Tollywood: సీఎం చంద్రబాబును రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కలుస్తున్నారనే వార్తలు అబద్దం, క్లారిటీ ఇచ్చిన చరణ్ పీఆర్ టీమ్, అసలు నిజం ఏంటంటే..

మరో హీరో జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి ఆయన సీఎంను కలుస్తున్నారంటూ వార్తలు వచ్చాయి.

News that Ram Charan and Junior NTR are meeting Chandrababu.. this is the real truth! (Photo-X)

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును హీరో రామ్ చరణ్ కలుస్తున్నారంటూ వార్తలు సోషల్ మీడియాలో వస్తున్న సంగతి విదితబే. మరో హీరో జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి ఆయన సీఎంను కలుస్తున్నారంటూ వార్తలు వచ్చాయి. వరద బాధితుల సహాయార్థం రెండు తెలుగు రాష్ట్రాలకు ఇద్దరూ చెరో రూ. 50 లక్షల చొప్పున విరాళం ప్రకటించిన సంగతి విదితమే. ఈ విరాళాలకు సంబంధించిన చెక్ లను ఈరోజు చంద్రబాబుకు వీరు అందిస్తారనే ప్రచారం జరిగింది.

అయితే, ఈ వార్తల్లో నిజం లేదని రామ్ చరణ్ పీఆర్ టీమ్ తెలిపింది. చరణ్ తన వ్యక్తిగత పర్యటనలో ఉన్నారని... చంద్రబాబును ఈరోజు ఆయన కలవడం లేదని స్పష్టం చేసింది. మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ కూడా ఈరోజున చంద్రబాబును కలవడం లేదని తెలుస్తోంది. తారక్ తన తాజా చిత్రం 'దేవర' ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారని ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి.

టాలీవుడ్ లో విషాదం.. ‘ముద్దబంతి నవ్వులో మూగబాసలు..’ వంటి హిట్‌ సాంగ్స్ అందించిన పాటల రచయిత గురు చరణ్‌ ఇకలేరు

ఏపీలో వరద బీభత్సం పట్ల తెలుగు సినీ పరిశ్రమ ఉదారంగా స్పందించిన సంగతి విదితమే. నందమూరి బాలకృష్ణ రూ.50 లక్షలు, యువ హీరోలు సిద్ధు జొన్నలగడ్డ రూ.15 లక్షలు, విష్వక్సేన్ రూ.5 లక్షలు విరాళంగా ఇవ్వనున్నట్టు ప్రకటించారు. ఈ నేపథ్యంలో... బాలయ్య, సిద్ధు, విష్వక్సేన్ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి తాము ప్రకటించిన విరాళాల తాలూకు చెక్ లను అందించారు. ఈ సందర్భంగా చంద్రబాబు వారిని మనస్ఫూర్తిగా అభినందించారు. వరద బాధితుల తరఫున కృతజ్ఞతలు తెలియజేశారు.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif