PM Modi (Photo-ANI)

Hyd, Nov 22: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రచారం కూడా కీలకదశకు చేరుకుంది. ఎన్నికలు జరుగుతున్న ఇతర రాష్ట్రాల్లో ప్రచార గడువు ముగిసిన దృష్ట్యా అన్ని పార్టీలకు చెందిన అగ్రనేతలు తెలంగాణలో ప్రచారం కోసం క్యూ కడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మూడు రోజుల పాటు తెలంగాణలో పర్యటించనున్నారు.

కాంగ్రెస్‌కు వచ్చేది 20 సీట్లే, భట్టి గెలిచేది లేదు, సీఎం అయ్యేది లేదు, మధిర ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్‌

బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఈనెల 25వ తేదీన కామారెడ్డి, రంగారెడ్డి జిల్లాలో ప్రచారం చేయనున్నారు. 26వ తేదీన దుబ్బాక, నిర్మల్ పబ్లిక్ మీటింగ్‌లో పాల్గొననున్నారు. 27వ తేదీన మహబూబాబాద్, కరీంనగర్ పబ్లిక్ మీటింగ్, హైదరాబాద్‌లో రోడ్డు షోకు హాజరుకానున్నారు.

ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన షెడ్యూల్

►ఈనెల 25వ తేదీన మధ్యాహ్నం 1:25 గంటలకు దుండిగల్ విమానాశ్రయానికి చేరుకుని 2:05 గంటలకు చేరుకుంటారు.

►మధ్యాహ్నం 2:15 నుంచి 2:55 వరకు సభలో పాల్గొంటారు.

►ఆ సభ అనంతరం అక్కడి నుంచి బయలుదేరి సాయంత్రం 4:05 గంటలకు రంగారెడ్డి జిల్లాకు చేరుకుంటారు.

►సాయంత్రం 4:15 నుంచి 4:55 గంటల వరకు నిర్వహించనున్న బహిరంగ సభలో పాల్గొంటారు.

►అక్కడి నుంచి బయలుదేరి 7:35 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు.

►అక్కడి నుంచి రోడ్డు మార్గాన రాజ్ భవన్‌కు చేరుకుంటారు.

►25న రాత్రి రాజ్ భవన్‌లోనే బస చేయనున్నారు.

26వ తేదీన దుబ్బాక, నిర్మల్ పబ్లిక్ మీటింగ్

►ఉదయం 11:30 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు కన్హయ్య శాంతివనంలో జరిగే ఒక కార్యక్రమంలో పాల్గొంటారు.

►అక్కడి నుంచి నేరుగా మధ్యాహ్నం 2 గంటలకు దుబ్బాకకు వెళ్తారు.

►2:15 గంటల నుంచి 2:45 వరకు దుబ్బాకలో నిర్వహించే పబ్లిక్ మీటింగ్‌లో మోదీ పాల్గొంటారు.

►ఆ సభ అనంతరం నిర్మల్‌కు వెళ్లనున్నారు.

►మధ్యాహ్నం 3:45 నుంచి సాయంత్రం 4:25 వరకు బహిరంగ సభలో పాల్గొంటారు.

అక్కడి నుంచి దుండిగల్ విమానాశ్రయానికి చేరుకుని సాయంత్రం 5:45 గంటలకు తిరుపతికి బయలుదేరనున్నారు.

27వ తేదీన మహబూబాబాద్, కరీంనగర్ పబ్లిక్ మీటింగ్, హైదరాబాద్‌లో డ్డు షో.

►27వ తేదీన తిరుపతి నుంచి బయలుదేరి 11:30 గంటలకు హకీంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు.

►అక్కడి నుంచి మహబూబాబాద్ చేరుకుని మధ్యాహ్నం 12:45 నుంచి 1:25 వరకు నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు.

►ఆ సభ అనంతరం నేరుగా కరీంనగర్ బయలుదేరనున్నారు.

►2:45 గంటల నుంచి 3:25 వరకు కరీంనగర్ లో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు.

►అక్కడి నుంచి బయలుదేరి సాయంత్రం 4:40కి హైదరాబాద్ కు చేరుకుంటారు.

►సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు నిర్వహించే రోడ్ షోలో మోడీ పాల్గొంటారు.

►విమానాశ్రయం నుంచి ఈ రోడ్ షో ప్రారంభం కానుంది.

►రోడ్ షో అనంతరం నేరుగా హైదరాబాద్ నుంచి 6:25 గంటలకు ఢిల్లీకి తిరుగుపయనం కానున్నారు.