Night Curfew Lifted in AP: ఏపీలో నైట్ కర్ఫ్యూ ఎత్తివేత, ప్రతీ ఒక్కరూ మాస్కులు కచ్చితంగా ధరించే నిబంధన అమల్లోకి, రాష్ట్రంలో ఫీవర్ సర్వే కొనసాగించాలని సీఎం ఆదేశాలు
క్రమంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. ఈ నేపథ్యంలో సీఎం వైఎస్ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో రాత్రి కర్ఫ్యూను ఎత్తివేస్తున్నట్టు (Night Curfew Lifted in AP) తెలిపారు. ప్రతీ ఒక్కరూ మాస్కులు కచ్చితంగా ధరించే నిబంధన అమలు చేయాలని నిర్ణయించారు.
Amaravati, Feb 14: ఏపీలో కోవిడ్ వ్యాప్తి పూర్తిగా తగ్గుముఖం పడుతోంది. క్రమంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. ఈ నేపథ్యంలో సీఎం వైఎస్ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో రాత్రి కర్ఫ్యూను ఎత్తివేస్తున్నట్టు (Night Curfew Lifted in AP) తెలిపారు. ప్రతీ ఒక్కరూ మాస్కులు కచ్చితంగా ధరించే నిబంధన అమలు చేయాలని నిర్ణయించారు. దుకాణాలు, వ్యాపార సముదాయాల్లో కోవిడ్ జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించేలా చూడాలని అధికారుల్ని సీఎం జగన్ ఆదేశించారు.గత కొన్నిరోజులుగా ఏపీలో రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ (Night curfew lifted in Andhra Pradesh) అమలు చేయడం తెలిసిందే.
రాష్ట్ర వ్యాప్తంగా ఫీవర సర్వే కొనసాగించాలన్న సీఎం జగన్ (CM Jagan) లక్షణాలు ఉన్నవారికి టెస్టులు చేయాలని అధికారులకు సూచించారు. వైద్య ఆరోగ్య శాఖలో రిక్రూట్‌మెంట్‌ను త్వరగా పూర్తిచేయాలని సీఎం జగన్ ఆదేశించారు. సిబ్బంది తప్పనిసరిగా ఆస్పత్రుల్లో ఉండేలా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. పరిపాలనా బాధ్యతలను అందులో నిపుణులైన వారికి అప్పగించాలని తెలిపారు. దుకాణాల వద్ద, షాపింగ్ మాల్స్ లో ప్రజలు కరోనా జాగ్రత్తలు తీసుకునేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.
గిరిజన ప్రాంతాల్లో పనిచేసే స్పెషలిస్టు వైద్యులకు, వైద్యులకు ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇవ్వనున్నట్టు సీఎం వెల్లడించారు. స్పెషలిస్టు వైద్యులకు ఇస్తున్న మూలవేతనంలో 50శాతం, వైద్యులకు 30 మేర ప్రత్యేక ప్రోత్సాహకంగా ఇచ్చేలా మార్గదర్శకాలు తయారు చేసినట్టు అధికారులు సీఎం జగన్‌కు తెలిపారు. ఇదిలా ఉంటే ఏపీలో గత రెండు వారాలుగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. తాజా బులెటిన్ లో 434 కొత్త కేసులు నమోదైనట్టు వెల్లడించారు. పలు జిల్లాల్లో సింగిల్ డిజిట్ లోనే కొత్త కేసులు వచ్చాయి. కేసులు తక్కువగా వస్తున్న అంశాన్ని అధికారులు నేటి సమీక్షలో సీఎం జగన్ కు వివరించారు.