Realtor Murder in Hyderabad: అతను గురూజీ కాదు..హంతకుడు, నెల్లూరు రియల్టర్ భాస్కర్ రెడ్డి హత్య కేసులో విస్తుగొలిపే వాస్తవాలు, ఇంకా దొరకని ఆధ్యాత్మిక గురువు త్రిలోక్‌నాథ్ ఆచూకి, నలుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు
ఈ హత్య కేసులో పోలీసులు విచారణ వేగవంతం (Hyderabad police starts probe) చేశారు. హత్య కేసులో కీలక సూత్రధారి అయిన త్రిలోక్‌నాథ్ బాబా కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
Hyderabad, August 8: నెల్లూరుకు చెందిన రియల్టర్ భాస్కర్‌రెడ్డి హైదరాబాద్ లో దారుణ హత్యకు (Realtor Murder in Hyderabad) గురైన సంగతి విదితమే. ఈ హత్య కేసులో పోలీసులు విచారణ వేగవంతం (Hyderabad police starts probe) చేశారు. హత్య కేసులో కీలక సూత్రధారి అయిన త్రిలోక్‌నాథ్ బాబా కోసం గాలింపు చర్యలు చేపట్టారు. నిందితుని కోసం బెంగళూరు, చెన్నై, ఏపీలో పోలీసులు గాలిస్తున్నారు. ఇప్పటికే మల్లేష్, సుధాకర్, కృష్ణంరాజు, ఆర్‌ఎంపీ డాక్టర్ శ్రవణ్ ను అరెస్టు చేసినట్లు కేపీహెచ్‌బీ సీఐ లక్ష్మీనారాయణ తెలిపారు.
ఈ హత్య వెనుక అసలు కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. బాబా అక్రమాలను ప్రశ్నించినందుకే హత్య చేసినట్టు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. విదేశీ డబ్బు, గుప్త నిధుల వ్యవహారంపై ఆరా తీస్తున్నారు.కాగా స్థిరాస్తి వ్యాపారి గడ్డం విజయభాస్కర్‌రెడ్డిని పక్కా ప్రణాళికతోనే హత్య చేశారని ఆయన అల్లుడు జయసృజన్‌రెడ్డి పేర్కొన్నారు. కేపీహెచ్‌బీ ఠాణా పరిధిలో నెల్లూరుకు చెందిన విజయభాస్కర్‌రెడ్డి(63)ని హతమార్చి ఏపీలోని సున్నిపెంటలో మృతదేహాన్ని దహనం చేసిన విషయం తెలిసిందే.
ఈ విషయమై శనివారం జయసృజన్‌రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ.. గురూజీని విమర్శిస్తే చంపుతామని మల్లేశ్, సుధాకర్ అనే వ్యక్తులు గత నెల మొదట్లో తన మామను హెచ్చరించారని, దీనిపై పోలీసులకు ఫిర్యాదు కూడా చేసినట్లు చెప్పారు. కాగా హైదరాబాద్‌లో స్థిరాస్తి వ్యాపారి (Nellore Realtor Gaddam Vijay Bhasker Reddy) గత నెల కిడ్నాప్ అయిన విషయం తెలిసిందే. ఆహారంలో మత్తుమందు కలిపి హాస్టల్ నుంచి వ్యాపారి కిడ్నాప్ చేసి అనంతరం గుట్టుచప్పుడు కాకుండా హత్య చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. రంగంలోకి దిగిన పోలీసులు హాస్టల్ సమీపంలోని సీసీ కెమెరాలను పరిశీలంగా విజయ్‌భాస్కర్‌ను (Gaddam Vijay Bhasker Reddy) కారులో తీసుకెళ్తున్న దృశ్యాలు కంటపడ్డాయి. కారు నంబర్ ఆధారంగా దర్యాప్తు చేయగా.. నలుగురు కలిసి భాస్కర్‌ను హత్య చేసినట్లు బయటపడింది.
ఆధ్యాత్మిక గురువు త్రిలోక్‌నాథ్ అలియాస్ గురూజీ, మాజీ సైనికోద్యోగి మల్లేశ్, రియల్‌ఎస్టేట్ వ్యాపారి సుధాకర్, కృష్ణంరాజు వీరంతా ఈ హత్యను పథకం ప్రకారం తేల్చారని పోలీసులు తేల్చారు. విజయ్‌భాస్కర్‌రెడ్డి బ్యాగ్రౌండ్ ఏంటి? సీబీఐ, సీఐడీకి ఫిర్యాదు చేస్తానని ఎందుకు అంటున్నాడు? అతని వద్ద ఎన్ని వేల కోట్ల ఆస్తులు ఉన్నాయ్? అన్న అంశాలను ఆరా తీసేందుకు మల్లేశ్ కుమారుడిని ఏజెంట్‌గా పెట్టుకున్నారు. విజయ్‌భాస్కర్‌రెడ్డితో మచ్చిక చేసుకునేందుకు అతడు 5 నెలలుగా నివాసం ఉంటున్న నెస్ట్ అవే హాస్టల్‌కు పంపారు. మల్లేశ్ కుమారుడు విజయ్‌భాస్కర్‌రెడ్డితో సాన్నిహిత్యాన్ని పెంచుకున్నాడు. గత నెల 19న విజయ్‌భాస్కర్‌రెడ్డి ఇతర స్నేహితులతో పార్టీ చేసుకుంటుండగా ఆ విషయాన్ని గురూజీకి చెప్పాడు.
వెంటనే అతడి హత్యకు గురూజీ స్కెచ్ వేశాడు. ఆర్‌ఎంపీ శ్రావణ్ దగ్గర నిద్రమాత్రలు తీసుకొని పౌడర్‌గా చేసి మంచూరియాలో కలపాలని మల్లేశ్ కుమారుడికి చెప్పాడు. ప్లాన్‌ను పక్కాగా అమలు చేయటంతో అది తిన్న విజయ్‌భాస్కర్‌రెడ్డి, అతని స్నేహితులు నిద్రమత్తులోకి జారుకున్నారు. వెంటనే హాస్టల్‌కు వచ్చిన మల్లేశ్, సుధాకర్, కృష్ణంరాజు.. విజయభాస్కర్‌రెడ్డిని కారులో ఎక్కించుకుని శ్రీశైలం వైపు బయలుదేరారు. నిద్రమత్తులో ఉండగానే పిడిగుద్దులతో హత్యచేశారు.
శ్రీశైలం మార్గంలోని సున్నిపెంట వద్ద ఓ కాటికాపరిని సంప్రదించి తమ బంధువు చనిపోయాడని, దహనం చేయాలని హంతకులు నమ్మించారు. అందుకు అతనికి రూ.15 వేలు యూపీఐ ద్వారా చెల్లించారు. అనుమానం వచ్చిన కాటికాపరి దహనం చేసేముందు వాళ్లకు తెలియకుండా కట్టెలపై ఉన్న విజయ్‌భాస్కర్‌రెడ్డి మృతదేహన్ని ఫొటో తీసి పెట్టుకున్నాడు. మృతుడి ఫోన్ స్విచ్చాఫ్ ఉండటంతో అతని అల్లుడు సృజన్‌రెడ్డి కేపీహెచ్‌బీ పీఎస్‌లో 24వ తేదీన ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలించగా అసలు నిజం బయటపడింది.
.