Janasena Party Symbol: జనసేనకు ఊరట.. గ్లాసు గుర్తు కొనసాగింపు.. గాజు గ్లాసుతోనే స్థానిక సంస్థల ఎన్నికల్లో బరిలోకి పవన్ సేన.. ఏపీఎస్ఈసీ వద్ద బీఆర్ఎస్ రిజిస్టర్ చేసుకుంటే కారు గుర్తు కొనసాగింపు

ఆ పార్టీ ఎన్నికల గుర్తు గాజు గ్లాసును కొనసాగిస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఏపీఎస్ఈసీ) నిర్ణయం తీసుకుంది.

Pawan Kalyan (Photo-Twitter)

Vijayawada, June 24: స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు పవన్ కల్యాణ్ (Pawan Kalyan) సారథ్యంలోని జనసేన (Janasena) పార్టీకి ఊరట లభించింది. ఆ పార్టీ ఎన్నికల గుర్తు గాజు గ్లాసును (Glass) కొనసాగిస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఏపీఎస్ఈసీ-APSEC) నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. టీడీపీ, వైసీపీలను గుర్తింపు పొందిన పార్టీల జాబితాలో వాటి గుర్తులతో కొనసాగించగా, జనసేనను రిజర్వుడు సింబల్ కలిగిన రిజిస్టర్డ్ పార్టీల జాబితాలో చేర్చింది. గుర్తింపు పొందిన పార్టీల జాబితాలో ఉన్న ఆర్ఎల్‌డీని రిజిస్టర్డ్ పార్టీల జాబితాలో చేర్చినప్పటికీ దానికి గుర్తును రిజర్వు చేయలేదు.

Trains Cancelled: 36 రైళ్లను రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే.. ట్రాక్ మరమ్మతులు, నిర్వహణ పనుల కారణంగా రద్దు.. ప్రయాణికులు సహకరించాలన్న రైల్వే

బీఆర్ఎస్ కు కారు గుర్తు కొనసాగాలంటే..

కేసీఆర్ సారథ్యంలోని బీఆర్ఎస్ ఇతర రాష్ట్రాల్లో గుర్తింపు పొందిన రాష్ట్ర పార్టీల జాబితాలో ఉండేది. ఆ పార్టీ కొత్త పేరు, వివరాలతో ఏపీఎస్ఈసీ వద్ద రిజిస్టర్ చేసుకుంటే ఇతర రాష్ట్రాల్లో గుర్తింపు పొందిన రాష్ట్ర పార్టీల జాబితాలో చేర్చి కారు గుర్తు కొనసాగించనుంది.

Leopard Caught in Tirumala: తిరుమల మెట్ల మార్గంలో చిన్నారిపై దాడిచేసిన చిరుత ఎట్టకేలకు చిక్కిందోచ్.. గత రాత్రి బోనులో పడిన చిరుత.. ఇకపై నడక మార్గంలో భక్తులను గుంపులుగా పంపాలని టీటీడీ నిర్ణయం