద్రం నుంచి రాష్ట్రానికి కోవిడ్‌ వ్యాక్సిన్‌ రాగానే నెలలో కోటిమందికి వేసేలా ఏపీ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకోసం 4,762 కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్న 4,762 కేంద్రాల్లో 30 రోజుల్లో మొత్తం 1,42,857 సెషన్స్‌ నిర్వహిస్తారు. ఒక్కో సెషన్‌లో 70 మందికి టీకా వంతున నెలలో మొత్తం కోటిమందికి వేయాలని ఆరోగ్యశాఖ నిపుణులు నిర్ణయించారు. వ్యాక్సిన్‌ వేసేందుకు 9,724 మంది వ్యాక్సినేటర్లు అంటే ఏఎన్‌ఎంలు నిరంతరాయంగా పనిచేస్తారు.

కరోనాతో కంటి చూపుకు ముప్పు, ఊపిరితిత్తుల్లోని కణాలపై కోవిడ్ దాడి, వ్యాక్సిన్ వేసుకున్నా కరోనా జాగ్రత్తలు తప్పనిసరి, దేశంలో తాజాగా 27 వేల కేసులు నమోదు, కరోనా భయంతో కేరళలో ఆలయం మూసివేత

ముందుగా ప్రభుత్వ, ప్రైవేటు హెల్త్‌కేర్‌ రంగంలో ఉన్నవారికి, అంగన్‌వాడీ వర్కర్లకు అంటే 3,66,442 మందికి టీకా వేస్తారు. తర్వాత ప్రాధాన్యతా క్రమంలో పోలీసులు, శానిటేషన్‌ వర్కర్లు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారికి వ్యాక్సిన్‌ ఇస్తారు. టీకా వేయించుకున్న తర్వాత 6 నుంచి 8 వారాల వరకు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.

ఆ తర్వాతే యాంటీబాడీస్‌ వృద్ధిచెందే అవకాశం ఉందని, అందువల్ల కోవిడ్‌ టీకా వేయించుకున్నాక గడువు వరకు జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు. వ్యాక్సినేషన్‌ కేంద్రాల్లో అవసరమైతే ఏఎన్‌ఎంతో పాటు ఎంబీబీఎస్, బీడీఎస్‌ వైద్యులనుగానీ, రిటైర్డ్‌ డాక్టర్లనుగానీ, ఫార్మసిస్ట్‌లు, నర్సింగ్, ఏఎన్‌ఎం, జీఎన్‌ఎం విద్యార్థులనుగానీ నియమిస్తారు. తొలిదశలో టీకా వేసిన వారికి రెండోదశలో ఆరునెలల తర్వాత రెండోడోసు వేస్తారు.