Attempted Murder in Vizag: విశాఖలో దారుణం, యువతిపై కత్తితో దాడి చేసిన ప్రేమోన్మాది, ఆ తరువాత నిందితుడు ఆత్మహత్యాయత్నం

ఓ ప్రేమోన్మాది యువతిపై కత్తితో దాడి చేశాడు. ప్రియాంక అనే యువతిపై శ్రీకాంత్ అనే యువకుడు కత్తితో దాడి చేశాడు. గ్రామ సచివాలయంలో పనిచేస్తున్న ప్రియాంక మరో యువకుడితో చనువుగా ఉంటుందన్న అనుమానంతో శ్రీకాంత్ దాడి చేసినట్టుగా తెలుస్తోంది. అనంతరం ఆత్మహత్యకు ప్రయత్నించాడు.ఈ సంఘటన వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో బుధవారం జరిగింది.

Knife representational image- Photo- ANI)

Vizag, Dec 2: ఏపీ పరిపాలన రాజధాని కాబోతున్న విశాఖనగరంలోని గాజువాకలో దారుణం (Attempted Murder in Vizag) చోటు చేసుకుంది. ఓ ప్రేమోన్మాది యువతిపై కత్తితో దాడి చేశాడు. ప్రియాంక అనే యువతిపై శ్రీకాంత్ అనే యువకుడు కత్తితో దాడి చేశాడు. గ్రామ సచివాలయంలో పనిచేస్తున్న ప్రియాంక మరో యువకుడితో చనువుగా ఉంటుందన్న అనుమానంతో శ్రీకాంత్ దాడి చేసినట్టుగా తెలుస్తోంది. అనంతరం ఆత్మహత్యకు ప్రయత్నించాడు.ఈ సంఘటన వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో బుధవారం జరిగింది.

పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. విశాఖ ఫెర్రీ వీధికి చెందిన వాలంటీర్‌ ప్రియాంకపై శ్రీకాంత్‌ అనే యువకుడు కత్తితో దాడి చేశాడు. అనంతరం ఆత్మహత్యకు ప్రయత్నించాడు. తీవ్రగాయాలపాలైన యువతిని కేజీహెచ్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. దాడి అనంతరం ప్రియాంక ఇంటికి వెళ్లి ఆమె తల్లిదండ్రులతో విషయం చెప్పాడు. వారితో మాట్లాడుతూనే అదే కత్తితో తనను తాను గాయపరచుకున్నాడు.

వివాహేతర సంబంధం చిచ్చు, భర్తను చంపేందుకు మటన్‌లో సైనేడ్ కలిపిన భార్య, తినకుండా తప్పించుకున్న భర్త, పోలీసుల అదుపులో నిందితులు

ఈ హఠాత్పరిణామంతో స్థానికులు షాకయ్యారు. వెంటనే తేరుకున్నస్థానికులు.. వారిద్దరిని కేజీహెచ్‌కు తరలించారు. ప్రియాంక ప్రస్తుతం డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతోంది. ఆమెను శ్రీకాంత్ ప్రేమిస్తున్నట్టుగా సమాచారం. ఈ సంఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.



సంబంధిత వార్తలు

Komatireddy Rajagopal Reddy: తనపై ఆంధ్రా మీడియా దుష్ప్రచారం, ఎన్టీఆర్‌ ఘాట్ కూల్చాలని అనలేదన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఎన్టీఆర్ ఘాట్ జోలికి వస్తే ప్రజలే తిరగబడతారన్న బీఆర్ఎస్

Vijay on Amit Shah Comments: డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై మండిపడిన హీరో విజయ్, కొంతమందికి అంబేద్కర్ పేరు అంటే ఎలర్జీ అని వెల్లడి

CM Siddaramaiah: అమిత్ షా వ్యాఖ్యలు రాజ్యాంగ నిర్మాతను అవమానించడమే, వీడియోని షేర్ చేస్తూ మండిపడిన కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య

Parliament Winter Session 2024: బీఆర్ అంబేద్కర్‌పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై క్షమాపణలు చెబుతూ రాజీనామా చేయాల్సిందేనని ఇండియా కూటమి డిమాండ్, కాంగ్రెస్ చీప్ ట్రిక్స్ ప్లే చేస్తుందని మండిపడిన బీజేపీ, వేడెక్కిన పార్లమెంట్ శీతాకాల సమావేశాలు

00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif