Nara Lokesh Yuvagalam: నారా లోకేష్ యువగళం పునః ప్రారంభానికి ముహుర్తం ఖరారు, ఈ నెల 27 నుంచి జనంలోకి లోకేష్, విశాఖలో ముగియనున్న యువగళం పాదయాత్ర

నారా లోకేష్‌ ఈ ఏడాది జనవరి 27న కుప్పం నుంచి యువగళం పాదయాత్ర ప్రారంభించారు. చంద్రబాబును అరెస్టు చేయడంతో లోకేష్ పాదయాత్రకు (Nara Lokesh Yuvagalam Padayatra) తాత్కాలిక విరామం ప్రకటించారు.

Nara Lokesh (Photo-TDP/Twitter)

Vijayawada, NOV 23: చంద్రబాబు అరెస్టుతో (CBN Arrest) యువగళం పాదయత్రకు తాత్కాలిక విరామం ప్రకటించిన నారా లోకేష్ తిరిగి ప్రారంభించనున్నారు. ఆయన మళ్లీ జనంలోకి వెళ్లనున్నారు. నవంబర్ 27నుంచి నారా లోకేష్ యువగళం పాదయాత్రను (Nara Lokesh Yuvagalam Padayatra) పున:ప్రారంభం చేయనున్నారు. కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలోని పొదలాడలో లోకేష్ పాదయాత్ర తిరిగి ప్రారంభించనున్నారు. డిసెంబరు నెలాఖరు వరకు పాదయాత్ర సాగించే యోచనలో లోకేష్ ఉన్నారు. విశాఖపట్నంలో పాదయాత్ర ముగించనున్నారు. సెప్టెంబరు9న సీఐడీ పోలీసులు చంద్రబాబును అరెస్టు చేయడంతో లోకేష్ పాదయాత్రకు తాత్కాలిక విరామం ప్రకటించారు. నారా లోకేష్‌ ఈ ఏడాది జనవరి 27న కుప్పం నుంచి యువగళం పాదయాత్ర ప్రారంభించారు. చంద్రబాబును అరెస్టు చేయడంతో లోకేష్ పాదయాత్రకు (Nara Lokesh Yuvagalam Padayatra) తాత్కాలిక విరామం ప్రకటించారు.

PM Modi Telangana Tour Schedule: ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన షెడ్యూల్ ఇదిగో, ఈ నెల 27వ తేదీన హైదరాబాద్‌లో రోడ్ షో.. 

నవంబర్ 27న లోకేష్ పొదలాడలో యువగళం పాదయాత్రను పున:ప్రారంభించనున్నారు. రాజోలు, అమలాపురం, ముమ్మిడివరం, కాకినాడ పట్టణ, కాకినాడ గ్రామీణం, పిఠాపురం, తుని నియోజకవర్గాల మీదుగా ఉమ్మడి విశాఖ జిల్లాలోకి పాదయాత్ర చేరుకుంటుంది. అనకాపల్లి, విశాఖ జిల్లాల్లోని కొన్ని నియోజకవర్గాల మీదుగా విశాఖపట్నం చేరుకుని అక్కడ పాదయాత్రను ముగించనున్నారు. పాదయాత్రకు విరామం ప్రకటించే నాటికి లోకేష్ 208 రోజుల్లో 2,852.4 కిలోమీటర్లు నడిచారు. 9 ఉమ్మడి జిల్లాల్లోని 84 నియోజకవర్గాల మీదుగా పాదయాత్ర సాగింది. పాదయాత్ర సాగిన 84 నియోజకవర్గాల పరిధిలో 66 చోట్ల బహిరంగ సభలు నిర్వహించారు. యువత, మహిళలు, రైతులు, ముస్లింలు.. ఇలా వివిధ వర్గాలతో లోకేష్ 11 ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.



సంబంధిత వార్తలు

Bandi Sanjay Slams KTR:  తెలంగాణలో 'ఆర్‌ కే' బ్రదర్స్ పాలన, కేటీఆర్ అరెస్ట్ కథ కంచికే, బీజేపీ రాష్ట్ర అధ్యక్ష రేసులో లేనని తేల్చిచెప్పిన కేంద్రమంత్రి బండి సంజయ్..బీఆర్ఎస్‌ను నిషేధించాలని డిమాండ్

Actor Kasturi Arrested: న‌టి క‌స్తూరి అరెస్ట్, హైద‌రాబాద్ లో అదుపులోకి తీసుకొని చెన్నైకి త‌ర‌లిస్తున్న‌ త‌మిళ‌నాడు పోలీసులు

Fake Cop Video Calls Real Cyber Security Police: సైబ‌ర్ క్రిమిన‌ల్ కు లైవ్ లో షాక్ ఇచ్చిన పోలీసులు, యూనిఫాంతో ఏకంగా రియ‌ల్ పోలీస్ కే ఫోన్ చేసిన కేటుగాడు.. ఆ త‌ర్వాత ఏమైందంటే?

KTR: కేటీఆర్‌ని అరెస్ట్ చేస్తారని ప్రచారం?, భారీగా కేటీఆర్‌ ఇంటికి బీఆర్ఎస్ నేతలు, ఎవనిదిరా కుట్ర..ఏంది ఆ కుట్ర? అని మండిపడ్డ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్,నిజానికి ఉన్న దమ్మేంటో చూద్దామని సవాల్