భాగ్యనగరంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తాగుడుకు బానిసై శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నాడనే కారణంతో (physically and mentally Harresment her) పాటు అక్రమ సంబంధానికి అడ్డువస్తున్నాడనే నెపంతో భర్తను భార్య కత్తితో కిరాతకంగా పొడిచి హత్య (Wife Killed her husband with knife) చేసింది. ఈ ఘటన శనివారం సాయంత్రం నగరంలోని హబీబ్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. గోషామహల్ ఏసీపీ నరేందర్‌రెడ్డి, హబీబ్‌నగర్ ఇన్‌స్పెక్టర్ ఎం. నరేందర్‌లు తెలిపిన వివరాల ప్రకారం….మల్లేపల్లి అఫ్జల్‌సాగర్‌లో నివసించే రోషన్(34), లత దంపతులకు ఇద్దరు ఆడ పిల్లలు, కొడుకు సంతానం. రోషన్ కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. లతకు స్థానికంగా ఉండే యువరాజ్‌తో వివాహేతర సంబంధం ఉన్నది.
భర్త రోషన్ ఇంట్లో లేని సమయంలో యువరాజుతో లత సన్నిహితంగా ఉండేది. అలా కొన్ని రోజులు గడిచాక వీరి బంధానికి భర్త రోషన్ అడ్డువస్తున్నాడని భార్య గ్రహించింది. యువరాజు, లత శనివారం మధ్యాహ్నం ఏకాంతంగా ఇంట్లో ఉన్న సమయంలో అకస్మాత్తుగా భర్త ప్రత్యక్షం కావడంతో ఏం చేయాలో తోచక ప్రియుడు యువరాజుతో కలిసి కత్తితో పొడిచి చంపింది. విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు రక్తపు మడుగులో పడివున్న రోషన్ మృతదేహాన్ని స్వాదీనం చేసుకున్నారు. పంచనామ నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. నిందితులను ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. క్లూస్ టీమ్ సిబ్బంది వచ్చి రక్త నమూనాలను సేకరించారు. ఇదిలా ఉండగా ప్రియుడు యువరాజ్‌కు ఇదివరకే రెండు పెళ్లిళ్లు జరిగినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా మార్చురీకి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. తండ్రి హత్యకు గురికాగా, తల్లి కూడా పారిపోవడంతో వారి పిల్లలు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు.