AP Coronavirus: శుభవార్త, ఏపీలో 7 లక్షలు దాటిన డిశ్చార్జ్ కేసులు, యాక్టివ్‌గా కేవలం 46,295 కేసులు మాత్రమే, తాజాగా 5,210 మందికి కరోనా, 30 మంది మృతితో 6,224కు చేరుకున్న మరణాల సంఖ్య

ఈ రోజు నమోదయిన కేసులతో కలిపి మొత్తం రాష్ట్రంలో 7,55,727కు కరోనా కేసులు చేరాయి. గత 24 గంటల్లో కరోనాతో 30 మంది మృతి చెందారు. ఇప్పటివరకు కరోనాతో 6,224 మంది మృతి (Covid Deaths) చెందారు. ప్రస్తుతం ఏపీలో 46,295 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకుని 7,03,208 మంది రికవరీ అయ్యారు. ఇప్పటివరకు ఏపీలో 65.69 లక్షల కరోనా టెస్టులు నిర్వహించారు.

Coronavirus in India (Photo Credits: IANS)

Amaravati, Oct 11: ఏపీలో డిశ్చార్జ్ కేసులు (COVID-19 recoveries) 7 లక్షలు దాటాయి ఏపీలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 5,210 కరోనా కేసులు (AP Coronavirus) నమోదయ్యాయి. ఈ రోజు నమోదయిన కేసులతో కలిపి మొత్తం రాష్ట్రంలో 7,55,727కు కరోనా కేసులు చేరాయి. గత 24 గంటల్లో కరోనాతో 30 మంది మృతి చెందారు. ఇప్పటివరకు కరోనాతో 6,224 మంది మృతి (Covid Deaths) చెందారు. ప్రస్తుతం ఏపీలో 46,295 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకుని 7,03,208 మంది రికవరీ అయ్యారు. ఇప్పటివరకు ఏపీలో 65.69 లక్షల కరోనా టెస్టులు నిర్వహించారు.

ప్రకాశం 8, చిత్తూరు 4, శ్రీకాకుళం, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒకరు చొప్పున మృతి చెందారు. తూర్పుగోదావరి జిల్లాలో, గుంటూరు, కడప, విశాఖ జిల్లాల్లో ముగ్గురు చొప్పున మృతి చెందారు. అనంతపురం, కృష్ణా జిల్లాల్లో ఇద్దరు చొప్పున మృతి చెందారు.

కరోనా పాజిటివ్‌ బారినపడి చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలాన్ని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఫోన్‌లో పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. అధైర్యపడకుండా వైద్యుల సలహాలను పాటించాలని ఆయనకు సూచించినట్లు ఎమ్మెల్యే తనయుడు, సింగిల్‌ విండో డైరెక్టర్‌ కోనేటి సుమన్‌కుమార్‌ పేర్కొన్నారు.

కరోనా సెకండ్ వేవ్‌తో భయమేమి లేదు, దేశంలో తాజాగా 74,383 మందికి కరోనా, 70,53,807 కు చేరుకున్న కోవిడ్-19 కేసుల సంఖ్య, 1,08,334 కు పెరిగిన కరోనావైరస్ మరణాల సంఖ్య

కరోనా పాజిటివ్‌ రావడంతో ఎమ్మెల్యే తొలుత తిరుపతిలో ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందారు. మెరుగైన చికిత్స కోసం శుక్రవారం సాయంత్రం చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చేరారు. ఎమ్మెల్యేను డెప్యూటీ సీఎం నారాయణస్వామి, పంచాయతీరాజ్, గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సీఎం వ్యక్తిగత కార్యదర్శి కేఎన్‌ఆర్‌ పరామర్శించారు.

చిన్నారుల్లో కరోనా సందేహాలను నివృత్తి చేసేందుకు టోల్‌ ఫ్రీ నంబరును ఏర్పాటు చేసినట్టు బాలల సంక్షేమం, సంస్కరణల సేవలు, వీధి బాలలు, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ సంచాలకులు డాక్టర్‌ కృతికాశుక్లా చెప్పారు. కరోనా బారిన పడుతున్న చిన్నారులకు తగిన భరోసాను కల్పిస్తూ జాతీయ బాలల హక్కుల కమిషన్‌ 1800–121 2830 పేరిట టో ఫ్రీ నంబర్‌ను అందుబాటులోకి తెచ్చినట్టు పేర్కొన్నారు. దీనికి ఫోన్‌ చేస్తే నిపుణులైన కౌన్సెలర్లు, మానసికతత్వ శాస్త్ర నిపుణులు చిన్నారుల్లో మానసిక స్థైర్యం నింపేందుకు సహకరిస్తారని చెప్పారు.

కరోనాపై మరో షాకింగ్ న్యూస్, ప్రతి పదిమందిలో ఒకరు కోవిడ్ బారిన పడ్డారు, సంచలన విషయాలను వెల్లడించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ, మెజార్టీ జనాభాకు కరోనా ముప్పు ఉందని హెచ్చరిక

సోమవారం నుంచి శుక్రవారం వరకు ఉదయం పది నుంచి ఒంటి గంట వరకు, మధ్యాహ్నం మూడు నుంచి ఎనిమిది గంటల వరకు ఈ టోల్‌ ఫ్రీలో అందుబాటులో ఉంటుందన్నారు. నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెంటల్‌ సైన్స్, న్యూరో సైన్సెస్‌ సహకారంతో దీనిని నిర్వహిస్తున్నట్టు డాక్టర్‌ కృతికా శుక్లా వివరించారు.