Nellore Toxic Gas Leak: నెల్లూరు జిల్లాలో గ్యాస్ లీక్, ముగ్గురు దుర్మరణం, వింజమూరు మండలంలో చంద్రపడియ గ్రామంలో వెంకటనారాయణ యాక్టివ్ ఇంగ్రిడియంట్స్‌లో గ్యాస్ పైప్ లీక్

చంద్రపడియాలోని వెంకటనారాయణ యాక్టివ్ ఇంగ్రిడియంట్స్‌లో (Venkata Narayana Active Ingredients) రియాక్టర్ లోనికి వెళ్లే గ్యాస్ పైప్ లీక్ అవడంతో ఈ ప్రమాదం జరిగింది.

Representational Image (Photo Credits: ANI)

Nellore, May 11: నెల్లూరు జిల్లాలోని ‌వింజమూరు మండలం చంద్రపడియలోని (Chandrapadiya village) మంగళవారం తెల్లవారుజామున ఓ ఫ్యాక్టరీలో గ్యాస్ లీకై (Nellore Toxic Gas Leak) ముగ్గురు దుర్మరణం చెందారు. చంద్రపడియాలోని వెంకటనారాయణ యాక్టివ్ ఇంగ్రిడియంట్స్‌లో (Venkata Narayana Active Ingredients) రియాక్టర్ లోనికి వెళ్లే గ్యాస్ పైప్ లీక్ అవడంతో ఈ ప్రమాదం జరిగింది. విషయం తెలిసిన వెంటనే అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.

కాగా కెమికల్‌ ఫ్యాక్టరీలో హైడ్రోక్లోరిక్ యాసిడ్ గ్యాస్ లీకై అవడంతో ముగ్గురు విష వాయువును పీల్చడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వారిని ఆస్పత్రికి తరలించారు. ఈ కెమికల్‌ ఫ్యాక్టరీలో గతంలోనూ ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఫ్యాక్టరీ యాజమాన్యంపై కేసు నమోదు చేసిన పోలీసులు.. విచారణ చేపట్టారు.

కరోనాతో కొడుకు మృతి, తట్టుకోలేక గుండెపోటుతో తల్లిదండ్రులు కన్నుమూత, హైదరాబాద్ కాప్రాలో విషాద ఘటన, ఎన్నో కుటుంబాల్లో ఇలాంటి విషాద ఘటనలే..

మృతులను వింజామూర్‌కు చెందిన ఎస్.షరీఫ్, పి.శ్రీను, చౌతా భీమవరం నుంచి తిరుపతయ్యగా గుర్తించారు. ఈ సంఘటన జరిగిన వెంటనే, ఫ్యాక్టరీ యాజమాన్యం కార్మికులను నెల్లూరులోని ఆసుపత్రికి తరలించింది. వారిలో ముగ్గురు చికిత్స పొందుతూ మరణించారు. గత జూలైలో అదే కర్మాగారంలో బాయిలర్ పేలినప్పుడు ఒకరు మరణించారు మరియు ముగ్గురు గాయపడ్డారు.