House Searching For AP CM: సీఎం జగన్ కోసం విశాఖ బీచ్ రోడ్డులో ఇంటి కోసం అధికారుల అన్వేషణ.. మంత్రుల కోసం కూడా..

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఉండేందుకు విశాఖపట్టణం బీచ్ రోడ్డులో అనువైన ఇంటి కోసం అధికారులు వెతుకుతున్నారు.

YS Jagan (Photo-Twitter)

Visakhapatnam, Feb 6: ఏపీ (AP) ముఖ్యమంత్రి (Chief Minister) వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి (YS Jagan) ఉండేందుకు విశాఖపట్టణం (Visakhapatnam) బీచ్ రోడ్డులో (Beach Road) అనువైన ఇంటి కోసం అధికారులు వెతుకుతున్నారు. వీవీఎంఆర్‌డీఏ అధికారులు ఇటీవల ఇదే ప్రాంతంలో రహదారి విస్తరణ పనులు చేపట్టడాన్ని చూస్తే సీఎం నివాసం ఈ దారిలోనే ఉండే అవకాశం ఉందని పలువురు చెబుతున్నారు.

300 మంది ప్రయాణిస్తున్న విమానం టేకాఫ్ అవుతున్న సమయంలో ఇంజిన్ లో మంటలు.. వీడియో వైరల్

మరోవైపు, మంత్రులు కూడా తమకు అనుకూలమైన ఇళ్ల కోసం విశాఖ అంతటా గాలిస్తున్నట్టు సమాచారం. ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని త్వరలోనే విశాఖకు తరలిపోతుందని, తాను అక్కడి నుంచే పాలన సాగిస్తానని జగన్ ఇటీవల ఢిల్లీలో ప్రకటించారు. ఈ క్రమంలోనే విశాఖలో పలు అభివృద్ధి పనులు పుంజుకున్నట్టు తెలుస్తుంది. ఐతే, దీనిపై ఇప్పటివరకూ ఎలాంటి అధికారిక ఉత్తర్వులు వెలువడలేదు.

టర్కీ భూకంప బాధితుల సహాయానికి ఎన్డీఆర్ఎఫ్.. 4 వేలు దాటిన మృతుల సంఖ్య