Amaravati Farmers: రైతులకు ఎటువంటి అన్యాయం జరగదు, చట్టంలో రైతుల ప్రయోజనాలను పూర్తిగా పరిరక్షించాం, ఈ నిర్ణయం ఏకపక్షం కాదు, హైకోర్టుకు తెలిపిన ఏపీ ప్రభుత్వం
గత కొంత కాలంగా ఏపీలో రాజధాని మార్పు మీద రగడ జరుగుతున్న విషయం విదితమే. పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా ఏపీ ప్రభుత్వం పాలనా వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు బిల్లులును తీసుకువచ్చిన సంగతి విదితమే. దీంతో అమరావతి రైతులకు (Amaravati capital region Farmers) అన్యాయం జరుగుతుందని ప్రతిపక్షాలు విమర్శలు చేశాయి. చట్టాలను సవాలు చేస్తూ హైకోర్టులో ( AP High Court) ఇటీవల పలు వ్యాజ్యాలు దాఖలయ్యాయి. వీటిపై గతవారం విచారణ జరిపిన త్రిసభ్య ధర్మాసనం పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని (AP Government) ఆదేశించింది. విచారణను ఈ నెల 14కి వాయిదా వేస్తూ, అప్పటి వరకు కార్యాలయాల తరలింపుపై యథాతథస్థితి కొనసాగించాలని హైకోర్టు ఆదేశించింది.
Amaravati, August 14: గత కొంత కాలంగా ఏపీలో రాజధాని మార్పు మీద రగడ జరుగుతున్న విషయం విదితమే. పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా ఏపీ ప్రభుత్వం పాలనా వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు బిల్లులును తీసుకువచ్చిన సంగతి విదితమే. దీంతో అమరావతి రైతులకు (Amaravati capital region Farmers) అన్యాయం జరుగుతుందని ప్రతిపక్షాలు విమర్శలు చేశాయి. చట్టాలను సవాలు చేస్తూ హైకోర్టులో ( AP High Court) ఇటీవల పలు వ్యాజ్యాలు దాఖలయ్యాయి. వీటిపై గతవారం విచారణ జరిపిన త్రిసభ్య ధర్మాసనం పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని (AP Government) ఆదేశించింది. విచారణను ఈ నెల 14కి వాయిదా వేస్తూ, అప్పటి వరకు కార్యాలయాల తరలింపుపై యథాతథస్థితి కొనసాగించాలని హైకోర్టు ఆదేశించింది.
హైకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం తరపున పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక కార్యదర్శి రామ మనోహరరావు కౌంటర్ దాఖలు చేశారు. పాలనా వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు చట్టాల వల్ల అమరావతికి భూములిచ్చిన రైతుల ప్రాథమిక హక్కులకు ఎటువంటి భంగం వాటిల్లడం లేదని (No injustice will be done to Amaravati farmers) రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. ఈ వ్యాజ్యాలను శుక్రవారం త్రిసభ్య ధర్మాసనం విచారించనుంది. రాజధాని తరలింపులో కీలక ట్వీస్టు, రంగంలోకి సచివాలయ ఉద్యోగులు, అమరావతి పరిరక్షణ సమితి అన్నీ అబద్దాలు చెప్పిందంటూ హైకోర్టులో అనుబంధ పిటిషన్
ఈ చట్టాల్లో రైతుల ప్రయోజనాలను పూర్తిగా పరిరక్షించామని పేర్కొంది. విస్తృత ప్రజా ప్రయోజనాల నిమిత్తం ఏ చట్టాన్నైనా రద్దు చేసే అధికారం రాష్ట్రానికి ఉందని నివేదించింది. మాస్టర్ ప్లాన్‌ను ఎప్పుడు కావాలంటే అప్పుడు మార్చుకోవచ్చునని, దాని ఆధారంగా మాట్లాడటం సరికాదని కోరింది. గత నిర్ణయాన్ని పునఃసమీక్షించడానికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ప్రధాన కారణమని తెలిపింది. తాము ఇప్పుడు తీసుకున్న నిర్ణయం ఏకపక్ష నిర్ణయం కాదని, పలు సంస్థలు జరిపిన అధ్యయనాల ఆధారంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు హైకోర్టుకు నివేదించింది. రాజధానిని మార్చుకోండి, కేంద్రం రాజధాని మార్పు విషయంలో జోక్యం చేసుకోదని తెలిపిన ఏపీ బీజీపీ అధ్యక్షుడు సోము వీర్రాజు
రాజ్యాంగంలోని అధికరణ 38కి లోబడే నిర్ణయం చట్టాల జరిగింది. దీని ప్రకారం వివిధ ప్రాంతాల పట్ల అసమానతలు చూపడానికి వీల్లేదు. అన్నీ ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. వ్యక్తులకు జరిగే నష్టం, విస్తృత ప్రజా ప్రయోజనాల మధ్య వైరుద్ధ్యం వచ్చినప్పుడు న్యాయస్థానాలు విస్తృత ప్రజా ప్రయోజనాల వైపే మొగ్గు చూపాలి. ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు అనేక తీర్పుల ద్వారా చెప్పిందని కోర్టుకు ఏపీ ప్రభుత్వం తెలియజేసింది.
నిపుణుల కమిటీ, బోస్టన్ కన్సల్టెన్నీ గ్రూపు రిపోర్ట్, హైపవర్ కమిటీ రిపోర్ట్‌ల నివేదికలను ఆధారంగా చేసుకునే హేతుబద్ధమైన నిర్ణయం తీసుకున్నాం. పాలన వికేంద్రీకరణకు వ్యతిరేకంగా అమరావతిలోనే ప్రభుత్వ కార్యాలయాలు, న్యాయస్థానాలు ఉండాలని పిటిషనర్లు కోరడం న్యాయబద్ధం కాదని తెలిపింది.
(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)